రాజస్థాన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రాజస్థాన్
Map of India with the location of రాజస్థాన్ highlighted.
రాజధాని
 - అక్షాంశరేఖాంశాలు
జైపూర్
 - 26°54′N 75°48′E / 26.90°N 75.80°E / 26.90; 75.80
పెద్ద నగరం జైపూర్
జనాభా (2001)
 - జనసాంద్రత
56,473,122 (8వ స్థానం)
 - 165/చ.కి.మీ
విస్తీర్ణం
 - జిల్లాలు
342,236 చ.కి.మీ (1వ స్థానం)
 - 33
సమయ ప్రాంతం IST (UTC యుటిసి+5:30)
అవతరణ
 - [[రాజస్థాన్ |గవర్నరు
 - [[రాజస్థాన్ |ముఖ్యమంత్రి
 - చట్టసభలు (సీట్లు)
1956-11-01
 - ప్రభారావ్
 - అశోక్ గెహ్లాట్
 - ఒకే సభ (200)
అధికార బాష (లు) హిందీ, రాజస్థానీ
గుజరాతీకూడా మాట్లాడుతారు
పొడిపదం (ISO) IN-RJ
వెబ్‌సైటు: www.rajasthan.gov.in
రాజస్థాన్ రాష్ట్ర పక్షి బట్టమేక పిట్ట

రాజస్థాన్ (Rajasthan) (राजस्थान) భారత దేశంలో వైశాల్యం ప్రకారం అతి పెద్ద రాష్ట్రం. రాజస్థాన్ కు పశ్చిమాన పాకిస్తాన్ దేశం ఉంది. ఇంకా నైఋతిన గుజరాత్, ఆగ్నేయాన మధ్య ప్రదేశ్, ఈశాన్యాన ఉత్తరప్రదేశ్, హర్యానా, ఉత్తరాన పంజాబు రాష్ట్రాలు రాజస్థాన్ కు హద్దులు. మొత్తం రాజస్థాన్ వైశాల్యం 3లక్షల 42వేల చదరపు కి.మీ. (1,32,139 చదరపు మైళ్ళు)

రాజస్థాన్ రాష్ట్రంలో ప్రధానమైన భౌగోళిక అంశం థార్ ఎడారి. ఆరావళీ పర్వత శ్రేణులు రాజస్థాన్ భూభాగాన్ని మధ్యగా విడగొడుతున్నాయి. ఈ పర్వతాలు ఋతుపవనాలను అడ్డుకోవడం వల్ల పశ్చిమ ప్రాతంలో వర్షపాతం దాదాపు శూన్యం. అందువల్ల అది ఎడారిగా మారింది. మరొప్రక్క దట్టమైన అడవులతో గూడిన రణథంబోర్ నేషనల్ పార్క్ (పులులకు సంరక్షణాటవి), ఘనా పక్షి ఆశ్రయం, భరత్ పూర్ పక్షి ఆశ్రయం ఉన్నాయి. రాజస్థాన్ రాజధాని జైపూర్ నగరం.

చరిత్ర[మార్చు]

రాజపుత్రులచే పాలింపబడింది గనుక రాజస్థాన్ "రాజపుటానా" రాష్ట్రంగా వ్యవహరించేవారు. రాజస్థాన్ చరిత్రలో ఎక్కువకాలం యుద్ధప్రియులైన చిన్న చిన్న రాజపుత్ర వంశపు రాజుల పాలనలో సాగింది. ఈ ప్రాంతాన్ని బయటివారెవరూ పూర్తిగా ఆక్రమించలేకపోయారు. అయితే వేరు వేరు ఒడంబడికలద్వారా బ్రిటిష్ పాలకులు మాత్రం పెత్తనం చలాయించారు. ఈ విధమైన చరిత్ర వల్ల రాజస్థాన్ లో చాలా చారిత్రిక నిర్మాణాలు, కోటలు, సంస్కృతి విలక్షణంగా నిలబడ్డాయి. అందువల్లనే అక్కడ అభివృద్ధి కొరవడిందనీ, సమాజంలో అసమానతలు ప్రబలి ఉన్నాయనీ, స్త్రీలు బాగా వెనుకబడ్డారనీ కొదరి వాదన.

కోటలు[మార్చు]

రాజస్థాన్ లో ఎన్నో కోట కట్టడాలు ఇప్పటికీ క్షత్రియుల రాచరికానికి, చరిత్రకి అద్దంపడుతుంటాయి.

అచల్గర్ కోట: మౌంట్ అబూకి 11 కి. మీ. దూరంలో ఈ కోటను పరమార వంశస్థులు కట్టారు. తరువాత 1452లో ఈ కోటకు రాణా కుంభ అనే రాజు అచల్గర్ అని పేరు పెట్టాడు. ఈ కొటలో 1513 లో కట్టబడిన జైన్ దేవాలయాలు కూడా ఉన్నాయి.

సంస్కృతి[మార్చు]

రాజస్థాన్ లో ఇప్పటికీ ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఎక్కువగా ఉంది. ఆక్కడి స్త్రీలు ఆచారాలను, సంప్రదాయలను గౌరవిస్తారు, తూచా తప్పకుండా పాటిస్తారు. భారత దేశంలో విడాకుల సంఖ్య అతి తక్కువగా ఉన్న 2, 3 రాష్ట్రాలలో రాజస్థాన్ ఒకటి. దేశంలో ఇతర రాష్ట్రాలలో కాకుండా అక్కడి స్త్రీలు బయటకు ఒంటరిగా వెళ్ళుట, ఫ్యాషన్ గా ఉండుట కనిపించరు. సినిమా, మీడియా ప్రభావం అతి తక్కువగా ఉండటం, పురుషుల కట్టుబాట్ల పట్టింపు దీనికి కారణాలుగా చెప్పవచ్చు. అక్కడ ఇద్దరి వ్యక్తుల మధ్య వాగ్వివాదాలు అతి తక్కువ. పోలీసులు సాధారణంగా రోడ్ల పై కనిపించరు.

