తిప్ర మోత పార్టీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
తిప్ర మోత పార్టీ
నాయకుడుప్రద్యోత్‌ విక్రమ్‌ మాణిక్య దేవ్‌
స్థాపకులుప్రద్యోత్‌ విక్రమ్‌ మాణిక్య దేవ్‌[1]
స్థాపన తేదీ2019
ప్రధాన కార్యాలయంమాణిక్య రాజవంశ వారసత్వ నివాస గృహం,
ఉజ్జయంత ప్యాలెస్,
ప్యాలెస్ కాంపౌండ్,
అగర్తల, త్రిపుర
799001
విద్యార్థి విభాగంతిప్ర ఇండిజినస్ స్టూడెంట్స్ ఫెడరేషన్
యువత విభాగంయూత్ టిప్రా ఫెడరేషన్
మహిళా విభాగంతిప్ర విమెన్ ఫెడరేషన్
రాజకీయ విధానంత్రిపుర జాతీయవాదం[2]
గ్రేటర్ టిప్రాలాండ్[2]
నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్
పౌరసత్వ (సవరణ) చట్టం[3]
ఇమ్మిగ్రేషన్ వ్యతిరేకత , ఇమ్మిగ్రేషన్ వ్యతిరేకం
ప్రాంతీయవాదం
రంగు(లు)  
ECI StatusState Party (Tripura)[4]
శాసన సభలో స్థానాలు
13 / 60
Election symbol
Party flag

తిప్ర మోత పార్టీ భారతదేశంలోని త్రిపుర రాష్ట్రంలోని ప్రాంతీయ రాజకీయ పార్టీ, ఇది అంతకుముందు త్రిపురలో ఒక సామాజిక సంస్థ. ఈ పార్టీని 5 ఫిబ్రవరి 2021న రాజ కుటుంబానికి చెందిన ప్రద్యోత్ కిశోర్ మాణిక్య దెబ్బర్మ స్థాపించాడు.

ప్రద్యోత్‌ విక్రమ్‌ మాణిక్య దేవ్‌ 2021లో తిప్ర మోతా పార్టీని స్థాపించక ముందు త్రిపుర ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడిగా పని చేసి[5], ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీతో విభేదించి గ్రేటర్‌ తిప్రల్యాండ్‌ సాధన కోసం సొంత పార్టీని స్థాపించి 2023 అసెంబ్లీ ఎన్నికల్లో తిప్ర మోత పార్టీ 13 స్థానాల్లో విజయం సాధించి ప్రధాన ప్రతిపక్షంగా నిలిచింది.[6]

పార్టీ స్థాపన

[మార్చు]

ప్రద్యోత్ బిక్రమ్ మాణిక్య దేబ్ బర్మా త్రిపుర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా 25 ఫిబ్రవరి 2019న నియమితులయ్యాడు. ఆ తరువాత 'అవినీతిపరులకు' పార్టీలో చోటు కల్పించాలని కాంగ్రెస్ హైకమాండ్ తనపై ఒత్తిడి తెచ్చిందని ఆరోపిస్తూ కొన్ని నెలల్లో ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేసి,  మూడు నెలల తర్వాత స్థానిక ప్రజల హక్కుల కోసం పని చేయడానికి ఒక సామాజిక సంస్థను ఏర్పాటు చేశాడు.[7]

ప్రద్యోత్ బిక్రమ్ మాణిక్య దేబ్ బర్మా 5 ఫిబ్రవరి 2021న తన సంస్థను రాజకీయ పార్టీగా మారిందని, 2021 త్రిపుర ట్రైబల్ ఏరియాస్ అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్ ఎన్నికల్లో పోటీ చేస్తుందని ప్రకటించాడు.  ఇండిజినస్ నేషనలిస్ట్ పార్టీ ఆఫ్ ట్విప్రా (INPT)[8] , టిప్రాలాండ్ స్టేట్ పార్టీ (TSP), ఇండిజినస్ పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్ త్రిపుర (IPFT) 2021లో తిప్ర మోత పార్టీలో విలీనమయ్యాయి.

