కేంద్రీయ విద్యాలయం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

సెంట్రల్ స్కూల్ (Central School) అని పిలువబడే కేంద్రీయ విద్యాలయం భారత కేంద్ర ప్రభుత్వపు మానవ వనరుల అభివృద్ధి శాఖ ద్వారా స్వయం ప్రాతిపదికన నడుపబడే విద్యాలయము. 1965 లో "సెంట్రల్ స్కూల్స్" అన్న పేరుతో సీబీఎస్సీకి అనుగుణంగా మొదలయ్యాయి. తరువాత కేంద్రీయ విద్యాలయ అని పేరు రూపాంతరం చేసారు. ప్రాథమికంగా ఈ విద్యాలయాలను భారత రక్షణా వ్యవస్థ, భారత ఆర్మీలో పనిచేసే సైనికుల పిల్లల కోసం నిర్మించారు. ఆర్మీ వారు సొంత విద్యాలయాలు నెలకొల్పాక కేంద్రీయ విద్యాలయాలను అన్ని కేంద్ర సంస్థలకు అందుబాటులో తెచ్చారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల తరచూ స్థానబదిలీ సమస్యను దృష్టిలో ఉంచుకొని పాఠ్యాంశాలను రూపొందించడం ద్వారా ప్రపంచ వ్యాప్తంగా గల అన్ని కేంద్రీయ విద్యాలయాల్లో ఒకే సిలబస్ ఉంటుంది. కేంద్రీయ విద్యాలయ సంఘటన్ అనబడే ఒక స్వయం ప్రతిపత్తి గల సంస్థ ఈ విద్యాలయాలను నడుపుతుంది.

ఢిల్లీ లోని కేంద్రీయ విద్యాలయ భవనము


నేడు ప్రపంచ వ్యాప్తంగా 1085 కేంద్రీయ విద్యాలయాలున్నాయి, వాటిలో 1081 భారతదేశంలో ఉన్నవి కాగా నాలుగు విదేశాల్లో ఉన్నాయి. మార్చి 2010 నాటికి 10,30,654 విద్యార్థులు మరియు 49,286 ఉద్యోగులు కేంద్రీయ విద్యాలయలో ఉన్నారు.

లంకెలు[మార్చు]

వివిధ రాష్ట్రాలలో కల కేంద్రీయ విద్యాలయాల జాబితా