బరన్ జిల్లా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Location in Rajasthan
Baran
city
Country India
StateRajasthan
DistrictBaran
సముద్రమట్టం నుండి ఎత్తు
262 మీ (860 అ.)
జనాభా
(2001)
 • మొత్తం78,372
Languages
 • OfficialHindi
ప్రామాణిక కాలమానంUTC+5:30 (IST)
PIN
325205
Telephone code07453
వాహనాల నమోదు కోడ్RJ-28
జాలస్థలిhttp://www.baran.nic.in/

రాజస్థాన్ రాష్ట్ర 33 బరన్ జిల్లాలో బరన్ జిల్లా ఒకటి. జిల్లాకేంద్రంగా బరన్ పట్టణం ఉంది. 1948 అవిచ్ఛిన్న రాజస్థాన్ రూపొందించిన సమయంలో బరన్ రాజస్థాన్ జిల్లాలలో ఒకటిగా ఉంది. 1949 మార్చి 31 రాజస్థాన్ రాష్ట్రం పునర్విభజన చేయబడింది. బరన్ జిల్లాకేంద్రం కోట జిల్లా సబ్డివిషన్ కేంద్రంగా మార్చబడింది. 1991 ఏప్రిల్ 10న మునుపటి కోట జిల్లా నుండి బరన్ జిల్లా రూపొందించబడింది. జిల్లా కేంద్రం బరన్ పేరును జిల్లాకు ష్తిరీకరించారు.

చరిత్ర[మార్చు]

1947కు ముందు ప్రస్తుత బరన్ జిల్లాలో అత్యధిక భూభాగం కోట రాజస్థానంలో భాగంగా ఉండేది. షహదాబాదు తాలూకా ఝలావర్ రాజాస్థానంలో భాగంగా ఉండేది. అలాగే చబ్రా తాలూకా తోంక్ రాజాస్థానంలో ఉండేది. 1948లో అవిభాజిత రాజస్థాన్ రాష్ట్రం రూపొందించబడింది. అప్పుడు అవిభాజిత రాజస్థాన్ జిల్లాలలో బరన్ ఒక జిల్లాగా ఉండేది. జిల్లా ల్హలావర్ - బరన్ పార్లమెంటరీ నియోజకవర్గంలో భాగంగా ఉంది. జిల్లాలో 4 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి (అంటా, కిషంగంజ్, బరన్-అత్రు & చబ్రా, మంగ్రోల్, షహదాబాదు, చిపాబరోద్). 1947లో దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత రాజాస్థానాల పాలకులు తమ రాజ్యాలను భారతదేశంతో దేశంతో కలపడానికి అంగీకరించారు.

2001 లో గణాంకాలు[మార్చు]

విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 1,22,3921
పురుషుల సంఖ్య 635495
స్త్రీల సంఖ్య 588426
ఇది దాదాపు. ట్రినిడాడ్, టొబాగో దేశ జనసంఖ్యకు సమానం.
అమెరికాలోని. న్యూహాంప్ షైర్ నగర జనసంఖ్యకు సమం.
640 భారతదేశ జిల్లాలలో. 389 వ స్థానంలో ఉంది.
1చ.కి.మీ జనసాంద్రత. 175
2001-11 కుటుంబనియంత్రణ శాతం.
స్త్రీ పురుష నిష్పత్తి. 926:1000
జాతియ సరాసరి (928) కంటే.
అక్షరాస్యత శాతం.
జాతియ సరాసరి (72%) కంటే.
వైశాల్యం 6992
నగరప్రాంతం 82.18
అటవీ ప్రాంతం 2.17 చ. హెక్టార్లు
భాష హదోటి

చరిత్ర[మార్చు]

