Jump to content

ఆల్వార్

అక్షాంశ రేఖాంశాలు: 27°32′59″N 76°38′08″E / 27.549780°N 76.635539°E / 27.549780; 76.635539
వికీపీడియా నుండి
ఆల్వార్
బాలా క్విలా నుండి అల్వార్ నగరం
బాలా క్విలా నుండి అల్వార్ నగరం
Nickname: 
టైగర్ గేట్ ఆఫ్ రాజస్థాన్
ఆల్వార్ is located in Rajasthan
ఆల్వార్
ఆల్వార్
Coordinates: 27°32′59″N 76°38′08″E / 27.549780°N 76.635539°E / 27.549780; 76.635539
దేశం భారతదేశం
రాష్ట్రంరాజస్థాన్
జిల్లాఆల్వార్
Founded byవిక్రమ్ సంవత్
Government
 • Bodyపురపాలక సంఘం
విస్తీర్ణం
 • సిటీ8,380 కి.మీ2 (3,240 చ. మై)
Elevation
268 మీ (879 అ.)
జనాభా
 (2018)
 • సిటీ4,61,618
 • Rankరాజస్థాన్ రాష్ట్రంలో 8 ర్యాంకు
 • జనసాంద్రత55/కి.మీ2 (140/చ. మై.)
 • Metro
3,41,422
భాషలు
 • అధికారికహిందీ
Time zoneUTC+5:30 (భారత ప్రామాణిక కాలమానం)
పిన్‌కోడ్
301001
Vehicle registrationRJ-02

అల్వార్, భారతదేశ జాతీయ రాజధాని ప్రాంతంలోని ఒక నగరం.అల్వార్ జిల్లాకు ఇది ప్రధాన పరిపాలనా కేంద్రం.ఇది దక్షిణ ఢిల్లీకి 150 కి.మీ.దూరంలో, జైపూర్‌కు ఉత్తరాన 150 కి.మీ. దూరంలో ఉంది.అల్వార్ నగరం అనేక కోటలు, సరస్సులు, వారసత్వ నగరాలు, ప్రకృతి అందాలతో కూడిన పర్యాటక కేంద్రం. వీటిలో భంగార్ కోట, సరిస్కా పులుల సంరక్షణ కేంద్రం, సిలిసేర్ సరస్సు ఉన్నాయి.

శబ్దవ్యుత్పత్తి శాస్త్రం

[మార్చు]

అల్వార్ అనే పేరు ఉత్పన్నం గురించి చాలా సిద్ధాంతాలు ఉన్నాయి.కన్నిన్గ్హమ్ సాల్వ తెగ నుండి దాని పేరు తీసుకోబడింది. నిజానికి పూర్వం సాల్వాపూర్, తరువాతి కాలంలో సల్వార్, ఆ తరువాత హల్వార్, చివరికి ప్రస్తుత కాలంలో అల్వార్ గా మారింది.దీనిని ఆల్వార్ పూర్, ఆరావళి అని పిలిచేవారని, మరొక పాఠశాల ఆధారం నొక్కి చెబుతుంది. ఆ నగరానికి అలవల్ ఖాన్ మేవతి (నికుంబ్ రాజ్‌పుత్‌ల నుండి అల్వార్‌ను స్వాధీనం చేసుకున్న ఖాన్జాడా యోధుడు) పేరు పెట్టారు. అల్వార్ మహారాజు జైసింగ్ హయాంలో మహారాజా అలఘ్ రాజ్, మహారాజా కాకిల్ రెండవ కుమారుడు చేపట్టిన ఒక పరిశోధనలో " అంబర్ " అని వెల్లడించాడు.పదకొండవ శతాబ్దంలో ఈ ప్రాంతాన్ని పరిపాలించే కాలంలో, అతని భూభాగం ప్రస్తుత అల్వార్ నగరం వరకు విస్తరించింది. అతను 1106 విక్రమ్ సంవత్ (సా.శ.1049) లో అల్పూర్ నగరాన్ని స్థాపించాడు.అతని పేరు మీద చివరికి అల్వార్ అయింది.ఇది గతంలో ఉల్వార్ అని పిలువబడింది, కానీ జయ్ సింగ్ పాలనలో స్పెల్లింగ్ అల్వార్ గా మార్చబడింది.[1]

