సుందర్‌లాల్ పట్వా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సుందర్‌లాల్ పట్వా
మినిస్ట్రీ ఆఫ్ మైన్స్ (భారతదేశం)
In office
2000 నవంబరు 7 – 2001 సెప్టెంబరు 1
ప్రథాన మంత్రిఅటల్ బిహారీ వాజ్‌పేయి
అంతకు ముందు వారునవీన్ పట్నాయక్
తరువాత వారురామ్ విలాస్ పాశ్వాన్
మినిస్ట్రీ ఆఫ్ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్
In office
2000 సెప్టెంబరు 30 – 2000 నవంబరు 7
ప్రథాన మంత్రిఅటల్ బిహారీ వాజ్‌పేయి
అంతకు ముందు వారుసురేష్ ప్రభు
తరువాత వారుసత్యబ్రత ముఖర్జీ
వ్యవసాయం, రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ
In office
2000 మార్చి 6 – 2000 మే 26
ప్రథాన మంత్రిఅటల్ బిహారీ వాజ్‌పేయి
అంతకు ముందు వారునితీష్ కుమార్
తరువాత వారునితీష్ కుమార్
మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్ (భారతదేశం)
In office
1999 అక్టోబరు 13 – 2000 సెప్టెంబరు 30
ప్రథాన మంత్రిఅటల్ బిహారీ వాజ్‌పేయి
అంతకు ముందు వారుబాబాగౌడ పాటిల్
తరువాత వారువెంకయ్య నాయుడు
పార్లమెంటు సభ్యుడు, లోక్ సభ
In office
1999–2004
అంతకు ముందు వారుసర్తాజ్ సింగ్
తరువాత వారుసర్తాజ్ సింగ్
నియోజకవర్గంహోషంగాబాద్ లోక్‌సభ నియోజకవర్గం
In office
1997–1998
అంతకు ముందు వారుఅల్కా నాథ్
తరువాత వారుకమల్ నాథ్
నియోజకవర్గంచింద్వారా లోక్‌సభ నియోజకవర్గం
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి
In office
1990 మార్చి 5 – 1992 డిసెంబరు 15
గవర్నర్ఎం. ఎ. ఖాన్
అంతకు ముందు వారుశ్యామ చరణ్ శుక్లా
తరువాత వారుదిగ్విజయ్ సింగ్
In office
1980 జనవరి 20 – 1980 ఫిబ్రవరి 17
గవర్నర్సి. ఎం. పూనాచ
అంతకు ముందు వారువీరేంద్ర కుమార్ సఖ్లేచా
తరువాత వారుఅర్జున్ సింగ్
ప్రతిపక్ష నాయకుడు
మధ్యప్రదేశ్ శాసనసభ
In office
1980 జూలై 4 – 1985 మార్చి 10
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిఅర్జున్ సింగ్
అంతకు ముందు వారుఅర్జున్ సింగ్
తరువాత వారుకైలాష్ చంద్ర జోషి
మధ్యప్రదేశ్ శాసనసభ సభ్యుడు
In office
1985–1997
అంతకు ముందు వారుశాలిగ్రామ్
తరువాత వారునరేష్ సింగ్ పటేల్
నియోజకవర్గంభోజ్‌పూర్, మధ్యప్రదేశ్ శాసనసభ నియోజకవర్గం
In office
1980–1985
అంతకు ముందు వారుసబితా బాజ్‌పాయ్
తరువాత వారుశంకర్ లాల్
నియోజకవర్గంసెహోర్ శాసనసభ నియోజకవర్గం
In office
1977–1980
అంతకు ముందు వారుశ్యామ్ సుందర్ పాటిదార్
తరువాత వారుశ్యామ్ సుందర్ పాటిదార్
నియోజకవర్గంమందసౌర్ శాసనసభ నియోజకవర్గం
In office
1957–1967
అంతకు ముందు వారునద్రం దాస్
తరువాత వారునియోజకవర్గం ఏర్పాటు
నియోజకవర్గంమానస శాసనసభ నియోజకవర్గం
వ్యక్తిగత వివరాలు
జననం(1924-11-11)1924 నవంబరు 11
కుక్రేశ్వర్, సెంట్రల్ ప్రావిన్సులు, బెరార్, బ్రిటిష్ ఇండియా
మరణం2016 డిసెంబరు 28(2016-12-28) (వయసు 92)
భోపాల్, మధ్యప్రదేశ్, భారతదేశం
రాజకీయ పార్టీభారతీయ జనతా పార్టీ

