ఆల్వార్ జిల్లా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఆల్వార్
అల్వార్
Alwar fort or Bala Quila 07.jpg
Kankwari Fort (Sariska Tiger Reserve).jpg
పైన: అల్వార్ కోట దిగువ: సరిస్కా టైగర్ రిజర్వ్‌లోని కంక్వారీ కోట
రాజస్థాన్ పటంలో అల్వార్ జిల్లా స్థానం
రాజస్థాన్ పటంలో అల్వార్ జిల్లా స్థానం
నిర్దేశాంకాలు (ఆల్వార్): 27°34′12″N 76°36′00″E / 27.57000°N 76.60000°E / 27.57000; 76.60000Coordinates: 27°34′12″N 76°36′00″E / 27.57000°N 76.60000°E / 27.57000; 76.60000
దేశం భారతదేశం
రాష్ట్రంరాజస్థాన్
ప్రధాన కార్యాలయంఆల్వార్
ఉప విభాగాలు
జనాభా వివరాలు
(2011[1])
 • మొత్తం3,674,179 [3rd in RJ]
భాషలు
 • అధికారికహిందీ
 • లింగ నిష్పత్తి(పురుషులు) 1000:894 (స్త్రీలు)
కాలమానంUTC+ 05:30 (భారత ప్రామాణిక కాలమానం)
జాలస్థలిఅధికారక వెబ్సైట్

రాజస్థాన్ రాష్ట్రంలోని జిల్లాలలో ఆల్వార్ జిల్లా ఒకటి. ఆల్వార్ పట్టణం జిల్లా కేంద్ర, గా ఉంది. జిల్లా వైశాల్యం 8,380 చ.కి.మీ. జిల్లా ఉత్తర సరిహద్దులో హర్యానా రాష్ట్రంలోని రేవార్ జిల్లా, తూర్పు సరిహద్దులో హర్యానా రాష్ట్రం లోని భరత్‌పూర్ జిల్లా, నూప్ జిల్లా, దక్షిణ సరిహద్దులో దౌస జిల్లా, పశ్చిమ సరిహద్దులో జైపూర్ జిల్లా, ఉన్నాయి.

2011 గణాంకాలను అనుసరించి రాజస్థాన్ రాష్ట్ర జిల్లాలలో జనసంఖ్యాపరంగా ఆల్వార్ జిల్లా అత్యంత అధిక జనసంఖ్య కలిగిన జిల్లాలలో మూడవదిగా గుర్తించబడింది. మొదటి రెండు స్థానాలలో జైపూర్, జోధ్‌పూర్ జిల్లాలు ఉన్నాయి.[2]

చరిత్ర[మార్చు]

గుర్జర్‌ప్రతిహార్ పాలనలో అతని మిత్రులు బద్గుజర్స్ కాలంలో ఈప్రాంతం కొంత ప్రాధాన్యత సంతరించుకుంది.1857లో సిపాయి కలహం సమయంలో రావు రాజా బనే సింగ్ ఆగ్రా నుండి బ్రిటిష్ బలగాలను తొలగించడానికి ముస్లిం, రాజపుత్రులు కలిసిన సైన్యాలను ఈ ప్రాంతానికి పంపాడు. ముస్లింలు ఈ ప్రాంతాన్ని వదిలారు. మిగిలిన వారు తిరుగుబాటు దారుల చేతిలో ఓడిపోయారు.1857లో రావు తలారాంతో యుద్ధం చేసిన ప్రాణ్ సుఖ్ యాదవ్ యుద్ధంలో మరణించిన సిపాయి బంధువులతో, జిల్లాలోని బెహరర్ తాలూకాలోని నిహల్పురా గ్రామంలో స్థిరపడ్డాడు. ఈప్రాంతం గుర్జరా- ప్రతిహరా స్వరాజ్యంలో భాగం అయింది. ఈ ప్రాంతం పూర్వం " మత్స్యనగరం " అని పిలువబడింది.

