తెలంగాణ గవర్నర్ల జాబితా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
తెలంగాణ గవర్నర్
రాజ్ భవన్
విధంఎక్సలెన్సీ
అధికారిక నివాసంరాజ్ భవన్, హైదరాబాదు
నియామకంభారత రాష్ట్రపతి
కాలవ్యవధిఐదు సంవత్సరాలు
ప్రారంభ హోల్డర్ఈ.ఎస్.ఎల్.నరసింహన్ (అదనపు ఛార్జి)
నిర్మాణం2 జూన్ 2014; 10 సంవత్సరాల క్రితం (2014-06-02)

తెలంగాణ గవర్నరు, తెలంగాణ రాష్ట్ర నామమాత్రపు అధిపతి, ప్రతినిధి. భారత రాష్ట్రపతి చేత 5 సంవత్సరాల కాలానికి రాష్ట్ర గవర్నర్‌ నియమించబడుతారు.[1]

రాష్ట్రపతి ఇష్టంతో గవర్నరు పదవీ బాధ్యతలు నిర్వహిస్తారు. గవర్నర్ రాష్ట్ర ప్రభుత్వ డి జ్యూర్ హెడ్. ప్రభుత్వ ద కార్యనిర్వాహక చర్యలన్నీ గవర్నర్ పేరు మీద జరుగుతాయి. తెలంగాణ ముఖ్యమంత్రి నేతృత్వంలోని ప్రజాభిప్రాయంతో ఎన్నికైన తెలంగాణ ప్రభుత్వం సలహా మేరకు గవర్నర్ తప్పనిసరిగా పని చేయాలి, ఆ విధంగా రాష్ట్రానికి వాస్తవ కార్యనిర్వాహక అధికారిగా ముఖ్యమంత్రి వ్యవహరిస్తారు. భారత రాజ్యాంగం గవర్నర్‌కు మంత్రిత్వ శాఖను నియమించడం లేదా తొలగించడం, రాష్ట్రపతి పాలనను సిఫార్సు చేయడం లేదా రాష్ట్రపతి ఆమోదం కోసం బిల్లులను రిజర్వ్ చేయడం వంటి వారి స్వంత అభీష్టానుసారం వ్యవహరించడానికి అధికారం ఇస్తుంది. హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌లోని అతని అధికారిక నివాసం.

2024, జూలై 31 నుండి జిష్ణు దేవ్‌ వర్మ తెలంగాణ గవర్నరుగా కొనసాగుతున్నారు.[2]

అవలోకనం

[మార్చు]

తెలంగాణ 2014 జూన్ 2న స్వతంత్ర రాష్ట్రంగా విభజించబడింది. అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గవర్నరు, ఈ. ఎస్.ఎల్. నరసింహన్ కొత్త రాష్ట్రానికి మొదటి గవర్నర్‌గా నియమితులయ్యారు. 2019 వరకు ఉభయ రాష్ట్రాలకు గవర్నర్‌గా కొనసాగారు. తెలంగాణ రాష్ట్రానికి 2019 సెప్టెంబరు 7 వరకు పనిచేసారు. 2019 సెప్టెంబరులో తమిళిసై సౌందరరాజన్ తెలంగాణ గవర్నర్‌గా నియమితురాలైంది. సౌందరరాజన్ రాష్ట్ర గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టిన తొలి మహిళ. 2024 మార్చిలో ఆమె రాజీనామా చేసేన తరువాత జార్ఖండ్ గవర్నరు సి. పి. రాధాకృష్ణన్ గవర్నర్‌గా అదనపు బాధ్యతలు నిర్వహించేందుకు నియమించబడ్డారు.