14-15వ శతాబ్దంలో బరన్ నగరం సోలంకి రాజపుత్రుల ఆధీనంలో ఉంది. సోలంకి ఆధీనంలో ఉన్న 12 గ్రామాలున్న ఈ భూభాగానికి బరన్ అని పేరు ఎప్పుడు వచ్చిందో కచ్చితంగా తెలియదు. ఈ విషయంలో పలు కథనాలు ఉన్నాయి. కొంతమంది ఇందులో 12 గ్రామాలున్నాయి కనుక ఇది బరన్ అయిందని కొందరు భావిస్తున్నారు. మరికొందరు ఈ నగరం సమీపగ్రామాలలోని 12 మంది గ్రామస్థులచేత స్థాపించబడింది కనుక ఇది బరన్ అయిందని భావిస్తున్నారు. ఉర్ధూలో బరన్ అంటే వర్షం. రాష్ట్రంలో అత్యధిక వర్షపాతం ఉన్న జిల్లాలలో బరన్ రెండవ స్థానంలో ఉంది కనుక దీనికి బరన్ పేరు వచ్చిందని కొందరు భావిస్తున్నారు. మొదటి స్థానంలో బన్‌స్వారా జిల్లా ఉంది.

Climate[మార్చు]

The City has a dry climate except in the monsoon seasons. The winter season runs from mid of November to February and summer season runs from March to mid of June. The period from mid of June to September is the monsoon season followed by the months October to mid of November constitute the post monsoon or the retreating monsoon. The average rainfall in the district is 895.2mm. January is the coldest month with the average daily maximum temperature of 24.3'C and the average daily minimum temperature of 10.6'C.

వాతావరణ అనుకూలం[మార్చు]

జిల్లాను సందర్శించడానికి అనుకూల వాతావరణం సెప్టెంబరు నుండి మార్చి వరకు. జిల్లా రైలు, రహదారి మార్గాలతో చక్కగా అనుసంధానితమై ఉంది. బరన్ నగరంలో కంప్యూటరైజ్డ్ రుజర్వేషన్ సౌకర్యం ఉంది.

ప్రయాణసౌకర్యాలు[మార్చు]

వాయుమార్గం[మార్చు]

జిల్లాకు సమీప " జైపూర్ ఇంటర్నేషనల్ విమానాశ్రయం ", ఉదయపూర్ విమానాశ్రయం, జోధ్‌పూర్ విమానాశ్రయాలు ఉన్నాయి. ఈ విమానాశ్రయాలు రాజస్థాన్ రాష్ట్రాన్ని ముంబయి ఢిల్లీ వంటి ప్రధాన నగరాలతో అనుసంధానిస్తున్నాయి. కోట, జైసల్మేర్ వద్ద రెండు విమానాశ్రయాలు ఉన్నప్పటికీ ఇవి పౌర విమానాలను అనుమతించవు.

రహదార్లు[మార్చు]

బరన్ నగరం పొరుగున ఉన్న నగరాలు, రాష్ట్రేతర ప్రాంతాలతో రహదారి మార్గాలతోచక్కగా అనుసంధానించబడి ఉంది. జాతీయ రహదారి 76 (ప్రస్తుతం జాతీయ రహదారి 27) జిల్లా నుండి పయనిస్తున్నాయి. జాతీయ రహదారి 76 ఈస్ట్ - వెస్ట్ కారిడార్‌లో భాగంగా ఉంది. 2011 గణాంకాలను అనుసరించి జిల్లాలో ఉన్న రహదార్ల మొత్తం పొడవు 2052 కి.మీ. ఢిల్లీ, జైపూర్, కోట, అజ్మీర్, జోధ్‌పూర్, ఉదయ్‌పూర్, ఇండోర్, ఉజ్జయిని నుండి నేరుబసులు ఉన్నాయి.

నగరాల మద్య దూరం[మార్చు]

రైల్వే[మార్చు]

బరన్ స్టేషను వెస్టర్న్ స్ర్ంట్రల్ రైల్వే సంబంధిత కోట్- బినా స్టేషను వద్ద ఉంది. ఇది కోట జంక్షన్‌కు 67 కి.మీ దూరంలో ఉంది. కంప్యూటరైజ్డ్ రిజర్వేషన్ సదుపాయం ఉంది.