సుందర్ లాల్ పట్వా (1924 నవంబరు 11 - 2016 డిసెంబరు 28) భారతీయ రాజకీయ నాయకుడు. ఆయన మధ్యప్రదేశ్ 11వ ముఖ్యమంత్రిగా, భారత ప్రభుత్వంలో క్యాబినెట్ మంత్రిగా పనిచేశాడు.

ఆయనకు భారత ప్రభుత్వం 2017లో మరణానంతరం రెండవ అత్యున్నత పౌర పురస్కారం అయిన పద్మ విభూషణ్ అందించింది.[1][2]

జననం[మార్చు]

ఆయన మధ్యప్రదేశ్‌లోని నీముచ్ జిల్లాలో మానస, రాంపుర మధ్య ఉన్న కుక్రేశ్వర్ గ్రామంలో జన్మించాడు.

రాజకీయ ప్రస్థానం[మార్చు]

ఆయన భారతీయ జనతా పార్టీ సభ్యుడు. 1997లో ఛింద్వారా నియోజకవర్గం నుంచి పార్లమెంటు సభ్యునిగా కాంగ్రెస్ బలమైన వ్యక్తి కమల్ నాథ్‌ను ఓడించిన ఏకైక రాజకీయ నాయకుడు.

రెండు పర్యాయాలు ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన మొదటిసారి జనతాపార్టీ నుంచి నెల రోజులకన్నా తక్కువకాలం (1980 జనవరి 20 నుంచి ఫిబ్రవరి 17 వరకు) ఉన్నాడు. ఇక రెండోసారి భారతీయ జనతాపార్టీ అభ్యర్థిగా ఎన్నికై ముఖ్యమంత్రిగా 1990 మార్చి 5 నుంచి 1992 డిసెంబరు 15 వరకు సేవలందించాడు.

ఆయన రాజకీయ ప్రస్థానం భారతీయ జనసంఘ్తో ప్రారంభమైంది. అయితే ఈ పార్టీ 1977లో జనతా పార్టీలో విలీనమైంది.

వ్యక్తిగత జీవితం[మార్చు]

ఆయన ఇద్దరు మేనల్లుళ్ళు కూడా రాజకీయాల్లోకి వచ్చారు.[3] సురేంద్ర పట్వా మొదటిసారిగా భోజ్‌పూర్ నుండి మధ్యప్రదేశ్ విధానసభకు 2008లో ఎన్నికయ్యాడు. ఆయన మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నాడు.

ఆయన మరో మేనల్లుడు మంగళ్ పట్వా (1965-2015) 1998లో మానస స్థానం నుంచి ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయాడు. బీజేపీ నీముచ్ జిల్లా విభాగానికి అధ్యక్షుడయ్యాడు. మంగళ్ పట్వా 2015లో రోడ్డు ప్రమాదంలో మరణించాడు.

మరణం[మార్చు]

92 ఏళ్ల సుందర్‌లాల్‌ పట్వా గుండె సంబంధ సమస్యతో బాధపడుతూ 2016 డిసెంబరు 28న కన్నుమూసాడు.[4]

ఇవీ చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "List of Padma awardees 2017". The Hindu. January 25, 2017.
  2. "Sunderlal Patwa, 'Doctor Dadi' among Padma awardees from Madhya Pradesh". Times of India. January 27, 2017.
  3. "BJP leader from MP dies in a road accident in Chittorgarh | Jaipur News - Times of India". The Times of India. 21 June 2015.
  4. "former MP CM sunder lal patwa passes away - Sakshi". 2023-05-06. Archived from the original on 2023-05-06. Retrieved 2023-05-06.