హిందూ చక్రవర్తి[మార్చు]

నీమ్రానా అల్వార్‌లో కొత్త నివాస భవనాలు

హిందూ చక్రవర్తి " హేమచంద్ర విక్రమాదిత్య " (హేము) ఆల్వార్ జిల్లాలోని దెవేటి మచ్చేరి గ్రామంలో జన్మించాడని భావిస్తారు. హేమచంద్ర విక్రమాదిత్య ఆఫ్గనులను, మొగలులను ఎదిరిస్తూ 22 యుద్ధాలు చేసాడు. హేమచంద్ర విక్రమాదిత్య అక్బర్తో యుద్ధంచేసి 1556 అక్టోబరు 7న ఢిల్లీ సింహాసనాన్ని అధిష్టించాడు. ఆల్వార్ జిల్లాను రాజస్థాన్ సింహద్వారంగా భావిస్తారు. జిల్లాలో అడవులు, బేసిన్లు అనేక పక్షులకు, జంతువులకు నెలవు.రాజపుత్రుల పురాతన రాజ్యాలలో ఆల్వార్ రాజ్యం ఒకటి.ఈ ప్రాంతం మత్స్యదేశంలో భాగంగా ఉంది.

పరిశ్రమలు[మార్చు]

జిల్లాలో భివాడి, షాజహాన్‌పూర్, నీమరన, బెహర్ లలో జి.ఎస్ ఫర్ంబుటర్, అషోక్‌లేలాండ్, పెప్సి, ప్యారీవేర్, కజర సెరామిక్స్, హోండా మోటర్ మాన్యుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ ఉన్నాయి.

పర్యాటక ఆకర్షణలు[మార్చు]

నీలకంఠ్ ఆలయం, అల్వార్ జిల్లా, రాజస్థాన్

ఆరవల్లి పర్వతాలలో ఉన్న బలా క్విలా (ఆల్వార్ ఫోర్ట్) ప్రస్తుతం రాజస్థాన్‌లో ఉన్న కోటలలో ఉత్తమైందిగా భావిస్తారు. ఈ కోట మీద ఎవరూ దండయాత్ర చేయకపోవడం ఈ కోట ప్రత్యేకత. ఇది నికుంబ మహల్‌కు సమీపంలో ఉంది.కోటలో పలు ఆకర్షణలు ఉన్నాయి. పెయింటింగ్స్, ఆయుధాలు, కవచాలు వంటి పలు పురాతన వస్తువులను భధ్రపరచిన మ్యూజియం వాటిలో ఒకటి. జిల్లాలో 6-9 మధ్యా కాలంలో నిర్మించబడిందని భావిస్తున్న పురాతన నీల్కాంత్ శివాలయం ఉంది.

బంఘర్ కోట[మార్చు]

ఆర్కిటెక్చర్ సర్వే ఆఫ్ ఇండియా బంఘర్ కోటను హంటెడ్ ఫోర్ట్ గా గుర్తిస్తుంది. సూర్యోదయానికి ముందుగానీ, సూర్యోదయానికి తరువాతగానీ, కోట ప్రాంతంలో ఉండకూడదని సర్వే ఆఫ్ ఇండియా ఒక బోర్డును పెట్టారు. ఈ కోట ప్రబల పర్యాటక ఆకర్షణగా ఉంది.[3]

ఇతర ఆకర్షణలు[మార్చు]

జిల్లాలో " సరిస్క టైగర్ రిజర్వ్ " ఉంది. జిల్లాలో అరవి నది ప్రవహిస్తుంది. కెస్రోలి వద్ద హిల్ ఫోర్ట్ కెస్రొలి ప్రస్తుతం సంప్రదాయ హోటెల్‌ ఉంది.

జనాభా గణాంకాలు[మార్చు]

2011 గణాంకాలు[మార్చు]

2011 భారత జనాభా లెక్కలు ప్రకారం అల్వార్ జిల్లా జనాభా మొత్తం 3,674,179, [2] భారతదేశ జిల్లాలలో జనాభాపరంగా ఇది 77 వ ర్యాంకుతో ఉంది.[2] జిల్లా జనసాంద్రత చ.కి.మీ.కు 438 (1130 చ.మై.) మందిని కలిగి ఉంది.[2] జిల్లా జనాభా 2001 తో పోల్చగా 2011 నాటికి 22.7% పెరిగింది.[2] లింగ నిష్పత్తి ప్రతి 1000 మంది పురుషులకు 894[2] జిల్లా మొత్తం అక్షరాస్యత 71.68%గా ఉంది.[2] జిల్లా మొత్తం జనాభాలో 2011 నాటికి 96.08% మంది హిందీ మాట్లాడేవారు ఉన్నారు.2.00% మంది పంజాబీ, 1.02% మంది బిల్ భాషను మాట్లాడేవారు ఉన్నారు.[4] జిల్లా జనాభాలో హిందువులు 82.72% ఉండగా, 15.90% మంది ఉన్నారు.మిగిలిన వారు 1.38%మంది ఉన్నారు.

