భారత ప్రభుత్వం
భారతదేశం |
![]() ఈ వ్యాసం భారతదేశం రాజకీయాలు, ప్రభుత్వంలో ఒక భాగం. |
|
|
|
భారత ప్రభుత్వం, లేదా కేంద్ర ప్రభుత్వం భారత రాజ్యాంగం ప్రకారం ఏర్పాటు చేయబడింది. ఇది దేశంలో గల 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాల మీద అధికారాన్ని కలిగి ఉంటుంది. భారత రాజధాని ఢిల్లీలో ఇది కేంద్రీకృతమైంది.
ప్రభుత్వానికి భారత రాష్ట్రపతి (ప్రస్తుతం ద్రౌపది ముర్ము, 25 జూలై 2022 నుండి) నాయకత్వం వహిస్తారు, వీరు అత్యధిక కార్యనిర్వాహక అధికారాన్ని వినియోగించి, సహాయం, సలహా కోసం భారత ప్రధానమంత్రి ఇతర మంత్రులను ఎంపిక చేస్తారు. 2014 నుండి దేశం నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ నేతృత్వంలోని శాసనసభ ద్వారా చట్టాలను రూపొందిస్తోంది.[1] ప్రధానమంత్రి, సీనియర్ మంత్రులతో భారత కేంద్ర మంత్రిమండలి తయారవుతుంది.

భారత ప్రభుత్వ యంత్రాంగం మూడు స్వతంత్ర విభాగాలుగా ఏర్పడి ఉంది. కార్యనిర్వాహక వ్యవస్థ, శాసన వ్యవస్థ, న్యాయ వ్యవస్థ.[2] కార్యనిర్వాహక వ్యవస్థ రాష్ట్రపతి ఆద్వర్యంలో నడుస్తుంది. శాసన వ్యవస్థ (పార్లమెంటు) ఎగువసభగా పిలిచే రాజ్యసభను, దిగువసభగా పిలిచే లోక్‌సభను, రాష్ట్రపతిని కలిగి ఉంటుంది. న్యాయ వ్యవస్థ శీర్షమున అత్యున్నత న్యాయస్థానమును (సుప్రీమ్ కోర్టు), 21 ఉన్నత న్యాయస్థానాలనూ (హై కోర్టు), ఇంకా జిల్లా స్థాయిలో పౌర (సివిల్), నేర (క్రిమినల్), కుటుంబ (ఫామిలీ) న్యాయస్థానములను కలిగి ఉంటుంది. భారత పౌరులకు దిశా నిర్దేశము చేయు పౌర విధాన స్మృతి, భారతీయ శిక్షా స్మృతి, నేర విధాన స్మృతి వంటి సాధారణ న్యాయ సూత్రాలను కేంద్ర శాసన వ్యవస్థ రూపొందిస్తుంది.
కేంద్ర ప్రభుత్వము వలెనే ప్రతీ రాష్ట్ర ప్రభుత్వమూ కార్యనిర్వాహక వ్యవస్థ, శాసన వ్యవస్థ, న్యాయ వ్యవస్థ లను కలిగి ఉంటుంది. కేంద్రానికి, రాష్ట్రాలకి వర్తించు న్యాయ వ్యవస్థ ఇంగ్లీష్ కామన్, స్టాట్యుటరీ లా ఆధారంగా తయారు చెయ్యబడింది. భారతదేశము కొన్ని సౌలభ్యములతో అంతర్జాతీయ న్యాయ స్థానము (ఇంటర్‌నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్) ను అంగీకరిస్తోంది. ప్రాంతీయ పరిపాలన కొరకు, అధికార వికేంద్రీకరణకు ఉపకరంచిన పంచాయతీ రాజ్ వ్యవస్థ రాజ్యాంగములోని 73వ, 74వ సవరణల ద్వారా పంచాయతీ రాజ్ వ్యవస్థ అమలులోకి వచ్చింది.[3][4]
మూలాలు
[మార్చు]- ↑ sairam, indur. "ముచ్చటగా మూడో సారి మోడీయే ప్రధాని.. ఎన్డీఏ కూటమికి 378 సీట్లు - ఇండియా టీవీ-సీఎన్ఎక్స్ ఒపీనియన్ పోల్". Asianet News Telugu. Retrieved 2025-04-09.
- ↑ "భారత రాజ్యాంగం స్వభావం". EENADU PRATIBHA. Retrieved 2025-04-09.
- ↑ "పంచాయతీరాజ్ వ్యవస్థ". EENADU PRATIBHA. Retrieved 2025-04-09.
- ↑ "భారత రాజ్యాంగం… ముఖ్య లక్షణాలు…. - Prajasakti" (in అమెరికన్ ఇంగ్లీష్). 2024-11-26. Retrieved 2025-04-09.