ఆరీఫ్ మహమ్మద్ ఖాన్
ఆరీఫ్ మహమ్మద్ ఖాన్ | |
---|---|
![]() | |
కేరళ రాష్ట్ర 22వ గవర్నరు | |
Assumed office 2019 సెప్టెంబరు 6 | |
ముఖ్యమంత్రి | పునరాయి విజయన్ |
23వ పౌర విమానయాన శాఖ మంత్రి | |
In office 1989 డిసెంబర్ 6 – 1990 నవంబర్ 10 | |
ప్రథాన మంత్రి | విశ్వనాధ్ ప్రతాప్ సింగ్ |
వ్యక్తిగత వివరాలు | |
జననం | ఉత్తరప్రదేశ్ , భారత్ | 1951 నవంబరు 18
జాతీయత | ![]() |
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ (2004 – 2019) |
ఇతర రాజకీయ పదవులు | భారత జాతీయ కాంగ్రెస్ (1986 వరకు) |
ఆరీఫ్ మహమ్మద్ ఖాన్(ఆంగ్లం:Arif Mohammad Khan) (జననం 1951 నవంబరు 18) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు, 2019 సెప్టెంబరు 6 నుండి కేరళ రాష్ట్ర గవర్నరుగా విధులు నిర్వహిస్తున్నాడు. ఈయన ఒక మాజీ కేంద్ర మంత్రి విధ్యుత్, పౌరవిమానయాన శాఖలకు ఒకప్పుడు మంత్రిగా ఉన్నాడు.[1]
తొలినాళ్లలో[మార్చు]
మహమ్మద్ ఖాన్ 1951 నవంబరు 18న ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బులాన్దేస్వర్ లో జన్మించాడు.
కెరీర్[మార్చు]
ఖాన్ విద్యార్థి నాయకుడిగా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించాడు. అతను 1972-73 సంవత్సరంలో అలీఘర్ ముస్లిం విశ్వవిద్యాలయం విద్యార్థి సంగం అధ్యక్షుడిగా దానికి ఒక సంవత్సరం ముందు (1971-72) దాని గౌరవ కార్యదర్శిగా కూడా ఉన్నాడు. భారతీయ క్రాంతి దళ్ పార్టీ బ్యానర్ పై బులంద్ షహర్ లోని సియానా నియోజకవర్గం నుండి మొదటి శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసినప్పటికీ ఓటమి పాలయ్యాడు. 1977 లో తన 26 వ ఏట యుపి శాసనసభ సభ్యుడయ్యాడు.[2][3]
ఇస్లాం సంస్కర్తగా[మార్చు]
ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ ముస్లింలకు సంబందించిన సంస్కరణలకు మద్దతు పలికేవాడు. 1986లో షా బానో కేసుపై రాజీవ్ గాంధీ కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తు రాష్ట్ర మంత్రి పదవికి తను రాజీనామా చేశారు. పార్లమెంటులో షా, బానో కేసుపై సుప్రీంకోర్టు తీర్పును ఆయన సమర్థించారు. ఆరిఫ్ ట్రిపుల్ తలాక్ ను వ్యతిరేకించాడు, దాన్ని పాటిస్తున్న వారికి 3 సంవత్సరాల జైలు శిక్ష విధించాలని చెప్పాడు.
మూలాలు[మార్చు]
- ↑ "Arif Khan, Modi govt's only 2nd Muslim governor, whose political views align with the BJP's".
- ↑ "Biographical Sketch of Member of 12th Lok Sabha". loksabhaph.nic.in. Retrieved 2019-09-01.
- ↑ "Let the Quran Speak for Itself, Books and Documents, Saif Shahin, NewAgeIslam.com, New Age Islam". Newageislam.com. Retrieved 2013-05-09.