చారిత్రికంగా జనాభా
సంవత్సరంజనాభా±% p.a.
19018,51,285—    
19118,11,689−0.48%
19217,18,788−1.21%
19317,68,324+0.67%
19418,43,576+0.94%
19518,61,896+0.22%
196110,89,561+2.37%
197113,90,724+2.47%
198117,55,217+2.35%
199122,95,648+2.72%
200129,91,552+2.68%
201136,74,179+2.08%
source:[5]

2001 గణాంకాలు[మార్చు]

విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 3,671,999, [2]
ఇది దాదాపు. లిబరియా దేశ జనసంఖ్యకు సమానం.[6]
అమెరికాలోని. ఒక్లహోమా నగర జనసంఖ్యకు సమం..[7]
640 భారతదేశ జిల్లాలలో. 77 వ స్థానంలో ఉంది.[2]
1చ.కి.మీ జనసాంద్రత. 438 [2]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 22.7%.[2]
స్త్రీ పురుష నిష్పత్తి. 894:1000 [2]
జాతియ సరాసరి (928) కంటే. తక్కువ
అక్షరాస్యత శాతం. 71.68%.[2]
జాతియ సరాసరి (72%) కంటే. తక్కువ

ప్రయాణ వసతులు[మార్చు]

  • జాతీయరహదారి - 8 (ఢిల్లీ-జైపూర్-అజ్మీర్_అహమ్మదాబాదు-బాంబే- రహదారి) జిల్లా గుండా పయనిస్తుంది. జాతీయ రహదారి -8 మార్గంలో (గురుగావ్-సొహ్న-ఆల్వార్) ఢిల్లీని చేరుకోవచ్చు.
  • ఢిల్లీ - జైపూర్ రైలు మార్గం, జిల్లా గుండా పయనిస్తుంది. ఆల్వార్ నగర్ రైల్వే స్టేషను జిల్లాలోని రైలు స్టేషనులలో ఒకటి.

చేరుకునే మార్గం[మార్చు]

అతి సమీప దూరంలో ఉన్న విమానాశ్రయాం జిల్లాకు 163 కి.మీ దూరంలో ఉంది. రహదారి మార్గంలో సులువుగా ఆల్వార్‌ను చేరుకోవచ్చు. జిల్లా నుండి ఢిల్లీ, సరిస్కా, భరత్‌పూర్, డీగ్, జైపూర్ వంటి పర్యాటక ఆకర్షిత గమ్యాలను చేరుకోవడానికి చక్కగా నిర్వహించబడుతున్న రహదార్లు ఉన్నాయి. రైలు మాగ్రాలు ఆల్వారును ఢిల్లీ, ముంబయి, ఇతర ప్రముఖ పర్యాటక ఆకర్షిత గమ్యాలతో అనుసంధానం చేస్తుంది.

నదులు[మార్చు]

ఆల్వార్ జిల్లాలో జీవనదులు లేవు. వర్షాకాలంలో మాత్రమే ప్రవహించే జలప్రవాహాలు మాత్రమే ఉన్నాయి. సొదవాస్ వద్ద జిల్లాలో సాహిబ్ నది, అర్వరి నది ఉన్నాయి. జలప్రవాహాల నీరు, వర్షపు నీటిని సేకరించడానికి జిల్లాలో పలుచోట్ల చిన్న చెక్ డామ్లు నిర్మించబడ్డాయి.

మూలాలు[మార్చు]

  1. https://www.citypopulation.de/php/india-rajasthan.php?adm2id=0806
  2. 2.00 2.01 2.02 2.03 2.04 2.05 2.06 2.07 2.08 2.09 2.10 2.11 2.12 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
  3. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2013-07-18. Retrieved 2014-11-13.
  4. 2011 Census of India, Population By Mother Tongue
  5. Decadal Variation In Population Since 1901
  6. US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01. Liberia 3,786,764 July 2011 est.
  7. "2010 Resident Population Data". U. S. Census Bureau. Archived from the original on 2011-08-23. Retrieved 2011-09-30. Oklahoma 3,751,351

సరిహద్దు జిల్లాలు, ప్రాంతాలు[మార్చు]

వెలుపలి లింకులు[మార్చు]