ఆనందిబెన్ పటేల్
ఆనందిబెన్ పటేల్ | |||
![]()
| |||
Assembly Member
మండల్, అహ్మదాబాద్ జిల్లా | |||
పదవీ కాలం 1998 – 2002 | |||
Assembly Member
for పటాన్, గుజరాత్ | |||
పదవీ కాలం 2002 – 2007 | |||
పటాన్, గుజరాత్ ప్రతినిధి - శాసనసభ సభ్యులు
| |||
పదవీ కాలం 2007 – 2012 | |||
Assembly Member
for ఘలోదియా | |||
పదవీ కాలం 2012 – Incumbent | |||
పార్లమెంటు సభ్యులు, రాజ్యసభ
| |||
పదవీ కాలం 1994 – 1998 | |||
వ్యక్తిగత వివరాలు
|
|||
---|---|---|---|
జననం | |||
జాతీయత | భారతీయులు | ||
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
తల్లిదండ్రులు | జేథాబాయి పటేల్ | ||
జీవిత భాగస్వామి | మఫట్లా పటేల్ | ||
సంతానం | సంజత్ పటేల్ , అనార్ పటేల్ | ||
వృత్తి | విద్యావేత్త | ||
కేబినెట్ | గుజరాత్ ప్రభుత్వం | ||
శాఖ | విద్యాశాఖా మంత్రి, ఉన్నత , సాంకేతిక విద్యా మంత్రి, మహిళా , శిశు సంక్షేమ శాఖా మంత్రి, క్రీడలు,యువజన , సాంస్కృతిక వ్యవహారాలు(1998-2007) రెవెన్యూ మంత్రి, డిసాస్టర్ మానేజిమెంటు, రోడ్లు ,భవనాలు ప్రాజెక్టు, మహిళా, శిశు సంక్షేమం, గుజరాత్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి | ||
మతం | హిందూ | ||
వెబ్‌సైటు | http://www.anandibenpatel.com |
ఆనందిబెన్ జేతాభాయి పటేల్ (జ.నవంబరు 21, 1941 ) [1] 1998 నుండి భారతదేశం లోని గుజరాత్ రాష్ట్ర శాసనసభ్యులుగా ఉన్న రాజకీత వేత్త.[2] ఆమె 1987 నుండి భారతీయ జనతా పార్టీ సభ్యురాలుగా ఉన్నారు. ఆమె ప్రస్తుతం గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వంలో రోడ్లు, భవనాలు, రెవెన్యూ, పట్టణాభివృద్ధి, పట్టణ గృహనిర్మాశాఖ, డెసాస్టర్ మేనేజిమెంటు, ప్రధాన ప్రాజెక్టులు శాఖలకు మంత్రిగా ఉన్నారు.[3]
2014 భారత సార్వత్రిక ఎన్నికలలో నరేంద్ర మోడీ భారత పార్లమెంటుకు భా.జ.పా తరపున ప్రధానమంత్రి అభ్యర్థిగా ఎన్నిక అయినప్పటి నుండి ఆయన దేశవ్యాప్తంగా విస్తృత ప్రచారంలో ఉన్న కాలంలో ఆమె గుజరాత్ ముఖ్యమంత్రి పాత్రను సమర్ధవంతంగా పోషించారు.[4] ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ఆమెను దేశంలో అత్యంత ప్రభావశీలురైన వ్యక్తుల జాబితాలో ఒకరిగా చేర్చింది.[5] గుజరాత్ ముఖ్యమంత్రి అయిన నరేంద్ర మోడీ ప్రధాన మంత్రి అభ్యర్థిగా ఎంపికైనందున ఆయన మే 21 2014 న తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆ స్థానంలో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఆనందిబెన్ పటేల్ ను శాసన సభా పక్షం ఎన్నుకొంది. ఆమె గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు.
ఆమె భా.జ.పా గుజరాత్ శాఖలో కీలక నాయకురాలు. ఈమె గుజరాత్ పూర్వ ముఖ్యమంత్రి కేశూభాయి పటేల్, ప్రస్తుత ముఖ్యమంత్రి నరేంద్ర మోడి మంత్రి వర్గాలలో అత్యంత కీలకమైన వ్యక్తిగా ఉన్నారు. ఆమె ప్రస్తుతం గుజరాత్ రాష్ట్రంలో మహిళా శాసనసభ్యులలో అత్యధిక కాలం శాసనసభ్యురాలిగా ఉన్న మహిళ. ఆమె రాజకీయ జీవితాన్ని 1994 లో రాజ్యసభ సభ్యురాలిగా ప్రారంభించారు. ఆ తర్వాత 1998 లో గుజరాత్ రాష్ట్ర ఎన్నికలలో పోటీ చేసి ఆ రాష్ట్ర శాసనసభ్యురాలిగా ఎన్నికైనారు. ఆమె ప్రస్తుతం గుజరాత్ లో వరుసగా నాలుగుసార్లు మహిళా ఎన్నికైన వ్యక్తిగా నిలిచారు. ఆమె నాలుగవ సారి ఎన్నికైన తర్వాత గుజరాత్ రాష్ట్ర కేబినెట్ మంత్రి అయినారు.