చరిత్ర

[మార్చు]

పురాతన చరిత్ర

[మార్చు]

అల్వార్ పురాతన పేరు సాల్వా లేదా సాల్వా (తెగ)కు వర్తించింది.[2][3] అల్వార్ 16 పురాతన మహాజనపదాలలో ఒకటైన మత్స్య రాజ్యంలో ఒకభాగం.[4] చివరలో వేద పాఠం (జైమినీయ బ్రాహ్మణుల), సాల్వ లేదా సాల్వి తెగ అని వర్ణించబడింది. కానీ కురుక్షేత్ర, కురు సామ్రాజం వేద తెగను ఆక్రమించి, దానిని జయించారు

కురు రాజ్యంపై దాడి చేసిన తరువాత సాల్వాలు, యమునా నది, రాజస్థాన్ లోని అల్వార్ రాజ్యంలో స్థిరపడ్డారు. తరువాత వారు వేదయుగం ముగిసే సమయానికి వేద సంస్కృతిని అంగీకరించారు.ఎందుకంటే వారు మిగిలిన కురులతో, మత్స్య రాజ్యానికి సమీపంలో ఉన్న సురసేన మహాజనపదతో కలిసిపోయారు.[5]

స్వాతంత్య్రానంతరం

[మార్చు]

1947లో భారతదేశం స్వాతంత్ర్యం పొందిన తరువాత అల్వార్ భారతదేశ ఆధిపత్యాన్ని అంగీకరించాడు. 1948 మార్చి 18 న, రాష్ట్రం భరత్‌పూర్, ధోల్‌పూర్, కరౌలి మూడు పొరుగు రాచరిక రాష్ట్రాలతో విలీనమై మత్స్య సంయుక్త రాష్ట్రాలుగా ఏర్పడింది. 1949 మే 15న, ఇది పొరుగున ఉన్న రాచరిక రాష్ట్రాలతో ఐక్యమైంది.అజ్మీర్ భూభాగం రాజస్థాన్ అల్వార్‌ను ప్రస్తుత భారత జాతీయ రాజధాని ప్రాంతంలో భాగంగా విలీనం చేశారు.ఫలితంగా అభివృద్ధి పనులలో భాగంగా, ఢిల్లీకి వేగంగా రైలు, తాగునీటి మెరుగుదలలతో సహా అదనపు అభివృద్ధి పనులు జరిగాయి.[6] ఇటరానా సైనిక నివాస ప్రాంతం అల్వార్ శివార్లలో ఉంది.

పర్యాటక ఆకర్షణలు

[మార్చు]
Fort View of Alwar
నీమ్రానా

ఢిల్లీ నుండి రాజస్థాన్‌కు ప్రయాణించేటప్పుడు అల్వార్ మొదటి ప్రధాన వారసత్వ నగరం. పర్యాటకులకు షేక్స్పియర్ వల్లా, మహారాజా (1998), సరిస్కా రాజభవనం వద్ద కరణ్ అర్జున్, దాదికర్ కోట, భరిగడ్, సాజన్ చాలే సాసురల్, తలాష్ (బాలీవుడ్ చిత్ర నిర్మాణాలకు ఆకర్షణ ప్రదేశం), హంట్ బిగిన్స్ , భంగార్ కోట ప్రదేశాలు దర్శించవచ్చు. మెగా అల్వార్ వాణిజ్య ఉత్సవం ప్రతి సంవత్సరం దుషేరా మైదానంలో జరుగుతుంది.అల్వార్ చేతితో తయారు చేసిన పాపియర్-మాచెకు పేరు గడించింది.

ఫెయిరీ రాణి, భారతదేశం జాతీయ నిధి (సాంస్కృతిక కళాఖండం), ప్రపంచంలోని పురాతన రైలు ఇంజను (సా.శ.1855), ఢిల్లీ, అల్వార్ మధ్య పర్యాటక లగ్జరీ రైలుగా పనిచేస్తుంది .