ఆహారం[మార్చు]

డాల్‌బాటీకూర్మా చపాతీలు, రోటీలలతో తీసుకుంటారు.

ఆలయాలు[మార్చు]

తాడ్ఖా బాలాజీ (సాకేత్ ధాం)[మార్చు]

Shri Taad ka balaji -By Ajay Singh

బరన్ నగరంలో తాడ్ఖా బాలాజీ సాకేత్ ధాం ఉంది. ఈ ఆలయంలో పురాతనమైన హనుమాన్, జింద్ మహరాజ్, మాతాజీ, శివాజీ ఆలయాలు ఉన్నాయి. ఇప్పటికీ ఈ ఆలయం గురించిన 1000 సంవత్సరాల చరిత్ర గురించి క్లుప్తంగా తెలుసుకోవచ్చు. ఈ ఆలయం ప్రకృతి సౌందర్యం ప్రతిబింబించే వృక్షాల మధ్య ఉపస్థితమై ఉంది. ఈ ప్రాంతపు ప్రజలకు ఈ ఆలయం ఆధ్యాత్మిక కేంద్రంగా ఉంది.

షాని ధాం (బోర్డి)[మార్చు]

Shri Shani Dham Bordi-by- Shiva - Shiva Screen

శ్రీ శని ధాం బోర్డి బరన్ నగరానికి సమీపంలో ఉంది. ఇది ప్రఖ్యాతి చెందిన పురాతన శనిదేవుని, హనుమంతుని ఆలయం. ఇప్పటికీ ఈ ఆలయం గురించిన చరిత్ర క్లుప్తంగా లభిస్తుంది. ఈ ఆలయం ప్రకృతి సౌందర్యం ప్రతిబింబించే వృక్షాల మధ్య ఉపస్థితమై ఉంది.ఈ ప్రాంతపు ప్రజలకు ఈ ఆలయం ఆధ్యాత్మిక కేంద్రంగా ఉంది. ఈ ఆలయ సమీపంలో ప్రతి సంవత్సరం శని అమావాస్య సందర్భంలో ఉత్సవం నిర్వహించబడుతుంది. పషర్వనాథ్ చారిటీ ట్రస్ట్ ఆలయపరిరక్షణ బాధ్యతలు తీసుకుంటుంది.

మణిహరా మహదేవ్[మార్చు]

మణిహరా మహదేవ్ మందిర్ బరన్ నగరానికి 3 కి.మీ దూరంలో ఉంది. ఈ మందిరంలో పురాతన మహదేవ్‌జి, హనుమాన్‌జీ ఆలయాలు ఉన్నాయి.ఇప్పటికీ ఈ ఆలయం గురించిన 591 సంవత్సరాల చరిత్ర గురించి క్లుప్తంగా తెలుసుకోవచ్చు.ఈ ఆలయం ప్రకృతి సౌందర్యం ప్రతిబింబించే వృక్షాల మధ్య ఉపస్థితమై ఉంది.ఈ ప్రాంతపు ప్రజలకు ఈ ఆలయం ఆధ్యాత్మిక కేంద్రంగా ఉంది. ఈ ఆలయ సమీపంలో ప్రతి సంవత్సరం శివరాత్రి సందర్భంలో ఉత్సవం నిర్వహించబడుతుంది.