ప్రారంభ జీవితం[మార్చు]
ఆనంది బెన్ పటేల్ మెహసాన జిల్లాలోని విజపూర్ తాలూకాకు చెందిన ఖరోడ్ జిల్లాలో నవంబరు 21, 1941 న జన్మించారు. ఆమె తండ్రి జేథాభాయి ఒక సాధారణ రైతు. ఆమె 4వ గ్రేడు వరకు విద్యను స్థానికంగా ఉన్న బాలికల పాఠశాలలో పూర్తిచేశారు. కానీ దగ్గరలో బాలికల పాఠశాల లేనందువల్ల తదుపరి విద్యాభ్యాసాన్ని బాలుర పాఠశాలలో చేరారు. ఆ పాఠశాలలో గల 700 మంది బాలురలో ఒకతే బాలిక ఆమె. ఆమె 8 వ గ్రేడు విద్యాభ్యాసం కోసం విశనగర్ లో గల సూతన్ సర్వ విద్యాలయంలో చేరారు. ఆమె అథ్లెటిక్స్ లో సాధించిన విజయాలకు గానూ "వీరబాల" పురస్కారాన్ని అందుకున్నారు.[1]
ఆమె 1960 లో బిల్వాయి కళాశాలలో చేరారు. ఆ కళాశాలలో మొదటి సంవత్సరంలో విజ్ఞాన శాస్త్ర విభాగంలో చదివిన ఏకైక వ్యక్తి ఆమె. ఆ తర్వాత బిస్‌నగర్ లో సైన్సులో బాచిలర్ డిగ్రీని పొందారు. ఆమె మహిళలను పైకి తీసుకురావడానికి మహిళా వికాస్ గృహ్ లో ఉద్యోగంలో చేరారు. ఆమె 50 కంటే ఎక్కువ మంది వితంతువులకు వృత్తి విద్యా కోర్సును అందించారు.
1965 లో ఆమె అహ్మదాబాదుకు ఆమె భర్త మఫత్లాల్ పటేల్ తో కలసి వెళ్లారు. అచట ఆమె సైన్సులో మాస్టర్ డిగ్రీ కోసం చేరారు. ఆమె అహ్మదాబాదులోని వారి ఉమ్మడికుటుంబంలోని అందరు పిల్లలను విద్యావంతులను చేసే బాధ్యతను చేపట్టారు. ఆ రోజుల్లో ఆమె కుటుంబంలోని 10 మంది వరకు అహ్మదాబాదులో విద్యాభ్యాసం కోసం ఉండేవారు. ఆమెకు విద్యాబోధన పట్ల ఉన్న ఆసక్తితో బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ లో చేరారు.
ఆమె 1970 లో మొహ్నిభా విద్యాలయంలో ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయినిగా చేరారు.[1] ఆమె ముఖ్యమైన రాజకీయ స్థానాలలో ఉన్నప్పటికీ 30 సంవత్సరాల వరకు ఆ పాఠశాలలో తన సేవలను అందించారు.
రాజకీయ జీవితం[మార్చు]
1987 లో పాఠశాలలో జరిగిన విహారయాత్ర లో జరిగిన దుర్ఘటన కారణంగా ఆమె రాజకీయ జీవితం ప్రారంభమైనది. ఆ విహారయాత్ర లో ఇద్దరు బాలికలు ప్రమాద వశాత్తు నర్మదా నదిలో పడిపోయారు. ఆ పరిస్థితిలో ఆమె తెగించి వారిరి రక్షించడం కోసం ప్రవహిస్తున్న నదిలోకి దూకారు. అతి కష్టం మీద సాహసంతో వారిని రక్షించారు.[4] ఆ సంఘటనతో ఆమె సాహసోపేత చర్యను గమనించి భారతీయ జనతా పార్టీ అధిష్టానం ఆమెను పార్టీలోకి చేరమని ఆహ్వానించింది. మొదట ఆమె ఆ ప్రతిపాదనను వ్యతిరేకించిప్పటికీ తర్వాత రాజకీయాల ద్వారా ప్రజా సేవ చేయవచ్చుననే భావంతో రాజకీయాలలోకి స్వచ్ఛందంగా చేరదలచి భారతీయ జనతా పార్టీలో చేరి 1997 లో గుజరాత్ ప్రదేశ్ మహిళా మోర్చా అధ్యక్షురాలిగా ఎంపికయ్యారు.[4]
ఆమె గుజరాత్ లోని విరమ్‌గ్రాం జిల్లాలో బర్డ్ ఫ్లూ వ్యాధి ప్రబలినపుడు అనేక మంది పిల్లలు మృత్యువాత పడినపుడు ఆమె విశేష సేవలందించారు. ఆమె స్థానిక ప్రజలకు సహకారాన్ని అందించుటకు, ప్రభుత్వ అధికారులను వివిధ కార్యక్రమాలను అందించి విశేష కృషిచేశారు. 1992 లో గుజరాత్ లో భారతా జనతా పార్టీ నిర్వహించిన ఏక్తా యాత్రాలో ఏకైన మహిళా నాయకురాలిగా ఉన్నారు.