ఎన్నికల చరిత్ర

[మార్చు]

తిప్ర మోత పార్టీ 2021లో ట్రైబల్ ఏరియాస్ అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్ ఎన్నికలలో తన  మిత్రపక్షమైన ఇండిజినస్ నేషనలిస్ట్ పార్టీ ఆఫ్ ట్విప్రా (INPT) తో పోటీ చేసి కలిసి 28 స్థానాలకుగాను 18 స్థానాలు గెలిచింది. తిప్ర 16 సీట్లు గెలుచుకోగా, ఇండిజినస్ నేషనలిస్ట్ పార్టీ ఆఫ్ ట్విప్రా 2 సీట్లు గెలుచుకుంది.[9] లెఫ్ట్ ఫ్రంట్ 15 ఏళ్ల పాలనను ముగించడమే కాకుండా జాతీయ పార్టీతో పొత్తు లేకుండా కౌన్సిల్‌లో అధికారంలోకి వచ్చిన ఏకైక ప్రాంతీయ పార్టీగా అవతరించింది.[10]

60 సీట్లున్న త్రిపుర శాసనసభలో 2023లో ఎన్నికలలో తిప్ర మోత 42 మంది అభ్యర్థులను పోటీలో నిలవగా తిప్ర మోత పార్టీ 13 స్థానాల్లో విజయం సాధించి ప్రధాన ప్రతిపక్షంగా నిలిచింది.[11]

శాసన సభ ఎన్నికలు

[మార్చు]
ఎన్నికల సంవత్సరం మొత్తం ఓట్లు మొత్తం ఓట్లలో % సీట్లు పోటీ పడ్డాయి సీట్లు గెలుచుకున్నారు సీట్లలో +/- ఓట్ షేర్‌లో +/- పక్కన కూర్చున్నాడు
త్రిపుర శాసనసభ
2023 498,182 19.69 42 13 - - లెఫ్ట్ కూటమి

(ప్రధాన ప్రతిపక్షం)

ఇవికూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. Ali, Syed Sajjad (29 March 2021). "IPFT puts pet Tipraland demand on the backburner". The Hindu (in Indian English). Retrieved 29 March 2021.
  2. 2.0 2.1 Colney, Kimi. ""We want self-rule": Pradyot Debbarma on his party's victory in Tripura tribal council polls". The Caravan (in ఇంగ్లీష్). Retrieved 2021-08-28.
  3. "Tripura: Former Congress state president calls for ethnic unity during anti-CAA protest". The Indian Express (in ఇంగ్లీష్). 2020-01-12. Retrieved 2021-08-28.
  4. "Recognition of Tipra Motha Party,as a State Party in Tripura". 10 April 2023.
  5. Deb, Debraj (26 February 2019). "Tripura royal scion Pradyot Debburman appointed Pradesh Congress president". The Indian Express (in ఇంగ్లీష్). Retrieved 1 June 2020.
  6. India Today (2 March 2023). "Tripura Election Result 2023: BJP wins 32 seats, Tipra Motha bags 13" (in ఇంగ్లీష్). Archived from the original on 12 February 2024. Retrieved 12 February 2024.
  7. Hindustan Times (26 December 2019). "Tripura's royal scion forms apolitical front to fight for indigenous people" (in ఇంగ్లీష్). Archived from the original on 12 February 2024. Retrieved 12 February 2024.
  8. NDTV (6 May 2021). "Key Tripura Tribal Party Merges With Pradyot Kishore Deb Barman's Party". Archived from the original on 12 February 2024. Retrieved 12 February 2024.
  9. The Hindu (10 April 2021). "Big win for TIPRA in Tripura tribal council election" (in Indian English). Archived from the original on 12 February 2024. Retrieved 12 February 2024.
  10. "Tipra wins Tripura council polls" (in ఇంగ్లీష్). Retrieved 12 February 2024. {{cite news}}: |archive-date= requires |archive-url= (help)
  11. Eenadu (2 March 2023). "భాజపాదే త్రిపుర, నాగాలాండ్‌.. మేఘాలయలో హంగ్". Archived from the original on 12 February 2024. Retrieved 12 February 2024.