జిష్ణు దేవ్‌ వర్మ

వికీపీడియా నుండి
(జిష్ణుదేవ్‌వర్మ నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
జిష్ణుదేవ్‌ వర్మ
జిష్ణు దేవ్‌ వర్మ


అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
31 జూలై 2024
ముందు సీ.పీ. రాధాకృష్ణన్ (అదనపు బాధ్యత)

పదవీ కాలం
9 మార్చి 2018 – 2 మార్చి 2023
ముందు దశరథ్ దేబ్ (1988)
నియోజకవర్గం చరిలం

త్రిపుర బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షుడు

వ్యక్తిగత వివరాలు

జననం (1957-08-15) 1957 ఆగస్టు 15 (వయసు 67)
త్రిపుర, భారతదేశం
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
తల్లిదండ్రులు రామేంద్ర కిషోర్ దెబ్బర్మ, కమల్ ప్రభాదేవి
జీవిత భాగస్వామి సుధా దేవ్‌వర్మ
బంధువులు ప్రద్యోత్ బిక్రమ్ మాణిక్య దేబ్ బర్మా (మేనల్లుడు)
కృతి దేవి డెబ్బర్మాన్ (మేనకోడలు)
సంతానం ప్రతీక్ కిషోర్ దేవ్ వర్మ, జైబంత్ దేవ్ వర్మ
పూర్వ విద్యార్థి కలకత్తా విశ్వవిద్యాలయం (బి.ఎ ఆనర్స్. ఇంగ్లీష్ లిటరేచర్)

జిష్ణు దేవ్ వర్మ (జననం 1957 ఆగస్టు 15) [1] భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. త్రిపుర రాష్ట్రానికి 2018 నుండి 2023 వరకు 2వ ఉప ముఖ్యమంత్రిగా పని చేసిన అతనిని 2024 జూలై 27న భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలంగాణ గవర్నర్‌గా నియమించింది[2][3][4][5]

వ్యక్తిగత జీవితం

[మార్చు]

జిష్ణు దేవ్ వర్మ 1957 ఆగస్టు 15న త్రిపుర రాజా కుటుంబంలో జన్మించాడు.[6] జిష్ణు దేవ్ వర్మ సుధా దేవ్‌వర్మను వివాహం చేసుకున్నాడు. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు ప్రతీక్ కిషోర్ దేవ్ వర్మ, జైబంత్ దేవ్ వర్మ ఉన్నారు.

రాజకీయ జీవితం

[మార్చు]

దేవ్ వర్మ 1990లో రామజన్మభూమి ఉద్యమం సమయంలో భారతీయ జనతా పార్టీలో చేరాడు. ఆయన ఆ తరువాత 1993లో త్రిపుర బీజేపీ జాతీయ మండలి సభ్యుడిగా, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా వివిధ హోదాల్లో పని చేశాడు.

అతను 1996, 1999 లోక్‌సభ ఎన్నికలలో తూర్పు త్రిపుర నుండి, 1998 త్రిపుర శాసనసభ ఎన్నికలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయాడు.

జిష్ణు దేవ్‌ వర్మ 2018లో చరిలం శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికై 2018 నుండి 2023 వరకు 2వ ఉప ముఖ్యమంత్రిగా పని చేశాడు. అతను 2023లో జరిగిన శాసనసభ ఎన్నికలలో పోటీ చేసి తిప్ర మోత పార్టీ అభ్యర్థి సుబోధ్ దేబ్ బర్మా చేతిలో ఓడిపోయాడు.[7]

జిష్ణు దేవ్‌ వర్మను 2024 జూలై 27న భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలంగాణ గవర్నర్‌గా నియమించగా,[8][9][10] అతనితో 2024 జూలై 27న గవర్నర్‌గా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అలోక్ అరధే ప్రమాణ స్వీకారం చేయించాడు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు దుద్దిల్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ తదితరులు హాజరయ్యారు.[11]

గ్రంథ పట్టిక

[మార్చు]
  • దేవ్ వర్మ, జిష్ణు (2024), ది చిల్డ్రన్ ఆఫ్ వాటర్ గాడెస్, (ఇంకా ప్రచురించాల్సి ఉంది)
  • దేవ్ వర్మ, జిష్ణు (2024), వీక్షణలు, సమీక్షలు. నా కవితలు, (ఇంకా ప్రచురించాల్సి ఉంది)
  • దేవ్ వర్మ, జిష్ణు (2023), కాన్ (ఫ్యూజన్) ఆఫ్ లాంగ్వేజ్ అండ్ ఒరిజిన్, త్రిపుర క్రానికల్
  • దేవ్ వర్మ, జిష్ణు (2022), లుక్కింగ్ బ్యాక్, త్రిపుర క్రానికల్
  • దేవ్ వర్మ, జిష్ణు (2022), మహారాజా బీర్ బిక్రమ్ కాలేజ్: ఎ డ్రీం కాలేజ్, త్రిపుర క్రానికల్
  • దేవ్ వర్మ, జిష్ణు (2022), ఇండిజినోస్ వీస్డోమ్- మ్యాన్ అండ్ నేచర్
  • దేవ్ వర్మ, జిష్ణు (2022), ది ఇండిజినస్ వరల్డ్ వ్యూ. (మ్యాన్ అండ్ నేచర్), త్రిపుర నెట్

మూలాలు

[మార్చు]
  1. "BJP picks Biplab Deb as new Tripura CM, Jishnu Deb Barman be his deputy - india news - Hindustan Times". m.hindustantimes.com. 6 March 2018.
  2. Administrator. "Current CM/Deputy CM". www.bjp.org. Archived from the original on 16 February 2019. Retrieved 10 March 2018.
  3. "Biplab Deb to be next Tripura CM, Jishnu Deb Burman his deputy; swearing-in likely on Friday - Firstpost". 6 March 2018.
  4. Scroll Staff. "Tripura: Deputy CM Jishnu Debbarma wins Charilam Assembly constituency".
  5. "TRIPURAINFO : The first news, views & information website of TRIPURA". www.tripurainfo.com. Archived from the original on 24 October 2018. Retrieved 9 March 2018.
  6. "Tripura royal family scion to be deputy chief minister - Times of India". The Times of India. 7 March 2018.
  7. The Indian Express (3 March 2023). "The blemish in BJP's Tripura win: Deputy CM Jishnu Dev Varma pays for misjudging TIPRA Motha" (in ఇంగ్లీష్). Archived from the original on 31 July 2024. Retrieved 31 July 2024.
  8. The Times of India (29 July 2024). "Tripura's ex-deputy CM Jishnu Dev Varma becomes T'gana guv". Archived from the original on 31 July 2024. Retrieved 31 July 2024.
  9. "తెలంగాణ గవర్నర్‌గా జిష్ణుదేవ్‌వర్మ.. తొమ్మిది రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు". web.archive.org. 2024-07-28. Archived from the original on 2024-07-28. Retrieved 2024-07-28.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  10. Andhrajyothy (28 July 2024). "రాష్ట్ర గవర్నర్‌గా జిష్ణుదేవ్‌ వర్మ." Archived from the original on 28 July 2024. Retrieved 28 July 2024.
  11. Eenadu (31 July 2024). "తెలంగాణ గవర్నర్‌గా జిష్ణుదేవ్‌ వర్మ ప్రమాణ స్వీకారం". Archived from the original on 31 July 2024. Retrieved 31 July 2024.