అధికారాలు, విధులు

[మార్చు]

గవర్నర్ అనేక రకాల అధికారాలను కలిగి ఉంటారు:

  • పరిపాలన, నియామకాలు, తొలగింపులకు సంబంధించిన కార్యనిర్వాహక అధికారాలు,
  • చట్టాన్ని రూపొందించడం, శాసనసభ, రాష్ట్ర శాసనసభకు సంబంధించిన శాసన అధికారాలు, అంటే విధానసభ లేదా విధాన పరిషత్.
  • విచక్షణ అధికారాలు గవర్నర్ నిర్ణయం రకారం నిర్వహించబడతాయి.

తెలంగాణ గవర్నర్ల జాబితా

[మార్చు]

గవర్నర్ అధికారిక నివాసం రాజ్ భవన్, ఇది రాష్ట్ర రాజధాని హైదరాబాదులో ఉంది.[3][4] తెలంగాణ విభజన చెందిన తరువాత 2014 జూన్ 2 నుండి 2024 మార్చి 18 వరకు ఇద్దరు గవర్నర్లు పనిచేసారు. ప్రస్తుత గవర్నరుగా సి.పి. రాధాకృష్ణన్ 2024 మార్చి 19 నుండి (అదనపు బాధ్యతలు) కొనసాగుచున్నారు.[5]

క్రమసంఖ్య పేరు ఫోటో
(జననం–మరణం)
పదవి ప్రారంభం పదవి ముగింపు కాల వ్యవధి మునుపటి పదవి నియమించింది
ఈ.ఎస్.ఎల్.

నరసింహన్ (అదనపు ఛార్జీ)

(1945–) 2014 జూన్ 2 2019 జూలై 23 5 సంవత్సరాలు, 51 రోజులు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ప్రణబ్ ముఖర్జీ
1 ఈ.ఎస్.ఎల్.

నరసింహన్

(1945–) 2019 జూలై 24 2019 సెప్టెంబరు 7 45 రోజులు
2 తమిళిసై సౌందరరాజన్ (1961–) 2019 సెప్టెంబరు 8 2024 మార్చి 18[6] 4 సంవత్సరాలు, 193 రోజులు భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలు, తమిళనాడు రామ్‌నాథ్‌ కోవింద్‌
3 సీ.పీ. రాధాకృష్ణన్

(అదనపు ఛార్జీ) [7]

(1957-) 2024 మార్చి 19 2024 జూలై 31 132 రోజులు జార్ఖండ్ గవర్నర్‌ ద్రౌపది ముర్ము
4 జిష్ణుదేవ్‌వర్మ
(త్రిపుర)[8]
(జననం 1957) 2024 జూలై 31[9] ప్రస్తుతం 56 రోజులు త్రిపుర ఉప ముఖ్యమంత్రి ద్రౌపది ముర్ము

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. M.R, Abhilash (2022-03-09). "The office of the Governor". The Hindu. ISSN 0971-751X. Retrieved 2022-06-21.
  2. https://www.india.gov.in/my-government/whos-who/governors
  3. "TRS chief KCR to be sworn-in as first CM of Telangana on Monday". The Indian Express. Press Trust of India. 1 June 2014. Retrieved 20 February 2020.
  4. Common Governor of Telangana, Andhra to oversee law and order in Hyderabad post bifurcation: South, News - India Today
  5. "Raj Bhavan". governor.telangana.gov.in. Archived from the original on 2024-05-26. Retrieved 2024-06-21.
  6. The Hindu (18 March 2024). "Tamilisai, Telangana Governor and Puducherry Lt. Governor, resigns to contest Lok Sabha polls". Archived from the original on 18 March 2024. Retrieved 18 March 2024.
  7. Zee News Telugu (19 March 2024). "తెలంగాణ కొత్త గ‌వ‌ర్న‌ర్‌గా సీపీ రాధాకృష్ణ‌న్‌.. జార్ఖండ్ గ‌వ‌ర్న‌ర్ కు అదనపు బాధ్యతలు." Archived from the original on 19 March 2024. Retrieved 19 March 2024.
  8. https://www.india.gov.in/my-government/whos-who/governors
  9. "Jishnu Dev Varma to take oath as Governor of Telangana". News on AIR. 31 July 2024.