పార్లమెంటు సభ్యురాలిగా[మార్చు]
1994 లో ఆనందిబెన్ పటేల్ రాజ్యసభ సభ్యురాలిగా చేరారు. పార్లమెంటు సభ్యురాలిగా ఆమె భారతదేశం తరపున 1994-95 లో చైనా (బీజింగ్) లో జరిగిన ప్రపంచ మహిళా సదస్సులో పాల్గొన్నారు. ఆమె మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి, స్పీకరు పి.ఎ.సంగ్మా లతో పాటు బల్గేరియాను కూడా సందర్శించారు.
1998 - మండల్ లో మొదటిసారి ఎన్నిక (విద్యా శాఖా మంత్రిణిగా)[మార్చు]
ఆనంది బెన్ పటేల్ 1998 లో రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి గుజరాత్ లోని మండలం నియోజవర్గం నుండి పోటీచేశారు. ఆమె ఆ ఎన్నికలలో విజయం సాధించి గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వంలో కెశూభాయి పటేల్ గారి మంత్రి వర్గంలో విద్యా శాఖా మంత్రిగా పనిచేశారు. ఆ తరువాత గుజరార్ రాష్ట్రంలో ఐదవ కేబినెట్ మంత్రిగానూ, విద్యా శాఖలోని మంత్రిగాను ఉన్నారు.
ఆమె మొదటిసారి విద్యాశాఖా మంత్రిగా ఉన్నపుడు "లోక్‌దర్బార్"ను ప్రారంభించి పాఠశాలల, విద్యలోని వివిధ సమస్యలను వెంటనే పరిష్కరించేవారు. ఆమె నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం "షాల ప్రవేతోత్సవ్"ను ప్రారంభించి పాఠశాలలోని నమోదును పెంచుటకు కృషిచేసింది. ఈ కార్యక్రమం ఈనాటికి కూడా విద్యాశాఖలో కొనసాగుతుంది. ఆమె కృషి ఫలితంగా 100 శాతం ఫలితాలను సాధించడం జరిగింది..[1] మొదటిసారి రెండుసార్లు విద్యాశాఖామంత్రిగా ఉన్నపుడు ఆమె 26,000 మంది ఉపాద్యాయుల నియామకం జరిపి గత 6 సంవత్సరాల కాలంలో ఉన్న ఖాళీ పోస్టులను భర్తీ చేశారు. ఆమె విద్యాశాఖలో ఉపాద్యాయుల బదిలీలలో జరిగే అవినీతిని నియంత్రించి విశేష ఖ్యాతిని పొందారు. ఆమె అంధవికలాంగుల బాలల కోసం ప్రత్యేక పాఠశాలలను నెలకొల్పడానికి నిర్ణయించారు.
పటాన్ నుండి రెండవ , మూడవసారి ఎన్నికలు (2002-2012)[మార్చు]
ఆనందిబెన్ పటేల్ 2002, 2007 లలో నరేంద్రభాయి మోడీ నాయకత్వంలో రెండవసారి , మూడవసారి ఎన్నికలలో పోటీచేసి పటాన్ నియోజకవర్గం నుండి గెలుపొందారు. ఆమె విద్యాశాఖలో విశేషంగా చేసిన కృషి ఫలితంగా ఆమె ఈ విజయాలను సాధించారు. ఆమె రెండవ సారి ఎన్నికైనప్పుడు కూడా విద్యాశాఖ మంత్రిణిగానే పనిచేసారు. మూడవసారి ఎన్నికైనపుడు ఆమె ముఖ్య శాఖలైన రోడ్లు, భవనాలు, రెవెన్యూ శాఖలను సమర్థవంతంగా నిర్వహించారు.
