Coordinates: 24°35′N 76°10′E / 24.59°N 76.16°E / 24.59; 76.16

ఝలావర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఝలావర్
ఝలావర్ is located in Rajasthan
ఝలావర్
ఝలావర్
భారతదేశ పటంలో రాజస్థాన్ స్థానం
ఝలావర్ is located in India
ఝలావర్
ఝలావర్
ఝలావర్ (India)
ఝలావర్ is located in Asia
ఝలావర్
ఝలావర్
ఝలావర్ (Asia)
Coordinates: 24°35′N 76°10′E / 24.59°N 76.16°E / 24.59; 76.16
దేశం భారతదేశం
రాష్ట్రంరాజస్థాన్
జిల్లాఝలావర్
విభాగంకోట
Government
 • Typeమున్సిపల్ కౌన్సిల్
 • Bodyఝలావర్ నగర పాలక సంస్థ
Elevation
312 మీ (1,024 అ.)
జనాభా
 (2011)[1]
 • Total66,919
భాషలు
 • అధికారికహిందీ
Time zoneUTC+5:30 (భారత ప్రామాణిక కాలమానం)
Vehicle registrationRJ-17

ఝలావర్, భారత రాష్ట్రమైన రాజస్థాన్ లోని ఒక నగరం.ఇది రాజస్థాన్ రాష్ట్రం ఆగ్నేయ ప్రాంతంలో ఉంది.ఇది పూర్వపు రాచరిక రాజ్యం ఝలావర్ రాజధాని, ఝలావర్ జిల్లాకు పరిపాలనా ప్రధాన కార్యాలయం. ఝలావర్ ఒకప్పుడు బ్రిజ్ నగర్ అని పిలువబడింది.[2]

చరిత్ర

[మార్చు]

ఝలవార్ నగరాన్ని కోటా రాజ్యానికి చెందిన దీవాన్ బహుదూర్ (సా.శ. 1791) రాజ్‌పుత్ ఝుల జలీమ్ సింగ్ స్థాపించాడు.[3] అతను తరువాత ఈ పట్టణప్రాంతాన్నిచావోని ఉమేద్పురా అని పిలిచే ఒక సైనిక స్థావరంగా స్థాపించాడు.అప్పటి పట్టణప్రాంతం ఆ సమయంలోదట్టమైన అడవుల, వన్యప్రాణుల చుట్టూ ఉంది.

ఝుల జలీమ్ సింగ్ తరచూ వేట కోసం ఇక్కడకు వచ్చేవాడు.అతను ఈ స్థలాన్ని చూచి చాలా ఇష్టపడ్డాడు. దానిని పట్టణ ప్రాంతంగా అభివృద్ధి చేయాలనుకున్నాడు.ఈ కేంద్ర ప్రదేశం గుండా మాల్వా నుండి కోట వైపు మరాఠా ఆక్రమణదారులు, హడోటి రాష్ట్రాలను స్వాధీనం చేసుకోవాలనే లక్ష్యంతో ఈ స్థలాన్ని సైనికుల నివాసప్రాంతంగా అభివృద్ధి చేయాలనుకున్నాడు

ఈ ప్రదేశం ఝులా జలీమ్ సింగ్ గుర్తించాడు. దీనిని సైనికుల స్థావరాల పట్టణ ప్రాంతంగా అభివృద్ధి చేయడం ప్రారంభించాడు. తద్వారా అతను కోట రాష్ట్రానికి చేరుకునే ముందు మరాఠా ఆక్రమణదారులపై దాడి చేయడానికి,ఆపడానికి ఈ స్థలాన్ని ఉపయోగించుకున్నాడు. 1803-04లో చావోని ఉమేద్పురాను కంటోన్మెంట్ టౌన్ షిప్ గా అభివృద్ధి చేశాడు.1821 డిసెంబరులోఈ ప్రాంతాన్ని సందర్శించిన కల్నల్ టాడ్, ఈ ప్రాంతాన్ని ఝులా జలీమ్ సింగ్ స్థాపించిన కంటోన్మెంట్, పెద్ద ఇళ్ళు, హవేలిస్, చుట్టుపక్కల గోడలతో బాగా స్థిరపడిన పట్టణ ప్రాంతంగా అభివర్ణించాడు.

