Jump to content

రాజేంద్ర అర్లేకర్

వికీపీడియా నుండి
రాజేంద్ర అర్లేకర్
2025లో అర్లేకర్
తమిళనాడు గవర్నర్
అదనపు బాధ్యతలు
Assumed office
12 మార్చి 2026
ముఖ్యమంత్రిఎం. కె. స్టాలిన్
సి. జోసెఫ్ విజయ్ (పదవీ బాధ్యతలు స్వీకరించనున్నాడు)
అంతకు ముందు వారుఆర్. ఎన్. రవి
22వ కేరళ గవర్నర్
Assumed office
2 జనవరి 2025
ముఖ్యమంత్రిపినరయి విజయన్
అంతకు ముందు వారుఆరిఫ్ మహ్మద్ ఖాన్
28వ బీహార్ గవర్నర్
In office
17 ఫిబ్రవరి 2023  1 జనవరి 2025
ముఖ్యమంత్రినితీశ్ కుమార్
అంతకు ముందు వారుఫాగు చౌహాన్
తరువాత వారుఆరిఫ్ మహ్మద్ ఖాన్
21వ హిమాచల్ ప్రదేశ్ గవర్నర్
In office
13 జూలై 2021  16 ఫిబ్రవరి 2023
ముఖ్యమంత్రిజై రామ్ ఠాకూర్
అంతకు ముందు వారుబండారు దత్తాత్రేయ
తరువాత వారుశివ్ ప్రతాప్ శుక్లా
గోవా అటవీ, పర్యావరణ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి
In office
1 అక్టోబరు 2015  14 మార్చి 2017
ముఖ్యమంత్రిలక్ష్మీకాంత్ పార్సేకర్
గోవా శాసనసభ స్పీకర్
In office
16 మార్చి 2012  1 అక్టోబరు 2015
అంతకు ముందు వారుప్రతాప్‌సింగ్ రాణే
తరువాత వారుఅనంత్ షెట్
సభ్యుడు, గోవా శాసనసభ
In office
2012–2017
అంతకు ముందు వారుదయానంద్ సోప్టే
తరువాత వారుమనోహర్ అజ్‌గావ్కర్
నియోజకవర్గంపెర్నెం
In office
2002–2007
అంతకు ముందు వారుజోసే ఫిలిప్ డి'సౌజా
తరువాత వారుజోసే ఫిలిప్ డి'సౌజా
నియోజకవర్గంవాస్కో డ గామా
వ్యక్తిగత వివరాలు
జననం
రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్

(1954-04-23) 1954 ఏప్రిల్ 23 (వయసు: 72)
నోవా గోవా, గోవా, పోర్చుగీస్ ఇండియా
రాజకీయ పార్టీభారతీయ జనతా పార్టీ (1989 నుండి)
జీవిత భాగస్వామిఅనఘా అర్లేకర్
సంతానం2
నైపుణ్యంరాజకీయ నాయకుడు

రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ (జననం 23 ఏప్రిల్ 1954) భారతీయ రాజకీయ నాయకుడు. ఆయన 2025 జనవరి నుండి కేరళ గవర్నర్గా పనిచేస్తున్నారు. 2026 మార్చి 12న ఆయన తమిళనాడు గవర్నర్ గా అదనపు బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందు ఆయన బీహార్ గవర్నర్ గా, హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ గా కూడా పనిచేశారు. భారతీయ జనతా పార్టీకి చెందిన ఆయన, రెండుసార్లు గోవా శాసనసభకు ఎన్నికయ్యారు. 2015 నుండి 2017 వరకు గోవా ప్రభుత్వంలో కేబినెట్ మంత్రిగా, 2012 నుండి 2015 వరకు గోవా శాసనసభ స్పీకర్‌గా సేవలందించారు.