 • బర్దియా బాలాజీ
 • మంష పురాన్ గణేశ్ జీ
 • ప్యారే రాం జీ ఆలయం
 • శ్రీ జీ ఆలయం

పర్యాటక ఆకర్షణలు[మార్చు]

షహబాద్ కోట[మార్చు]

హదోతీ ప్రాంతంలో షహదాబాదు కోట ఉత్తమమైన, శక్తివంతమైన కోటలలో ఒకటి. ఇది బరన్ నగరానికి 80 కి.మీ దూరంలో ఉంది. 1521లో చౌహాన్ వంశానికి చెందిన ధంధేల్ రాజపుత్ ముకుత్మణి దేవ్ నిర్మించాడు. ఇది దట్టమైన అరణ్యం మద్య ఎత్తైన కొండల మీద నిర్మించబడింది. కోట ఇరువైపులా కుందకొ లోయలు ఉన్నాయి. మిగిలిన ఇరువైపులలో కోనేర్లు ఎత్తైన శిలలు ఉన్నాయి. టాప్ఖాన్, బరుద్ఖానా, కొన్ని ఆలయాలు ఇప్పటికీ సురక్షితంగా ఉన్నాయి. ఈ కోటలో 19 కెనాన్లు ఉండగా ఒక దాని ఎత్తు 18 అడుగులు ఉంటుంది.

 • 'నాగర్‌కోట్ మాతాజీ
NagarKot Mataji-by- H.N.Singh
 • Sita Baadi
 • శీతాబారి : ఇది ఒక విహార ప్రదేశం. బరన్ నగరానికి ఇది 45 కి.మీ దూరంలో ఉంది జాతీయ రహదారిలో శివ్‌పురి గ్వాలియర్ కూడలిలో ఉంది. ఇది ఆరాధనీయ ప్రాంతంగా కూడా ఉంది. రాముడు సీతను అడవిలో విడిచిన తరువాత సీతామాత ఇక్కడ నివసించిందని భావిస్తున్నారు. ఇక్కడ ఆలయ సమీపంలోని అటవీ ప్రాంతంలో లవకుశులు జన్మించారని భావిస్తున్నారు. ఇక్కడ వాల్మికి కుండ్, సీతా కుండ్, లక్ష్మణ్ కుండ్, సూర్యకుండ్, లవకుశ్ కుండ్, సీతాకుటీరం మొదలైనవి ఉన్నాయి. మే, జూన్ మాసాలలో ఇక్కడ గిరిజన సంత నిర్వహించబడ్జుతుంది.

షెర్ గర్ కోట[మార్చు]

చారిత్రాత్మకమైన షెర్ గర్ కోట హదోతి ప్రాంతంలో ఉంది. ఇది బరన్ నగరానికి 65 కి.మీ దూరంలో అత్రు తాలూకాలో ఉంది. దుర్భేధ్యమైన షెర్ గర్ కోట పర్బన్ నదీతీరంలో ఒక కొండమీద నిర్మించబడి ఉంది. ఈ కోట పట్టణానికి కొంచం దూరంగా ఉంది. ఇక్కడున్న క్రీ.శ 790 నాటి శిలాఫలకం ఈ ప్రాంతపు పురాతనత్వం వివరిస్తుంది. ఇది ఒకప్పుడు కొష్వర్దన్ అని పిలివబడింది. రాజస్థాన్లో ఉన్న గొప్ప కోటలలో ఇది ఒకటని భావించబడుతుంది.

నాహర్ గర్ కోట[మార్చు]

ఈ కోట బరన్ నగరానికి 73 కి.మీ దూరంలో కిషంగంజ్ తాలూకాలో ఉంది. ఎర్రని రాళ్ళతో ఆకర్షణీయంగా నిర్మించబడిన మొగల్ నిర్మాణవైభవానికి ఉదాహరణగా నిలిచింది.

