Jump to content

పెమా ఖండు

వికీపీడియా నుండి
పెమా ఖండు
పెమా ఖండు


అరుణాచల్ ప్రదేశ్ 9వ ముఖ్యమంత్రి
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2016 జులై 17
డిప్యూటీ చౌన మెయిన్
ముందు నభమ్ తుకీ

ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2011
ముందు దోర్జీ ఖండు
నియోజకవర్గం ముక్తో

వ్యక్తిగత వివరాలు

జననం (1979-08-21) 1979 ఆగస్టు 21 (వయసు 45)
తవాంగ్ జిల్లా, అరుణాచల్ ప్రదేశ్, భారతదేశం
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు *భారత జాతీయ కాంగ్రెస్ (2016 సెప్టెంబరు వరకు)
సంతానం 3 (ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె)
నివాసం తవాంగ్ జిల్లా and ఇటానగర్

పెమా ఖండు (1979 ఆగస్టు 21) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు, అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి. 2016 జూలై నుండి పరిపాలనలో ఉన్న పెమా ఖండు ప్రభుత్వం రెండు సార్లు తమ పార్టీని మార్చారు:

2016 సెప్టెంబరులో భారత జాతీయ కాంగ్రెస్ నుండి పీపుల్స్ పార్టీ ఆఫ్ అరుణాచల్ కి ఒకసారి, [1] 2016 డిసెంబరులో రెండవసారి భారతీయ జనతా పార్టీకి మారారు.[2]గతంలో అతను నబమ్ టుకీ ప్రభుత్వంలో పర్యాటకం, పట్టణాభివృద్ధి, జలవనరుల శాఖ మంత్రిగా పనిచేశారు.[3]

వ్యక్తిగత జీవితం

[మార్చు]

పేమ ఖండు అరుణాచల్ ప్రదేశ్ పూర్వ ముఖ్యమంత్రి దోర్జీ ఖండు కుమారుడు. దోర్జి ఖండు 2011 ఏప్రిల్ 30న తవాంగ్ నగరం వెళ్తున్న సమయంలో హెలికాఫ్టర్ యాక్సిడెంట్లో మరణించాడు. ఖండు భౌద్ధమతస్తుడు.[4] హిందూ కాలేజి, ఢిల్లీ విశ్వవిద్యాలయం నుండి గ్రాడ్యుయేషన్ చదువు పూర్తి చేసాడు.[5]

పెమా ఖండూ మోన్పా తెగకు చెందినవారు, ఇది ప్రధానంగా భారతదేశంలోని అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్ జిల్లాలో నివసిస్తున్న ఒక స్థానిక సమాజం.[6] మోన్పాస్ వారి గొప్ప సాంస్కృతిక వారసత్వానికి ప్రసిద్ధి చెందింది, ఇందులో శక్తివంతమైన పండుగలు, సాంప్రదాయ నృత్య రూపాలు, ప్రత్యేకమైన ఆచారాలు ఉన్నాయి.

రాజకీయ జీవితం

[మార్చు]

2011 లో అతని తండ్రి మరణం తరువాత రాష్ట్ర కాబినెట్లో ఖండు వాటర్ రిసోర్స్ డెవెలప్మెంట్, పర్యాటక శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టాడు.[7] 2011 జూన్ 30న తన తండ్రి నియోజకవర్గంలో భారత జాతీయ కాంగ్రెస్ నుండి ఏకగ్రీవంగా రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికయ్యాడు.[8][9]

2014 అరుణాచల్ ప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో ముక్తో నియోజకవర్గం నుండి పోటీ లేకుండా ఖండు తిరిగి ఎన్నికయ్యాడు.[10] ఏడాది పొడవునా రాజకీయ సంక్షోభం తరువాత 37 సంవత్సరాల వయసులో ఖండు 2016 జూలై 17 న అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు.

2016 సెప్టెంబరు 16 న, సిఎం పెమా ఖండు ఆధ్వర్యంలో అధికార పార్టీకి చెందిన 43 మంది ఎమ్మెల్యేలు భారతీయ జాతీయ కాంగ్రెస్ నుండి భారతీయ జనతా పార్టీ మిత్రపక్షమైన అరుణాచల్ పీపుల్స్ పార్టీకి ఫిరాయించారు.

దీంతో కొన్ని కారణాల వల్ల 2016 డిసెంబరు 21న ఖండునీ పార్టీ అధ్యక్ష పదవినుండి తప్పించారు. 11 మంది ఎమ్మెల్యేలతో పాటు ఇద్దరు స్వతంత్రుల మద్దతుతో బిజెపి తన బలాన్ని 45 కి పెంచడంతో 2016 డిసెంబరులో, పీపుల్స్ పార్టీ ఆఫ్ అరుణాచల్ 43 మంది శాసనసభ్యులు 33 మంది భారతీయ జనతా పార్టీలో చేరడంతో ఖండు శాసనసభలో తన మెజారిటీని తిరిగి సాధించాడు.

ఖండు అరుణాచల్ ప్రదేశ్ కి భారతీయ జనతా పార్టీ నుండి రెండవ ముఖ్యమంత్రి, అంతకు మునుపు గెగోంగ్ అపాంగ్ 2003 లో 44 రోజుల పాటు బిజెపి నుండి అరుణాచల్ ప్రదేశ్ కి ముఖ్యమంత్ర్రిగా ఉన్నాడు.[11]

మూలాలు

[మార్చు]
  1. "Times of India" 16/9/16
  2. Kashyap, Samudra Gupta (31 December 2016). "Arunachal gets full-fledged BJP govt as Pema Khandu, 32 others join saffron party". The Indian Express (in ఇంగ్లీష్). Retrieved 14 April 2021.
  3. "Arunachal Pradesh Chief Minister Nabam Tuki: Cabinet Minister Profile". Arunachalpradeshcm.in. 2 March 2015. Archived from the original on 14 May 2014. Retrieved 1 April 2015.
  4. Bhatt, Sheela (26 October 2016). "Why Arunachal now worries Congress". The Indian Express (in ఇంగ్లీష్). Retrieved 14 April 2021.
  5. "New cabinet sworn in, Pema Khandu makes it to the list". Arunachal Times. 23 May 2011. Retrieved 1 April 2015.
  6. "Pema Khandu becomes youngest chief minister in the country". The Economic Times. 2016-07-18. ISSN 0013-0389. Retrieved 2023-11-16.
  7. "New council of ministers formed in Arunachal Pradesh". Dnaindia.com. 20 May 2011. Retrieved 1 April 2015.
  8. "The Assam Tribune Online". Assamtribune.com. 1 July 2011. Archived from the original on 5 February 2015. Retrieved 1 April 2015.
  9. "Form 21E : Return of Election : Uncontested" (PDF). Eci.nic.in. Retrieved 1 April 2015.
  10. "Arunachal Pradesh : General Election" (PDF). Ceoarunachal.nic.in. Archived from the original (PDF) on 2 August 2014. Retrieved 1 April 2015.
  11. "Arunachal: Shifting to BJP, Pema Khandu drops 3 ministers, 2 advisors, 5 parliamentary secretaries". The Indian Express (in ఇంగ్లీష్). 2017-01-03. Retrieved 2021-06-02.
"https://te.wikipedia.org/w/index.php?title=పెమా_ఖండు&oldid=4345150" నుండి వెలికితీశారు