ఆమె 10 సంవత్సరాల పాటు "పటాన్"లో శాసన సభ్యురాలిగా ఉన్నప్పుడు అవిశ్రాంతంగా ఆ ప్రాంత అభివృద్ధికి కృషి చేశారు. ఆమె మంత్రిణిగా ఉన్న కాలంలో రైతుల సంక్షేమం కోసం నర్మదా కాలువను పటాన్ కు చేర్చారు. ఆ ప్రాంతంలో 174 చెక్‌డ్యాం లను నిర్మించారు. పటాన్ లోని ప్రజలకు స్వఛ్ఛమైన త్రాగునీరు అందించుటకు అతి పెద్ద నీటి శుద్ధి ప్లాంటును ఏర్పాటుచేశారు. ఆ ప్రాంతంలో క్రొత్త ఇంజనీరింగు, మెడికల్ కళాశాలలను నెలకొల్పారు. 700 కి.మీ పొడవు గల రోడ్లను నిర్మించారు. భూగర్భ డ్రైనేజీ వ్యవస్థను అభివృద్ధి చేశారు.
పటాన్ ప్రస్తుతం ప్రపంచంలోని పెద్దవైన ఫోటో-వాల్టాయిక్ సోలార్ ప్లాంటులలో రెండవ స్థానం పొందింది.
2012 - ఘలోడియా నుండి నాల్గవసారి ఎన్నిక[మార్చు]
2012 లో శాసన అహ్మదాబాదు లోని ఘటోలియా నియోజకవర్గం నుండి ఆమె పోటీచేశారు. ఆమె చేసిన కృషి ఫలితంగా ఆమె ఘన విజయాన్ని సాధించింది. ప్రస్తుత ప్రభుత్వంలో ఆమె ముఖ్యమైన శాఖలైన "రోడ్లు, భవనాలు", "రెవెన్యూ", "పట్టణాభివృద్ధి", " అర్బన్ హౌసింగ్ అండ్ డిసాస్టర్ మేనేజిమెంటు" శాఖలను చేపట్టారు.
వ్యక్తిగత జీవితం[మార్చు]
ఆమె శాకాహారి. ఆమె జీవనశైలి మిత వ్యయంచేసేదిగా, విపరీతమైన పరిపాలనా సామర్థ్యం కలిగినదిగా ప్రసిద్ధి చెందింది. ఆమె రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రభుత్వాధికారులను కలసి పథకాల అమలుకై కృషిచేసేవారు. ఆమెకు పిల్లలంటే మక్కువ కనుక పిల్లలకు విద్యా బోధన చేసే అవకాశాన్ని జారవిడుచుకొనేవారు కాదు. ఆమెకు ఇద్దరు పిల్లలు. వారు సంజత్ పటేల్, అనార్ పటేల్.
ప్రత్యేక గౌరవాలు, గుర్తింపులు[మార్చు]
- 1989 : రాష్ట్రపతిచే ఉత్తమ ఉపాధ్యాయురాలిగా గుర్తింపు.
- 1988 : గుజరాత్ రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలిగా పురస్కారం.
- 1999 : సర్దాల్ పటేల్ పురస్కారం, గుజరాత్ లోని పటేల్ జాగృతి మండలి ద్వారా అందజేయబడినది.
- 2005 : "పటిదర్ శిరోమణి" పురస్కారం, పటేల్ కమ్యూనిటీ ద్వారా
- మహిళా సంక్షేమ కార్యక్రమాలు చేసినందుకు గానూ ధరతి వికాస్ మండలం చే ప్రత్యేక గౌరవం
- పాఠశాల క్రీడలలో చేసిన కృషికి పాఠశాలలో "వీరబాల" పురస్కారం.
- 2000 : విద్యా గౌరవ్ పురస్కారం, శ్రీ తపోధన్ బ్రాహ్మణ్ వికాస్ మండలి వారిచే
గాలంట్రీ అవార్డులు[మార్చు]
- Gallantry Award for rescuing two girls of Mohinaba Girl's school from drowning at Navagam reservoir in Narmada.
- Winner of Charumati Yoddha Award (Jyotisangh), Ahmedabad.
- Winner of Ambubhai Purani Vyayam Vidyalay Award (Rajpipala)
మూలాలు[మార్చు]
- ↑ 1.0 1.1 1.2 1.3 "Profile". Archived from the original on 2014-08-16. Retrieved 2014-04-16.
- ↑ "Team Modi: meet the ministers". Gujarat. NDTV. March 5, 2013. Retrieved 2014-04-16.
- ↑ "Minister asks officials not to harass investors". Vapi. Times of India. February 18, 2012. Archived from the original on 2013-06-29. Retrieved 2013-05-09.
- ↑ 4.0 4.1 4.2 "Iron Lady in Waiting". IndiaToday. August 10, 2013. Retrieved 2014-04-16. ఉల్లేఖన లోపం: చెల్లని
<ref>
ట్యాగు; "article" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు - ↑ "IE India's 100 most influential people". IndianExpress. Retrieved 2014-04-16.