కన్యాదేహ్[మార్చు]

కన్యా దేహ్ (బిలాస్ గర్) బరన్ నగరానికి 45కి.మీ దూరంలో కిషంగంజ్ తాలూకాలో ఉంది. కిషంగంజ్ - భంవర్గర్ రహదారిలో ఫల్ది గ్రామానికి వెళ్ళేదారిలో ఉంది. ఖెచి రాజ్యపాలనలో బిలాస్‌గర్ పెద్ద నగరంగా ఉండేది. దీనిని ఔరంగజేబు ఆఙతో శిథిలం చేసారు. ఖెచి రాకుమారి అందానికి ముగ్ధుడైన ఔరంగజేబు రాకుమారి కొరకు పంపిన సైన్యాలు బిలాస్‌గర్‌ను ధ్వంసం చేసాయి. తరువాత రాకుమారి బిలాసినదిలో మునిగి ప్రాణత్యాగం చేసింది. రాకుమారి ప్రాణత్యాగం చేసిన ప్రదేశం ఇప్పటికీ కన్యాదేహ్ అని పిలువబడుతుంది. బిలాష్‌గర్ శిథిలాలు ఇప్పటికీ దట్టమైన అరణ్యం మధ్య ఒంటరిగా దర్శనం ఇస్తున్నాయి.

భంద్ దేవరా (మినీ (కజోరహో))[మార్చు]

bhand devara

రాంగర్ - భంద్ దేవర ఆలయాలు బరన్ నగరానికి 40 కి.మీ దూరంలో ఉంది. రాంగర్ లోని శివాలయం 10వ శతాబ్దంలో నిర్మించబడిందని విశ్వసిస్తున్నారు. ఇది ఖజూరహోశైలిలో నిర్మించబడింది. ఇక్కడ ఆలయంలోని శిల్పాల ముద్రలను అనుసరించి ఈ ఆలయానికి బంధ్‌దేవర ఆలయం అని పేరు వచ్చింది. ఈ మందిరం ఒక కోనేరు తీరంలో నిర్మించబడింది. ఈ ఆలయం ప్రస్తుతం ఆర్కియాలజీ ఆధ్వర్యంలో ఉంది. ఈ ఆలయం రాజస్థాన్ మినీ కజూరహోగా గుర్తించబడింది. ఈ ఆలయాన్ని చేరడానికి జీబు లేక కారు ప్రయాణం ఉత్తమం.

రంగద్ మాతాజీ[మార్చు]

Ram Garh Mata ji - by H.N.Singh

రాంగర్ కొండ మీద కిస్నై, అన్నపూర్ణాదేవి సహజసిద్ధమైన గుహాలయాలు ఉన్నాయి. ఈ గుహాలయం చేరడానికి ఝలా జలిం సింగ్ 750 మెట్లు నిర్మించాడు. వీటిలో ఒక దేవతను మేవార్లు ఆరాధిస్తున్నారు. రెండవ దేవతను మాస్ - మదిర వారిచే ఆరాధించబడుతుంది. పరషద్ పూజలో రెండు దేవతల మద్య తెర వేయబడుతుంది. కార్తికపూర్ణిమ నాడు ఈ ఆలయ సమీపంలో ఉత్సవం నిర్వహించబడుతుంది.

కపిల్‌ధరా[మార్చు]

కపిల్‌ధరా బరన్‌ నగరానికి 50కి.మీ దూరంలో ఉంది. ఇది ప్రకృతి అందాలతో అలరారుతున్న ప్రశాంతప్రదేశంలో ఉంది. ఇది విహారానికి అనువైన ప్రదేశం. ఇక్కడ గోముఖం నుండి నిరంతరంగా నీరు ప్రవహిస్తూ ఉంటుంది.

కకోనీ[మార్చు]

కకోనీ బరన్ నగరం నుండి 85 కి.మీ దూరంలో చిపాబరోడ్ తాలూకాలో ఉంది. ఇది ముకుంద్రా పర్వతావళిలో మధ్యలో పరవానదీతీరంలో ఉంది. కకీనీ ఆలయాలు 8వ శబ్ధంలో నిర్మించబడ్డాయని భావిస్తున్నారు. ఇవి వైష్ణవ, శివ, జైనసంప్రదాయాలకు చెందినవి. ఈ ఆలయాల శిథిలాలు 60% కోట, ఖలావర్ జిల్లాలలో భద్రపరచబడి ఉన్నాయి. 1970 నుండి ఈ ప్రదేశం ఆర్కియాలజీ డిపార్ట్మెంటు ఆధ్వర్యంలో ఉంది.

