ముఖ్యమంత్రి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
భారతదేశం
Emblem of India.svg

ఈ వ్యాసం భారతదేశం రాజకీయాలు, ప్రభుత్వంలో ఒక భాగం.


కేంద్ర ప్రభుత్వం

రాజ్యాంగం



భారతదేశంలో రాష్ట్రాల ప్రభుత్వాధినేతను ముఖ్యమంత్రి అంటారు. శాసనసభలో కనీస ఆధిక్యత కలిగిన పార్టీ లేదా కూటమికి చెందిన నాయకుడు ముఖ్యమంత్రి అవుతారు. ముఖ్యమంత్రి శాసనసభ లేదా శాసనమండలి సభ్యుడై ఉండాలి. అయితే ఏ సభలోనూ సభ్యుడు కాకున్నా ముఖ్యమంత్రి పదవి చేపట్టవచ్చు, కానీ 6 నెలలలోపు ఏదో ఒక సభలో సభ్యత్వం పొందాలి.ప్రభుత్వాధినేతగా ముఖ్యమంత్రి రాష్ట్ర పరిపాలనకు బాధ్యుడు. గవర్నరు పేరిట పరిపాలన జరిగినప్పటికీ, అధికారం యావత్తూ ముఖ్యమంత్రి చేతిలో ఉంటుంది. పరిపాలనలో తనకు సహాయంగా ఉండేందుకు మంత్రివర్గాన్ని నియమించుకుంటారు.

ఎంపిక విధానం[మార్చు]

భారత రాజ్యాంగం, ముఖ్యమంత్రి పదవికి పోటీ చేసే అభ్యర్థికి అర్హతా నియమావళిని నిర్దేశించింది.

● అభ్యర్థి భారత పౌరుడు అయ్యి ఉండాలి.

● 25 సంవత్సరాలు, అంతకంటే ఎక్కువ వయస్సు కలిగి ఉండాలి.

● రాష్ట్ర శాసనసభలో సభ్యుడు అయ్యి ఉండాలి. సభ్యత్వం లేని యెడల, అభ్యర్థి గవర్నర్ ఆమోదం కలిగి ఉండాలి.

అట్టి పరిస్థితిలో అభ్యర్థి ముఖ్యమంత్రిగా బాధ్యతను స్వీకరించిన నాటి నుండి ఆరు మాసాల కాల వ్యవధిలోపు శాసనసభా సభ్యత్వాన్ని పొందాలి. లేని పరిస్థితిలో ముఖ్యమంత్రి పదవి నుండి అభ్యర్థి తొలగించబడతారు.

వివిధ రాష్ట్రాల ప్రస్తుత ముఖ్యమంత్రుల జాబితా[మార్చు]

వ.సంఖ్య రాష్ట్రం పేరు పదవీ స్వీకారం పార్టీ జాబితా
1 ఆంధ్ర ప్రదేశ్ వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి 2019 - may -28 వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ అందరు
2 తెలంగాణ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు 2014 - జూన్-02 తెలంగాణ రాష్ట్ర సమితి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి
3 అరుణాచల్ ప్రదేశ్ పెమా ఖండు 2016 జులై 17 భారతీయ జనతా పార్టీ అందరు
4 అస్సాం హిమంత బిశ్వ శర్మ 10 మే 2021 – ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ అందరు
5 బీహార్ నితీష్ కుమార్ 2015 ఫిబ్రవరి 22 జనతా దళ్ (యునైటెడ్) అందరు
6 చత్తీస్‌గఢ్ భూపేష్ బాఘేల్ 2018 డిసెంబర్ 17 భారతీయ జనతా పార్టీ అందరు
7 ఢిల్లీ అరవింద్ కేజ్రివాల్ 14 ఫిబ్రవరి 2014 ఆమ్ ఆద్మీ పార్టీ అందరు
8 గోవా దిగంబర్ కామత్ 2007, జూన్ 8 కాంగ్రెసు పార్టీ అందరు
9 గుజరాత్ భూపేంద్ర పటేల్ 13 సెప్టెంబర్ 2021 భారతీయ జనతా పార్టీ అందరు
10 హర్యానా మనోహర్ లాల్ ఖట్టర్ 26 అక్టోబరు 2014 భారతీయ జనతా పార్టీ అందరు
11 హిమాచల్ ప్రదేశ్ జై రామ్ థాకూర్ 2017 డిసెంబర్ 27 భారతీయ జనతా పార్టీ అందరు
12 జమ్మూ కాశ్మీరు అందరు
13 జార్ఖండ్ హేమంత్ సోరెన్ 2019 డిసెంబర్ 29 జార్ఖండ్ ముక్తి మోర్చా అందరు
14 కర్ణాటక బ‌స‌వ‌రాజు బొమ్మై 28 జులై 2021 భారతీయ జనతా పార్టీ అందరు
15 కేరళ పిన‌ర‌యి విజ‌య‌న్ 25 మే 2016 ఎల్.డి.ఎఫ్ అందరు
16 మధ్య ప్రదేశ్ శివరాజ్ సింగ్ చౌహాన్ 2005 నవంబర్ 29 భారతీయ జనతా పార్టీ అందరు
17 మహారాష్ట్ర ఉద్ధవ్ ఠాక్రే 28 నవంబర్ 2019 - ప్రస్తుతం శివసేన అందరు
18 మణిపూర్ ఎన్ బీరెన్ సింగ్ 2017 మార్చి 15 భారతీయ జనతా పార్టీ అందరు
19 మేఘాలయ కొన్రాడ్ సంగ్మా 2018 మార్చి 6 నేషనల్ పీపుల్స్ పార్టీ అందరు
20 మిజోరం జోరంతంగ 2018 డిసెంబర్ 15 మిజో నేషనల్ ఫ్రంటు అందరు
21 నాగాలాండ్ నెయిఫియు రియో 2018 మార్చి 8 నేషనలిస్ట్ డెమొక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ అందరు
22 ఒడిషా నవీన్ పట్నాయక్ 5 మార్చి 2000 బిజూ జనతా దళ్ అందరు
23 పాండిచ్చేరి ఎన్ రంగస్వామి 2021 మే 7 భారత జాతీయ ఎన్ ఆర్ కాంగ్రెస్ అందరు
24 పంజాబ్ భగవంత్ మాన్ 16 మార్చి 2022 ఆమ్ ఆద్మీ పార్టీ అందరు
25 రాజస్థాన్ అశోక్ గెహ్లోట్ కాంగ్రెస్ పార్టీ అందరు
26 సిక్కిం ప్రేమ్‌సింగ్ తమాంగ్ 27 మే 2019 సిక్కిం క్రాంతికారి మోర్చా అందరు
27 తమిళనాడు ఎం. కె. స్టాలిన్ 7 మే 2021 డి.ఎం.కె అందరు
28 త్రిపుర విప్లవ్‌కుమార్ దేవ్ భారతీయ జనతా పార్టీ అందరు
29 ఉత్తరాఖండ్ పుష్కర్ సింగ్ ధామీ భారతీయ జనతా పార్టీ అందరు
30 ఉత్తర ప్రదేశ్ యోగి ఆదిత్యనాథ్ 19 మార్చి 2017 భారతీయ జనతా పార్టీ అందరు
31 పశ్చిమ బెంగాల్ మమతా బెనర్జీ 2011, మే 20 త్రిణమూల్ కాంగ్రెస్ అందరు

మూలాలు[మార్చు]

వెలుపలి లంకెలు[మార్చు]