భువన్ చంద్ర ఖండూరి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
భువన్ చంద్ర ఖండూరి
భువన్ చంద్ర ఖండూరి


పదవీ కాలం
2011, సెప్టెంబరు 10 నుంచి
ముందు రమేష్ పోఖ్రియార్

వ్యక్తిగత వివరాలు

జననం (1934-10-01) 1934 అక్టోబరు 1 (వయసు 88)
డెహ్రాడూన్, ఉత్తరాఖండ్
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
జీవిత భాగస్వామి అరుణా ఖండూరి
సంతానం రీతూ ఖండూరి భూషణ్, ఒక కుమారుడు
అక్టోబరు 1, 2011నాటికి

భువన్ చంద్ర ఖండూరి (Bhuwan Chandra Khanduri) అక్టోబరు 1, 1934లో జన్మించాడు. ఇతను భారతీయ జనతా పార్టీకి చెందిన నాయకుడు, ప్రస్తుత ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి.

వ్యక్తిగత జీవితం[మార్చు]

భువన్ చంద్ర ఖండూరి 1934 అక్టోబరు 1న ఉత్తరాఖండ్ లోని డెహ్రాడూన్ లో జన్మించాడు. అలహాబాదు, పూనా, కొత్తఢిల్లీ, సికింద్రాబాదులలో విద్యనభ్యసించాడు. 1954 నుండి 1990 వరకు భారత సైన్యంలో పనిచేశాడు. 1982లో అతివిశిష్ట సేవా మెడల్ కూడా పొందినాడు.

రాజకీయ జీవితం[మార్చు]

ఖండూరి సైన్యం నుంచి పదవీ విరమణ పొందిన పిమ్మట 1991లో గర్వాల్ లోకసభ నియోజకవర్గం నుంచి విజయం సాధించాడు. అటల్ బిహారి వాజపేయి ప్రభుత్వంలో మంత్రిగా స్థానం పొందినాడు. 2003లో కేబినెట్ ర్యాంకును పొందినాడు. పలు పార్లమెంటరీ కమిటీలలో కూడా పనిచేశాడు. 2007 ఫిబ్రవరిలో ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాడు. 2009 లోకసభ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ పరాజయానికి నైతిక బాధ్యత వహించి ఖండూరి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా సమర్పించాడు. సెప్టెంబరు 10, 2011న[1] రెండవ పర్యాయం ఖండూరి ముఖ్యమంత్రిగా పదవీస్వీకారం చేశాడు.

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

యితర లింకులు[మార్చు]