సా.శ. 1838 లో, ఇంగ్లీష్ పాలకులు ఝులావర్ రాష్ట్రాన్ని కోట రాజ్యం నుండి నుండి వేరుచేసి ఝులా జలీమ్ సింగ్ మనవడు ఝులా మదన్ సింగ్ కు ఇచ్చారు. ఝులావర్ రాజ్యాన్ని అభివృద్ధి చేయడానికి తన పరిపాలన సేవలను అభివృద్ధి చేశాడు.అతను చాలాకాలం ఝులావర్ పట్టణంలో నివసించాడు. సా.శ.1840 - 1845 లో గర్హ్ ప్యాలెస్ అనే గాజ భవనం నిర్మించడం ప్రారంభించాడు.అతను ఝులావర్ రాజ్యానికి మొదటి పాలకుడు.ఝులావర్ చరిత్రలో గణనీయమైన కృషి చేశాడు.ఝులా మదన్ సింగ్ 1838 నుండి 1845 వరకు ఝులావర్ ను పాలించాడు. అతని మరణం తరువాత, ఝులా పృథ్వీ సింగ్ ఝులావర్ పాలకుడు అయ్యాడు. అతను సుమారు 30 సంవత్సరాలు పరిపాలించాడు.

సా.శ. 1899 నుండి 1929 వరకు ఝులవార్ రాజ్యాన్ని పాలించిన రానా భవానీ సింగ్ జీ, ఝులావర్ రాజ్య అభివృద్ధిలో విశేష కృషి చేశాడు.సామాజిక కార్యకలాపాలు, ప్రజా పనులు (నిర్మాణం), విద్య, ఇతర పరిపాలన రంగాలలో అతని చురుకైన ప్రమేయం ఉంది.

పటాన్ లేదా ఝులావరా పటాన్ అని కూడా పిలువబడే ఝులవార్ ప్రధాన పట్టణం పేరులేని రాచరిక రాజ్యానికి వాణిజ్య కేంద్రంగా ఉంది.దానిలో నల్లమందు, నూనె గింజలు, పత్తి మొదలగునవి ప్రధాన ఎగుమతులుగా ఉండేవి.రాజ భవనం పట్టణానికి ఉత్తరంగా నాలుగు మైళ్ళు (6 కిమీ) దూరంలో ఉంది. పట్టణానికి సమీపంలో లభించిన విస్తృతమైన శిథిలాలు ప్రకారం చంద్రవతి అనే పురాతన నగరం ఔరంగజేబు పాలనలో ధ్వంసమైనట్లు చెబుతారు.దాని అవశేషాల ఉత్తమ లక్షణంగా సీతలేశ్వర్ మహాదేవ ఆలయాన్ని గుర్తించారు. (సి.600).

రాచరిక రాజ్యంగా ఝులావర్

[మార్చు]
1561 - గాగ్రౌన్ కోట గవర్నర్ కీలను అక్బర్‌కు అప్పగించాడు.

ఝులా కుటుంబానికి చెందిన రాజ్‌పుత్‌లు కుటుంబం ఝులావర్ మాజీ పాలకులు. ఝులా రాజ్‌పుత్ మహారాజాకు జులా కోటామధు సింగ్ అభిమానమయ్యాడు.అతని నుండి ఒక ముఖ్యమైన పదవిని అందుకున్నాడు. ఇది వంశపారంపర్యంగా మారింది. కోట రాజులు (1771) మరణించిన తరువాత, ఝులావర్ రాజ్యం మధు సింగ్ వారసుడు జులా జలీమ్ సింగ్ బాధ్యతకు వదిలివేయబడింది.