బాలా కిలా దీనిని ఆల్వార్ కోట అని కూడా పిలుస్తారు.ఇది నగరానికి సుమారు 300 మీటర్ల ఎత్తులో ఉంది. ఇది 15 వ శతాబ్దపు ఖాన్జాడా రాజ్‌పుత్ పాలకుడు హసన్ ఖాన్ మేవతిచే స్థాపించబడింది.ఇదిమట్టి పునాదులపై 10 వ శతాబ్దంలో నిర్మించిన కోట [7] ఆరావల్లి శ్రేణిలో ఉన్న ఈ కోట 5 కి.మీ.పొడవు,1.5 కి.మీ.వెడల్పుతో పెద్ద పెద్ద బురుజులు, పెద్ద ప్రవేశ ద్వారాలు, ఆలయాలు, కొన్ని నివాస ప్రాంతాలతో నిండి ఉంది.[8]

నగర రాజ భవనం

[మార్చు]

1793 లో రాజా భక్తవర్ సింగ్ నిర్మించిన వినయ్ విలాస్ మహల్ అని పిలువబడే సిటీ ప్యాలెస్, రాజ్‌పుతానా ఇస్లామిక్ నిర్మాణ శైలులను మిళితం చేస్తుంది.దాని ప్రాంగణంలో తామర ఆకారపు స్థావరాలపై పాలరాయి మంటపాలు ఉన్నాయి.ప్యాలెస్ గృహాలలో ఒకటి చక్రవర్తి చిత్రీకరిస్తున్న రాతప్రతులు సహా సేకరణ మ్యూజియం, బాబర్ జీవితం, రాజమాల చిత్రాలు, అతి చిన్న, పెద్ద చారిత్రిక కత్తులు, ముహమ్మద్ ఘోరీ, చక్రవర్తి అక్బర్, ఔరంగజేబు ఉపయోగించిన బంగారు దర్బార్ హాల్ ఉన్నాయి. జిల్లా కోర్టును కలిగి ఉన్న, జిల్లా పరిపాలనా కార్యాలయం ఇక్కడకు మార్చబడింది.[9]

మూసీ మహారాణి ఛత్రి

[మార్చు]

రాజు భక్తవర్ సింగ్, అతని రాణి మూసీ జ్ఞాపకార్థం ఈ సమాధిని వినయ్ సింగ్ 1815 లోనిర్మించాడు.

సరిస్కా పులుల సంరక్షణ కేంద్రం

[మార్చు]

సరిస్కా పులుల సంరక్షణ జాతీయ ఉద్యానవనం అల్వార్ నుండి కొద్ది కి.మీ. దూరంలో ఉన్న అరవాలి కొండలలో ఉంది.1955లో ఏర్పడిన పులుల సంరక్షణ కేంద్రం,1982లో జాతీయ ఉద్యానవనంగా ప్రకటించబడింది. ఇది పులులను ప్రపంచంలో విజయవంతంగా సంరక్షించిన మొదటి సంరక్షిత కేంద్రం.1978 లో భారతదేశ పులుల సంరక్షణలోభాగమైన ఈ అభయారణ్యం, అరుదైన పక్షులు, మొక్కలతో సహా ఇతర జాతులను కూడా సంరక్షిస్తుంది.[10]

భంగార్ కోట

[మార్చు]

భంగార్ కోట ప్రపంచంలోని నాల్గవ అత్యంత పురాతన రాజభవనం.ఇది ఆసియాలో అత్యంతపురాతన రాజభవనంగా గుర్తించబడింది.17 వ శతాబ్దంలో నిర్మించిన భంగార్ కోట, భగవంత్ దాస్ తన చిన్న కుమారుడు మాధో సింగ్ I కోసం నిర్మించాడు.ఈ కోట భారత పురావస్తు శాఖచే రక్షించబడిన ఒక స్మారక చిహ్నం.ఇతిహాసాలు, పారానార్మల్ కార్యకలాపాలకు అనుబంధంగా ఉంది.[11] ప్రపంచవ్యాప్తంగా సందర్శకులకు ఇది ఒక పర్యాటక ఆకర్షణగా ఉంది.[12]

