భారత రాజ్యాంగం - ప్రాథమిక విధులు
Appearance
భారతదేశంలో ప్రాథమిక విధులు (ఆంగ్లం : Fundamental Duties)
1976 భారత రాజ్యాంగ 42వ సవరణ ప్రకారం భారతదేశపు పౌరులకు ప్రాథమిక విధులు ఇవ్వబడినవి.అధికరణ 51-ఏ, ప్రకారం పది ప్రాథమిక విధులు ఇవ్వబడినవి. పౌరులకు ఇవ్వబడిన ఈ పది విధులు, వ్యక్తగత, పరిసరాల పట్ల, సమాజం పట్ల, దేశం పట్ల తమ విద్యుక్త ధర్మాన్ని తెలియజేస్తాయి.[1] 2002 భారత రాజ్యాంగ 86వ సవరణ ప్రకారం 11వ విధి ఇవ్వబడింది. ఈ విధి, "తండ్రి గాని, సంరక్షకుడు గాని, తమ బిడ్డలకు 6-14 వయస్సు వరకు విద్యా బోధన చేపట్టాలి", అని బోధిస్తుంది.పౌరులందరూ తమకు ఇవ్వబడిన విధులను గౌరవించి, దేశం పట్ల, సమాజం పట్ల, పరిసరాల పట్ల తమ వ్యక్తిగత బాధ్యతను గుర్తించి మసలుకోవలెను.[2][3]
అధికరణ 51-ఏ ప్రకారం ప్రాథమిక విధులు
[మార్చు]భారతదేశంలో ప్రతి పౌరునికి గల ప్రాథమిక విధులు :
- భారత రాజ్యాంగాన్ని గౌరవించవలెను. రాజ్యాంగపు ఆదర్శాలను, సభలను, జాతీయ పతాకాన్ని, జాతీయ గీతాన్ని గౌరవించవలెను.
- భారత స్వతంత్ర సంగ్రామంలో, ప్రోత్సహింపబడ్డ ఆదర్శాలను గౌరవించాలి.
- భారతదేశపు సార్వభౌమత్వాన్ని, అఖండత్వాన్ని, ఏకత్వాన్ని గౌరవించి, పెంపొందింపవలెను.
- అవసరం లేదా అవకాశం గలిగితే భారతదేశానికి సేవచేయుటకు ఎల్లవేళలా సిద్ధంగా వుండవలెను.
- భారతదేశంలో, కుల, మత, వర్గ, లింగ, వర్ణ విభేదాలు లేకుండా ప్రజలందరినీ గౌరవించవలెను. సోదరభావాన్ని, సౌభ్రాతృత్వాన్నీ పెంపొందించవలెను. స్త్రీల యొక్క గౌరవమర్యాదలను భంగపరిచే అమర్యాదకరమైన ఆచారాలను పద్ధతులను విడనాడాలి.
- మన భారతదేశంలో గల మిశ్రమ సంస్కృతినీ, మిశ్రమ, అద్భుత వారసత్వాన్ని కాపాడుకొన వలెను.
- ప్రకృతీ పరిసరాలైన అడవులను, సరస్సులను, నదులను, వన్యప్రాణులను, ఇతర జీవులను సంరక్షించుకొనవలెను.
- శాస్త్రీయ దృక్పథాన్ని, వైజ్ఞానిక విషయాలను పెంపొందించి జ్ఞానాభివృద్ధి కొరకు ఎల్లవేళలా పాటుపడవలెను.
- ప్రభుత్వ ఆస్తులను, ప్రజల ఆస్తులను కాపాడవలెను. హింసను విడనాడవలెను.
- భారతదేశం అభివృద్ధి చెందునట్లు, వ్యక్తిగతంగాను, సామాజికంగాను లేదా మిశ్రమంగానూ పాటుపడుతూ, దేశ ఉజ్వల భవిష్యత్తును కాంక్షిస్తూ, దానిని సాధించుటకు కృషిచేయవలెను.
- 6-14 సంవత్సరాల పిల్లలకి నిర్బంధ విద్యను అందించాలి.
ఇవీ చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ Constitution of India-Part IVA Fundamental Duties.
- ↑ Tayal, B.B. & Jacob, A. (2005), Indian History, World Developments and Civics, pg. A-35
- ↑ Sinha, Savita, Das, Supta & Rashmi, Neeraja (2005), Social Science – Part II, pg. 30
వెలుపలి లంకెలు
[మార్చు]
|
|