జిల్లాలు[మార్చు]

రాజస్థాన్ లో 33 జిల్లాలు ఉన్నాయి.

రాజస్థాన్ జిల్లాలు[మార్చు]

సంఖ్య కోడ్ ‌జిల్లా ముఖ్య పట్టణం జనాభా

(2011)

విస్తీర్ణం (కి.మీ.²) జన సాంద్రత (/కి.మీ.²)
1 AJ అజ్మీర్ అజ్మీర్ 25,84,913 8,481 305
2 AL ఆల్వార్ ఆల్వార్ 36,71,999 8,380 438
3 BI బికనీర్ బికనీర్ 23,67,745 27,244 78
4 BM బార్మర్ బార్మర్ 26,04,453 28,387 92
5 BN బన్‌స్వార బన్‌స్వార 17,98,194 5,037 399
6 BP భరత్‌పూర్ భరత్‌పూర్ 25,49,121 5,066 503
7 BR బరన్ బరన్ 12,23,921 6,955 175
8 BU బుంది బుంది 11,13,725 5,550 193
9 BW భిల్వార భిల్వార 24,10,459 10,455 230
10 CR చురు చురు 20,41,172 16,830 148
11 CT చిత్తౌర్‌గఢ్ చిత్తౌర్‌గఢ్ 15,44,392 10,856 193
12 DA దౌసా దౌస 16,37,226 3,429 476
13 DH ధౌల్‌పూర్ ధౌల్‌పూర్ 12,07,293 3,084 398
14 DU దుంగర్‌పూర్ దుంగర్‌పూర్ 13,88,906 3,771 368
15 GA శ్రీ గంగానగర్ శ్రీ గంగానగర్ 19,69,520 10,990 179
16 HA హనుమాన్‌గఢ్ హనుమాన్‌గఢ్ 17,79,650 9,670 184
17 JJ ఝున్‌ఝును ఝున్‌ఝును 21,39,658 5,928 361
18 JL జలోర్ జలోర్ 18,30,151 10,640 172
19 JO జోధ్‌పూర్ జోధ్‌పూర్ 36,85,681 22,850 161
20 JP జైపూర్ జైపూర్ 66,63,971 11,152 598
21 JS జైసల్మేర్ జైసల్మేర్ 6,72,008 38,401 17
22 JW ఝలావర్ ఝలావర్ 14,11,327 6,219 227
23 KA కరౌలి కరౌలి 14,58,459 5,530 264
24 KO కోట కోట 19,50,491 5,446 374
25 NA నాగౌర్ నాగౌర్ 33,09,234 17,718 187
26 PA పాలీ పాలీ 20,38,533 12,387 165
27 PG ప్రతాప్‌గఢ్ ప్రతాప్‌గఢ్ 8,68,231 4,112 211
28 RA రాజ్‌సమంద్ రాజ్‌సమంద్ 11,58,283 3,853 302
29 SK సికార్ సికార్ 26,77,737 7,732 346
30 SM సవై మధోపూర్ సవై మధోపూర్ 13,38,114 4,500 257
31 SR సిరోహి సిరోహి 10,37,185 5,136 202
32 TO టోంక్ టోంక్ 14,21,711 7,194 198
33 UD ఉదయ్‌పూర్ జిల్లా ఉదయ్‌పూర్ 30,67,549 13,430 242
రవివర్మ చిత్రించిన తైలవర్ణచిత్రం 134 రాజ్‌పుత్ సైనికుడు

ప్రసిద్ధులైన వారు[మార్చు]

రాజస్థాన్ చారిత్రిక కట్టడాలకూ, కోటలకూ, ఆసక్తికరమైన చరిత్రకూ ప్రసిద్ధం - భారతదేశంలో యాత్రికులను బాగా ఆకర్డించే రాష్ట్రాలలో ఒకటి - జైసల్మేర్కోటలో ఒకభాగం ఈ చిత్రంలో ఉంది.

రాజస్థాన్ చరిత్ర, సాహిత్యం ఎన్నో వీరగాధలతో నిండి ఉన్నాయి. ఎందరో త్యాగశీలురూ, ధైర్యశాలురూ చరిత్రలో గుర్తుండిపోయారు. వారిలో కొందరి పేర్లు

రాజకీయ నాయకులూ[మార్చు]

గణాంకాలు[మార్చు]

రాజస్థాన్ జిల్లాలు

మందిరాలు[మార్చు]

భారతదేశంలో చాలా పవిత్రంగా భావించే హిందూ, జైన మందిరాలు కొన్ని రాజస్థాన్‌లో ఉన్నాయి:

సమస్యలు[మార్చు]

  • నీటి కొరత రాజస్థాన్ లో తీవ్రమైన సమస్య.

ఇవీ చూడండి[మార్చు]

వనరులు[మార్చు]

  • Gahlot, Sukhvirsingh. 1992. RAJASTHAN: Historical & Cultural. J. S. Gahlot Research Institute, Jodhpur.
  • Somani, Ram Vallabh. 1993. History of Rajasthan. Jain Pustak Mandir, Jaipur.
  • Tod, James & Crooke, William. 1829. Annals & Antiquities of Rajasthan or the Central and Western Rajput States of India. 3 Vols. Reprint: Low Price Publications, Delhi. 1990. ISBN 81-85395-68-3 (set of 3 vols.)

బయటి లంకెలు[మార్చు]