రవాణా

[మార్చు]
అల్వార్ జంక్షన్ రైల్వే స్టేషన్

త్రోవ మార్గం

[మార్చు]

2019 నాటికి, అల్వార్‌లో మధ్యస్థ-దూర రవాణా సాధారణంగా ఉపయోగించే రైల్వేలు, బస్సులు వంటి ప్రభుత్వ యాజమాన్య సేవలు, అలాగే ప్రైవేటుగా పనిచేసే లోక్ పరివాహన్ బస్సులు, టాక్సీలు, ఆటో రిక్షాలు. బస్సు సర్వీసులు అల్వార్ పాత బస్ స్టేషన్ నుండి నడుస్తాయి.

వాయు మార్గం

[మార్చు]

ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం అల్వార్‌కు సమీప విమానాశ్రయం. (143 కి.మీ). జైపూర్ అంతర్జాతీయ విమానాశ్రయం 150 కిమీ దూరంలో ఉంది.

రైలు మార్గం

[మార్చు]

ఢిల్లీ-జైపూర్ మార్గంలో అల్వార్ జంక్షన్ రైల్వే స్టేషన్ ఢిల్లీ, జైపూర్, ముంబైలతో అనుసంధానించబడి ఉంది.అల్వార్ రాజస్థాన్ లోని ప్రధాన నగరాలు, సమీప రాష్ట్రాలకు భూమి ఉపరితల మార్గాల ద్వారా అనుసంధానించబడి ఉంది.[13][14][15]

భౌగోళికం, వాతావరణం

[మార్చు]

అల్వార్ 27°34′N 76°36′E / 27.57°N 76.6°E / 27.57; 76.6 అక్షాంశ, రేఖాంశాల ద్ద ఉంది. ఇది 271 మీ. (889 అ) సగటు ఎత్తులో ఉంది.నగరానికి సమీపంలో రూపరైల్ ప్రధాన నది ఉంది.అల్వార్ ఖనిజ సంపదలో చాలా విలువైంది.ఇక్కడ పాలరాయి, నల్లరాయి,శిలా స్పటికాలకు, సున్నపురాయి, సబ్బు రాయి, బంకమట్టి, రాగి ధాతువులను విరివిగా లభిస్తాయి.[16]

2011 భారత జనాభా లెక్కల ప్రకారం అల్వార్ నగర జనాభా మొత్తం 341,42 మంది ఉండగా, వారిలో హిందువులు 90.7%, ముస్లింలు 4.3%, సిక్కులు 2.6%, జైనులు 2.1%, మిగిలిన 1.3 % ఇతర మతాలకు చెందినవారు ఉన్నారు.[17][18]

విద్య

[మార్చు]

అల్వార్‌లో 2012-13లో స్థాపించబడిన రాజ్ రిషి భారత్రిహరి మత్స్య విశ్వవిద్యాలయం, కేంద్రీయ విద్యాలయం ఉన్నాయి

పాఠశాలలు

[మార్చు]

ఆదినాథ్ పబ్లిక్ ఫాఠశాల, చినార్ పబ్లిక్ పాఠశాల, లార్డ్స్ ఇంటర్నేషనల్ పాఠశాల (అల్వార్ పబ్లిక్ పాఠశాల), సెయింట్ ఆన్స్‌లెమ్స్ సీనియర్ సెకండరీ పాఠశాల, శ్రీ గురు హర్క్రీషన్ పబ్లిక్ పాఠశాల, స్టెప్ బై స్టెప్ సీనియర్ సెకండరీ పాఠశాల, రాత్ ఇంటర్నేషనల్ పాఠశాల, నేషనల్ అకాడమీ, సిల్వర్ ఓక్ ఫాఠశాలలు ఉన్నాయి.