 • భంవర్ గర్ కోట
 • రాంగర్ మాతాజీ

బ్రహ్మణి మాత ఆలయం[మార్చు]

బ్రహ్మణి మాత ఆలయం బరన్ నగరానికి 20 కి.మీ దూరంలోసొర్సన్ వద్ద ఉంది. ఆలయంలో 400 సంవత్సరాల నుండి అఖండ జ్యోతి నిరంతరంగా వెలుగుతూ ఉంటుంది. రాతి గుహలో సహజ సిద్ధమైన రాతి కింద బ్రహ్మిణీ మాతా శిల్పం ఉంది. శివరాత్రి సమయంలో ఈ ఆలయంలో ఒక ఉత్సవం నిర్వహించబడుతుంది.

ఉత్సవాలు , పండుగలు[మార్చు]

డోల్ మేళా[మార్చు]

బరన్ నగరంలోని ఝల్ఝుని అకద్షి డోల్ తలాబ్ (సరోవరం) వద్ద డోలా మేళా నిర్వహించబడుతుంది. ఈ ఉత్సవంలో ప్రధాన ఆకర్షణ ఇక్కడ పెద్ద ఎత్తున నిర్వహించబడుతున్న శోభాయాత్ర. ఈ యాత్రలో 54 దేవ్ విమానం (పవిత్రమైన అలంకృత రథాలు) లలో (వీటిని ప్రస్తుతం డోల్ అంటారు) నగరంలోని ప్రధాన ఆలయాల ఉత్సవమూర్తులు ఉత్సవానికి వస్తారు. ఈ ఉత్సవంలో కొందరు వారి దైవం గురించి వివరిస్తుంటారు. ష్రీజి నుండి ఆరంభమైన ఈ ఉత్సవం డోలాతలాబ్ వద్దకు చేరుతుంది. తరువాత ఇక్కడ దేవ్‌వినాలను పూజించిన తరువాత తిరిగి విమానాలు ఆలయాలకు చేరుకుంటాయి. 15 రోజులపాటు నిర్వహించబడే ఈ ఉత్సవంలో ప్రాంతీయ ప్రజలే కాక రాష్ట్రం మొత్తం నుండి, మధ్యప్రదేశ్ రాష్ట్రం నుండి ప్రజలు వస్తుంటరు. డోలాఉత్సవానికి ఈ ప్రాంతానికి ఈ ఉత్సవం ఒక చిహ్నంగా ఉంది. రాజస్థాన్ రాష్ట్ర ప్రధాన ఉత్సవాలలో ఇది ప్రధానమైన ఉత్సవంగా గుర్తించబడుతుంది.

పిప్లాడ్ క్రిస్మస్ పండుగ[మార్చు]

బరన్ జిల్లాలోని అత్రూ తాలూకాలోని పిప్లాడ్ గ్రామంలో ఉన్న ఒకేఒక చర్చిలో క్రిస్మస్ పండుగ ఘనంగా నిర్వహించబడుతుంది. ప్రతిసంవత్సరం డిసెంబరు 25న ఈ ఉత్సవం నిర్వహించబడుతుంది.

