Jump to content

రామెన్ దేక

వికీపీడియా నుండి
రామెన్ దేక
రామెన్ దేక


లోక్‌సభ సభ్యుడు
మంగళదోయ్ నియోజకవర్గం
పదవీ కాలం
16 మే 2009 – 23 మే 2019
ముందు నారాయణ్ చంద్ర బోర్కటకీ
తరువాత దిలీప్ సైకియా

వ్యక్తిగత వివరాలు

జననం (1954-03-01) 1954 మార్చి 1 (వయసు 70)
సువాల్కుచి, అస్సాం, భారతదేశం
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
తల్లిదండ్రులు సురేంద్రనాథ్ దేక
జీవిత భాగస్వామి రాణీ దేకాకకోటి
సంతానం 2
పూర్వ విద్యార్థి గౌహతి యూనివర్సిటీ (బి.ఏ (ఫిలాసఫీ & ఎకనామిక్స్))

రామెన్ దేక అసోం రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. అతను 2014లో మంగళ్‌దోయ్ పార్లమెంట్ నియోజకవర్గం నుండి ఎంపీగా ఎన్నికయ్యాడు.[1] 2024 జులై 27న ఛత్తీస్‌గఢ్ గవర్నర్‌గా నియమితుడై 2024 జులై 31 నుండి అధికారంలో కొనసాగుచున్నారు.[2][3]

జననం, విద్యాభాస్యం

[మార్చు]

రామెన్ దేక 1954 మార్చి 1 లో అసోం లోని సువాల్కుచిలో జన్మించాడు. అతను అసోం విశ్వ విద్యాలయంలో బీఏ పూర్తి చేశాడు. రామెన్ విద్యార్థి దశలో 1972లో ఏబివిపి పూర్వాంచల్ జనరల్ సెక్రటరీగా, హోల్ సేల్ జనరల్ మర్చంట్స్ అసోసియేషన్ అడ్వైజర్‌గా, 1974 -75 వరకు గౌహతి విశ్వవిద్యాలయం కోర్ట్ మెంబర్‌గా, 1979లో అసోం సాహిత్య సభకు కల్చరర్ సెక్రటరీగా వివిధ హోదాల్లో పనిచేశాడు.

రాజకీయ జీవితం

[మార్చు]

రామెన్ దేక చదువు పూర్తికాగానే జనతాపార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 1977లో అసోం జనతాపార్టీ జనరల్ సెక్రటరీగా పనిచేశాడు. జనతాపార్టీలో భారతీయ జనతా పార్టీగా మారిన తరువాత ఆర్ఎస్ఎస్ లో పూర్తిస్థాయి ప్రచారక్ గా ఉన్నాడు.

నిర్వహించిన పదవులు

[మార్చు]
  • 1977 లో అసోం జనతాపార్టీ జనరల్ సెక్రటరీగా పనిచేశారు.
  • 1980 లో బీజేపీ వ్యవస్థాపక సభ్యుడు
  • 2005లో బీజేపీ అధికార ప్రతినిధి
  • బీజేపీ రాష్ట్ర జనరల్ సెక్రటరీగా, అసోం బీజేపీ ఉపాధ్యక్షుడిగా, బిజెపి ఈశాన్య రాష్ట్రాల కోఆర్డినేషన్ కౌన్సిల్, జాతీయ కౌన్సిల్ జనరల్ సెక్రటరీగా పనిచేశాడు.
  • 2006 లో బీజేపీ అసోం రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితుడయ్యాడు
  • 2009లో అసోంఅసోంలోని మంగలదోయ్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి బీజేపీ తరపున పోటీ చేసి ఎంపీగా ఎన్నికయ్యాడు.
  • 2009 ఆగస్టు 31 నుంచి 2014 మే వరకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన స్టాండింగ్ కమిటీలో సభ్యుడిగా ఉన్నాడు.
  • 2010 మే 1 లో పబ్లిక్ అకౌంట్స్ కమిటీలో, సబార్డినేట్ లెజిస్లేషన్ కమిటీలో సభ్యుడు
  • కేంద్ర గనుల మంత్రిత్వశాఖ ఏర్పాటు చేసిన సంప్రదింపుల కమిటీలో సభ్యుడు
  • 2014 మేలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మంగలదోయ్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి రెండోసారి ఎంపీగా ఎన్నికయ్యాడు.
  • 2014 జూన్ 9 నుంచి లోక్ సభ ప్యానల్ చైర్ పర్సన్స్ లో సభ్యుడు
  • 2014 ఆగస్టు 14 నుంచి ఎస్టిమేట్స్ కమిటీలో సభ్యుడు
  • 2014 సెప్టెంబరు 1 కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన స్టాండింగ్ కమిటీలో సభ్యుడు
  • విదేశాంగ శాఖ సంప్రదింపుల కమిటీలో సభ్యుడు
  • ప్రధానమంత్రి ఆదర్శ్ గ్రామ్ యోజన కేంద్ర అడ్వైజరీ కమిటీలో సభ్యుడు
  • 2015 జనవరి 29 నుంచి సాధారణ ప్రయోజనాల కమిటీలో కమిటీలో సభ్యుడు
  • జులై 3, 2015 నుంచి ఎస్టిమేట్స్ కమిటీ, సబ్ కమిటీ -II లో కమిటీలో సభ్యుడు[4]

మూలాలు

[మార్చు]
  1. Lok Sabha (2014). "Ramen Deka". Archived from the original on 25 April 2022. Retrieved 25 April 2022.
  2. "Press Trust Of India". www.ptinews.com. Retrieved 2024-09-08.
  3. "Ramen Deka appointed CG Guv". The Times of India. 2024-07-29. ISSN 0971-8257. Retrieved 2024-09-08.
  4. The Times of India (2018). "RAMEN DEKA : Bio, Political life, Family & Top stories". Archived from the original on 25 April 2022. Retrieved 25 April 2022.