కళాశాలలు

[మార్చు]

రాజ్ రిషి కళాశాల, సిద్ధి వినాయక్ కళాశాల, ప్రెసిడెన్సీ కళాశాల, ప్రభుత్వ న్యాయ కళాశాల, కెసిఆర్ఐ కళాశాల, (ఐఇటి) కళాశాలలు ఉన్నాయి.800 కోట్ల రూపాయల బడ్జెట్‌తో నిర్మించి, 2017 నుండి ప్రారంభించబడిన ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ వైద్య కళాశాల ఉంది.[19]

మూలాలు

[మార్చు]
  1. Ram, Maya (1964). Rajasthan District Gazetteer Alwar. Jaipur. p. 1.{{cite book}}: CS1 maint: location missing publisher (link)
  2. Mallik, Swetabja (2019-07-15). "History and Heritage: Examining Their Interplay in India". International Conference on Archaeology, History and Heritage. The International Institute of Knowledge Management - TIIKM: 01–11. doi:10.17501/26510243.2019.1101. {{cite journal}}: Cite journal requires |journal= (help)
  3. Rajasthan (India). Chief Town Planner & Architectural Adviser. (1982). Draft master plan for Alwar, 1981-2001. The Chief Town Planner & Architectural Adviser. p. 8. OCLC 1000383312.
  4. "History of Alwar, Origin of Alwar, Alwar History In Rajasthan India". Indiasite.com. Archived from the original on 27 June 2012. Retrieved 2013-03-07.
  5. Raychaudhuri, Hemchandra (1997). Political history of ancient India : from the accession of Parikshit to the extinction of the Gupta dynasty. Oxford University Press. pp. 61, 736. ISBN 0-19-564376-3. OCLC 38008217.
  6. "Bharatpur becomes NCR; Delhi Metro to chug into Alwar soon". daily.bhaskar.com. Archived from the original on 29 November 2014. Retrieved 19 November 2014.
  7. "Alwar Tourism: Places to Visit in Alwar - Rajasthan Tourism". tourism.rajasthan.gov.in (in Indian English). Archived from the original on 11 December 2017. Retrieved 2017-12-10.
  8. Iyengar, Abha (2017-05-04). "Delhi to Alwar: Among the ruins". livemint.com/. Archived from the original on 10 December 2017. Retrieved 2017-12-10.
  9. Safvi, Rana (2017-05-28). "In a state of neglect". The Hindu (in Indian English). ISSN 0971-751X. Archived from the original on 30 April 2018. Retrieved 2017-12-10.
  10. "Sariska National Park - complete detail - updated". natureconservation.in (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 10 December 2017. Retrieved 2017-12-10.
  11. Safvi, Rana (2017-11-12). "Bhangarh: the most haunted fort in India". The Hindu (in Indian English). ISSN 0971-751X. Archived from the original on 30 April 2018. Retrieved 2017-12-10.
  12. "The Times of India: Latest News India, World & Business News, Cricket & Sports, Bollywood". The Times of India. Archived from the original on 2013-07-18. Retrieved 19 November 2014.
  13. "Delhi-Alwar rapid rail: Phase 1 corridor to be connected with Delhi Metro, bus stand, railway station!". The Financial Express (in అమెరికన్ ఇంగ్లీష్). 2019-04-15. Retrieved 2019-09-04.
  14. "All RRTS stations to have platform screen doors". Moneycontrol. Retrieved 2019-09-04.
  15. Shah, Narendra (2019-08-13). "Regional Rail stations to have platform screen doors". Metro Rail News (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2019-09-04.
  16. "Welcome to Alwar, The Gateway of Rajastan > Mineral Resources". Alwar.nic.in. Archived from the original on 19 June 2014. Retrieved 19 November 2014.
  17. "Alwar District Population Census 2011, Rajasthan literacy sex ratio and density". census2011.co.in. Archived from the original on 16 February 2013. Retrieved 6 April 2013.
  18. "Archived copy". Archived from the original on 4 November 2016. Retrieved 2016-07-30.{{cite web}}: CS1 maint: archived copy as title (link) Alwar City Population Census 2011
  19. "अलवर को इसी वर्ष मिलेगा मेडिकल कॉलेज, 2017 में होंगे प्रवेश". Patrika.

వెలుపలి లంకెలు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=ఆల్వార్&oldid=4344698" నుండి వెలికితీశారు