అప్పటి నుండి జలీమ్ సింగ్ కోట వాస్తవ పాలకుడు. నలభై ఐదు సంవత్సరాలుగా కొనసాగిన అతని పరిపాలనలో, కోట భూభాగాన్ని అన్ని పార్టీలు గౌరవించాయి. సా.శ 1838 లో, బ్రిటీష్ జోక్యం, అంతర్గత రాజకీయాలతో కోట రాజ్యాన్ని విచ్ఛిన్నం చేయాలనే నిర్ణయంతో, ఝులా జలీమ్ సింగ్ వారసులకు ప్రత్యేకంగా ఝులవార్ కొత్త రాజ్యాన్ని సృష్టించింది.కోట నుండి తెగిపోయిన జిల్లాలు కోట ఆదాయంలో మూడింట ఒక వంతు (120,000) ప్రాతినిధ్యం వహించాయి. ఒక ఒప్పందం ద్వారా వారు బ్రిటిష్ వారి ఆధిపత్యాన్ని అంగీకరించారు.వార్షిక కప్పం రూ. 8000/-ల ద్వారా మదన్ సింగ్ మహారాజు రాణా బిరుదు అందుకుంది. రాజపుతానా ఇతర ఉన్నతాధికారులను అదే హోదాలో ఉంచారు.

భౌగోళికం

[మార్చు]

ఝులవార్ 24°36′N 76°09′E / 24.6°N 76.15°E / 24.6; 76.15 వద్ద ఉంది.[4] ఇది 312 మీటర్లు (1023 అడుగులు) సగటు ఎత్తులో ఉంది.

వాతావరణం

[మార్చు]

ఈ ప్రాంతం వాతావరణం ఇండో-గంగా మైదానానికి సమానంగా ఉంటుంది. వేసవిలో ఉష్ణోగ్రత సాధారణంగా 40 °C (104 °F), గరిష్ఠంగా 45 °C (113 °F) మించి ఉంటుంది.శీతాకాలంలో అతి శీతల ఉష్ణోగ్రత 1 °C (34 °F) చేరుకుంటుంది. రాజస్థాన్ రాష్ట్రంలో ఝులావర్ ప్రాంతంలో అత్యధిక వర్షపాతం నమోదైంది. సగటున 35 అంగుళాల 890 మి.మీ.వర్షపాతం ఉంటుంది.[5]

జనాభా

[మార్చు]

2011 భారత జనాభా లెక్కల ప్రకారం, ఝలావార్ మొత్తం జనాభా 66,919 కాగా, వారిలో 34,765 మంది పురుషులు, 32,154 మంది మహిళలు ఉన్నారు. 0 నుండి 6 సంవత్సరాల వయస్సు గల జనాభా 8,919. ఝులావార్‌లో మొత్తం అక్షరాస్యత 48,145 కాగా, జనాభాలో 71.95% మంది పురుష అక్షరాస్యత 77.9%, స్త్రీల అక్షరాస్యత 65.5% ఉంది. షెడ్యూల్డ్ కులాలు జనాభా11,422 షెడ్యూల్డ్ తెగల 3,534 మంది ఉన్నారు.2011 లో ఝులావర్ పట్టణ పరిధిలో13595 గృహాలను కలిగి ఉంది.[1]

చూడవలసిన ప్రదేశాలు

[మార్చు]
 • గాగ్రోన్ ఫోర్ట్ [6]
 • భీమ్ సాగర్ ఆనకట్ట [7]
 • చంద్రభాగ ఆలయం [8]
 • కలిసింద్ ఆనకట్ట
 • గాగ్రోన్ దర్గా [9]
 • కలిసింద్ థర్మల్ పవర్ స్టేషన్
 • కొల్వి గుహలు

రవాణా

[మార్చు]

వాయు ద్వారా

ఝులావర్ పట్టణానికి ముందుగా నిర్ణయించిన ప్రకారం వాణిజ్య విమానాలతో సమీప విమానాశ్రయం కోటలోఉంది.ఇది ఝులావర్ పట్టణానికి 82 కి.మీ.దూరంలో ఉంది.కోట విమానాశ్రయం ఆదివారం తప్పించి వారానికి ఆరు రోజుల జైపూర్,న్యూ ఢిల్లీకి ఒకే విమానం నడుస్తుంది.ముందుగా నిర్ణయించిన ప్రకారం నడిచే వాణిజ్య విమానాలతో ప్రత్యామ్నాయ విమానాశ్రయం భోపాల్‌లోని రాజా భోజ్ విమానాశ్రయం. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌ దేవి అహిల్య బాయి హోల్కర్ విమానాశ్రయం, కోలానా విమానాశ్రయ ఝులావర్ నగరానికి సమీపంలో ఉన్నాయి.దీనిని చార్టర్డ్ విమానం ఉపయోగిస్తుంది.