సీతా బరి మేళా[మార్చు]

పవిత్రమైన సితాబరి బరన్ నగరానికి 45 కి.మీ దూరంలో కెల్వారా కస్బా వద్ద ఉంది. జ్యేష్ట ఆమావాస్య నాడు ఇక్కడ పెద్ద గిరిజన ఉత్సవం నిర్వహించబడుతుంది. ఈ ప్రాంతంలో పలు కుండాలు ఉన్నాయి. సీతా, లక్ష్మణ్, లవకుశ కుండాలలో భక్తులు పవిత్రస్నానాలు ఆచరిస్తుంటారు. ఈ ఉత్సవానికి ఇక్కడకు లక్షలాది భక్తులు వస్తుంటారు. ఈ సందర్భంలో సహారియా గిరిజనులు స్వయంబర్ (స్వయంవరం) నిర్వహిస్తారు. ఈ స్వయంవరంలో సహారియా యువతి యువకుని చేతిరుమాలును స్వీకరించడం ద్వారా వివాహానికి తన అంగీరం తెలుపుతుంది. వధూవరులు బర్నవ చెట్టును 7 మార్లు ప్రదక్షిణం చేసిన తరువాత పెద్దల ఆశీర్వాదం తీసుకున్న తరువాత వారి వివాహం అంగీకరినచబడుతుంది. ఈ ఉత్సవంలో పశువుల సంత కూడా నిర్వహించబడుతుంది. సంతలో ఆవులు, బర్రెలు విక్రయించబడుతుంటాయి. ఈ ఉత్సవం గిరిజన జీవనసరళిని గురించి తెలుసుకోవడానికి అవకాశం కలిగిస్తుంది..

ఫుల్డోల్ పండుగ[మార్చు]

రాజస్థాన్ జానపద ఉత్సావాలలో ఇది ఒకటి. హోళీ సందర్భంలో కిషంగంజ్ పట్టణంలో ప్రతిసంవత్సరం నిర్వహించబడుతుంది. 120 సంవత్సరాలుగా ఈ ఉత్సవ సందర్భంలో పట్టణంలోని గృహాలలో తులసీ మాతకు చతుర్భుజనాథునికి వివాహం జరుపుతారు. గృహాలలో వివాహానంతరం వరుడు వధువు గృహానికి హోళీ పండుగ ఉత్సాహంగా జపుకోవడానికి వస్తుంటారు. చతుర్భుజుడు ఆరంభించిన ఈ ఉత్సవం ప్రతిగృహంలో అనుసరించబడుతుంది. హోళి పండుగ సందర్భంలో రాత్రంతా వీధులలో నాటకాలు ప్రదర్శించబడుతుంటాయి. వీధులలో గిధ్- రావణ్ - యుద్ధం, బంద్- బండి - స్వంగ్ మొదలైన ప్రదర్శనలు నిర్వహించబడుతుంటాయి. పట్టణానికి వెలుపల రాత్రి పెద్ద ఎత్తున ఫూల్‌డోలో పేరుతో శోభాయాత్ర నిర్వహించబడుతుంది. ఈ ఉత్సవానికి సమీపప్రాంతాల నుండి పలువురు ప్రజలు వస్తుంటారు.

బ్రాహ్మణి బాతాజీ మేళా[మార్చు]

ఈ ఉత్సవం బరన్ నగరానికి 20 కి.మీ దూరంలో ఉన్న సొర్సన్‌లోని పురాతన కోట సమీపంలో నిర్వహించబడుతుంది. ఇది హదోతి భూభాగంలో ఒకేఒక గాడిదల ఉత్సవంగా గుర్తించబడుతుంది.కోటలో బ్రాహ్మణి మాతాజీ ఆలయం ఉంది. ప్రతిసంవత్సరం మాఘ శుక్ల సప్తమి రోజున ఈ ఉత్సవం నిర్వహించబడుతుంది. ఈ ఉత్సవంలో విక్రయానికి ఇతర జంతువులను కూడా తీసుకువస్తుంటారు. అయినప్పటికీ అధికంగా గాడిదలు మాత్రమే విక్రయించబడుతుంటాయి.