రైలు ద్వారా

[మార్చు]

ఝులవార్‌లో కొత్తగా నిర్మించిన రైల్వే స్టేషన్ ఉంది. ఇది ఝులావర్ నుండి 2 కి.మీ.దూరంలో ఉంది.[10]

త్రోవ ద్వారా

[మార్చు]

ఝులావర్ పట్టణం జాతీయ రహదారి నంబర్ 52 లో ఉంది.చాలా ప్రభుత్వ బస్సులు ప్రయాణసౌకర్యానికి వసతిగా ఉన్నాయి.

ఉష్ణ విద్యుత్ కేంద్రం

[మార్చు]

కలిసింద్ థర్మల్ పవర్ స్టేషన్ ఝులావర్ పట్టణం నుండి 12 కి.మీ (7 మైళ్లు) దూరంలో ఉంది. దీనిని రాజస్థాన్ రాష్ట్ర విద్యుత్ ఉత్పాదన నిగమ్ నిర్వహిస్తోంది.[11][12] దీని చిమ్నీలు 275 మీటర్లు (902 అడుగులు), 202 మీటర్లు (663 అడుగులు) ఎక్కువ కలిగిన సౌకర్యంతో రెండు శీతలీకరణ టవర్లుఉంది. ఇది ప్రపంచంలోనే ఎత్తైంది.ఈ ప్రాజెక్టును బిజిఆర్ ఎనర్జీ సిస్టమ్స్ లిమిటెడ్ వారిచే నిర్మించబడింది.[13]

ప్రస్తావనలు

[మార్చు]
 1. 1.0 1.1 "Census of India: Jhalawar". censusindia.gov.in. Retrieved 22 December 2019.
 2. Jhalawar-Rajasthan. "History". jhalawar.rajasthan.gov.in (in ఇంగ్లీష్). Retrieved 16 September 2017.
 3. Shastri, R.P. (1971). "Jhala Zalim Singh (1730-1823)". Jhala Zalim Singh (1730-1823), the de facto ruler of Kota: who also dominated Bundi & Udaipur - Shrewd Politician, Administrator and Reformer. Printed at Raj Printing Works, 1971.
 4. "Maps, Weather, and Airports for Jhalawar, India". fallingrain.com.
 5. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-11-26. Retrieved 2021-01-29.
 6. "Jhalawar Tourism: Tourist Places in Jhalawar - Rajasthan Tourism". web.archive.org. 2017-09-17. Archived from the original on 2017-09-17. Retrieved 2021-03-01.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
 7. City, Jhalawar (2020). "Bhimsagar Dam - JhalawarCity". jhalawarcity.com. JhalawarCity. Archived from the original on 2020-11-29. Retrieved 2021-01-29.
 8. "ChandraBhaga Temple-JhalawarCity | Jhalarapatan". jhalawarcity.com. Archived from the original on 2020-11-29. Retrieved 2021-01-29.
 9. "Jhalawar.biz - Gagron Dargah - मिट्ठे महावली सरकार Jhalawar". jhalawar.biz. Archived from the original on 2019-02-23. Retrieved 2021-01-29.
 10. "Kota - Jhalawar City Passenger (UnReserved)/59838 Time Table/Schedule: Kota to Jhalawar WCR/West Central Zone - Railway Enquiry". indiarailinfo.com. Retrieved 17 November 2018.
 11. admin@steelguru.com. "First unit of coal based Kalisindh thermal power plant has commenced generation". SteelGuru India. Archived from the original on 2019-02-23. Retrieved 2021-01-29.
 12. "Kalisindh thermal power plant starts power generation". Business Standard India. Press Trust of India. 22 March 2014 – via Business Standard.
 13. "Rvunl.com Is For Sale". rvunl.com.

వెలుపలి లంకెలు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=ఝలావర్&oldid=3611232" నుండి వెలికితీశారు