నదులు[మార్చు]

కాళి సింధ్[మార్చు]

హదోతి భూభాగంలో ఇది ప్రముఖ్యత కలిగిన నది. మంగ్రోల్ తాలూకాలో ఈ నది 40కి.మీ పొడవున ప్రవహించిన తరువాత పరవన్ నదిలో సంగమిస్తుంది. ఈ నదిలో తరచుగా వరదలు సంభవిస్తుంటాయి. పలయ్థ వద్ద ఈ నదిమీద పెద్ద వంతెన నిర్మించబడింది. రాజస్థాన్ రాష్ట్రంలో ఈ వంతెన పొడవైనదిగా గుర్యింపును పొందింది.

పార్వతి నది[మార్చు]

Parvati River-by-H.N.Singh

బరన్ జిల్లాలోని ప్రధాన నదులలో పార్వతి నది ఒకటి. ఇది చంబల్ నది ఉపనదులలో ఒకటి. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని చంబా తాలూకా నుండి ప్రవహించి బరన్ జిల్లాలో ప్రవేశిస్తుంది. ఇది చంబ్రా, అత్రు, బరన్, మంగ్రోల్ నుండి కిషంగంజ్ తాలూకాను వేరుచేస్తుంది.

పర్వన్ నది[మార్చు]

పర్వన్ నది కాళిసింధ్ నదికి ఉపనది. హర్నవ్దష్హజి కసబ నుండి ప్రవహిస్తూ ఇది బరన్ జిల్లాలో ప్రవేశిస్తుంది. తరువాత ఇది బరన్, అత్రు, చిపాబరోద్, మగ్రోలిలలో ప్రవహించి కాళిసింధు నదిలో సంగమిస్తుంది.

అంధేరి[మార్చు]

అంధేరి నది చిపబరొద్ వద్ద బరన్ జిల్లాలో ప్రవేశిస్తుంది. ఈ నది మధ్యప్రదేశ్, రాజస్థాన్ మద్య సరిహద్దులా ప్రవహించి అత్రు వద్ద పార్వతి నదిలో సంగమిస్తుంది.

బాణ్ - గంగా[మార్చు]

బాణ్ గంగా నది బమ్లా, సెహ్రాడ్ లలో ప్రవహించి బరన్ జిల్లాలో ప్రవేశిస్తుంది. బరన్ నగరానికి తూర్పుగా, బొహత్, మంగ్రోలి కస్బ లకు పశ్చిమంగా ప్రవహించి ఈ నది పార్వతి నదిలో సంగమిస్తుంది.

వృక్షజాలం , జంతుజాలం[మార్చు]

జిల్లాలో ఆటవీప్రాంతం 2.17 లక్షల హెక్టార్లలో విస్తరించి ఉంది. ఇవి అధికంగా జిల్లా ఆగ్నేయ, భూభాగంలో ఉన్న ముకుంద్రా పర్వతాలలో విస్తరించి ఉంది. అటవీ ప్రాంతం సగవన్, ఖేర్, సలన్, గర్గ్సరి ప్రాంతాలలో ఉంది. పాంథర్, ఎలుగుబంటి, చిరుతపులి, అడవి ఎలుగుబంటి, చింకారా, సాంబార్, లంగూర్, జాకల్ మొదలైన జంతువులు బుల్‌బుల్, పిచ్చుక, నెమలి, సారస్ మొదలైన పక్షులు, త్రాచుపాము, పస్సెల్, వైపర్ మొదలైన విషపాములు ఉన్నాయి. సరసుల వద్ద నీటిపాములు కూడా కనిపిస్తుంటాయి. చంబల్, కాళిసింధ్ నది వంటి పెద్ద సరసుల వద్ద కొన్ని సార్లు మొసళ్ళు కూడా కనిపిస్తుంటాయి.

.

ఆధార సమాచారాలు[మార్చు]

 • ఎస్.టి.డి కోడ్- 07453
 • వాహన సంకేతం ఆర్.జె 28
 • పోస్టల్ కోడ్ - 325205

మూలాలు[మార్చు]

వెలుపలి లింకులు[మార్చు]

వెలుపలి లింకులు[మార్చు]