ప్రారంభ జీవితం , వ్యక్తిగత జీవితం

[మార్చు]

అర్లేకర్ పోర్చుగీస్ ఇండియాలోని నోవా గోవా (ప్రస్తుత పణజి, గోవా)లో విశ్వనాథ్ అర్లేకర్, తిలోమత్తమ దంపతులకు జన్మించారు.[1] ఆయన వాస్కో డ గామాలోని సెయింట్ జోసెఫ్ ఇన్‌స్టిట్యూట్‌లో పాఠశాల విద్యను పూర్తిచేశారు. అనంతరం జువారీనగర్‌లోని ఎం.ఇ.ఎస్. కళాశాలలో వాణిజ్యశాఖలో పట్టా పొందారు. ఆయన దళిత సమాజానికి చెందినవారు.[2] ఆయన భార్య పేరు అనఘా. వీరికి ఇద్దరు సంతానం ఉన్నారు.[1]

రాజకీయ జీవితం

[మార్చు]

అర్లేకర్ చిన్ననాటి నుంచే రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్‌)తో అనుబంధం కలిగి ఉన్నారు. అత్యవసర పరిస్థితి సమయంలో ఆయనను కారాగారంలో నిర్బంధించారు. 1989లో ఆయన భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లో చేరారు. పార్టీలో వివిధ హోదాలలో పనిచేసి, అనంతరం పార్టీ గోవా రాష్ట్ర విభాగానికి అధ్యక్షుడిగా కూడా సేవలందించారు. అర్లేకర్ మొదటిసారిగా 2002 గోవా శాసనసభ ఎన్నికల్లో గోవా శాసనసభకు ఎన్నికయ్యారు. తరువాత 2012లో మళ్లీ ఎన్నికయ్యారు. 2012లో ఆయన గోవా శాసనసభ స్పీకర్‌గా ఎన్నికయ్యారు. ఆయన స్పీకర్‌గా ఉన్న సమయంలో గోవా శాసనసభ కాగితరహిత (పేపర్‌లెస్) విధానాన్ని అవలంబించిన భారతదేశపు తొలి శాసనసభగా నిలిచింది. 2015 అక్టోబరులో ఆయనను గోవా ప్రభుత్వంలో పర్యావరణం, అటవీ శాఖల మంత్రిగా నియమించారు.[3]

గవర్నర్ పదవులు (2021–ప్రస్తుతం)

[మార్చు]

హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ (2021–2023)

[మార్చు]

2021 జూలై 6న అర్లేకర్‌ను హిమాచల్ ప్రదేశ్ గవర్నరుగా నియమించారు. ఈ పదవిలో ఆయన బండారు దత్తాత్రేయకు వారసుడయ్యారు.[4]

బీహార్ గవర్నర్ (2023–2025)

[మార్చు]

2023 ఫిబ్రవరి 16న అర్లేకర్ బీహార్ గవర్నరుగా ప్రమాణ స్వీకారం చేసి, ఆ రాష్ట్ర 28వ గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించారు. 2025 జనవరి 2 వరకు ఈ పదవిలో కొనసాగి, అనంతరం ఆయనను కేరళ గవర్నరుగా బదిలీ చేశారు.

కేరళ గవర్నర్ (2025–ప్రస్తుతం)

[మార్చు]

2024 డిసెంబర్ 24న ఆయనను కేరళ గవర్నరుగా నియమించారు. 2025 జనవరి 2న ఆయన అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు.[5]

తమిళనాడు గవర్నర్ (అదనపు బాధ్యత) (2026–ప్రస్తుతం)

[మార్చు]

2026 మార్చి 5న అర్లేకర్‌కు తమిళనాడు గవర్నర్గా అదనపు బాధ్యతలు అప్పగించారు.[6] 2026 మార్చి 12న ఆయన ఈ పదవికి అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు.[7]

మూలాలు

[మార్చు]
  1. 1 2 "Governor profile". రాజ్ భవన్, కేరళ. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 1 June 2025.
  2. "Governor Rajendra Arlekar is from schedule caste". Amar Ujala (in హిందీ). 21 May 2023. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 25 September 2025.
  3. Shetye, Murari (1 October 2015). "Pernem MLA Rajendra Arlekar takes oath as minister". The Times of India. ఒరిజినల్ నుండి 1 January 2017 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 9 January 2018.
  4. "Ex-Goa Speaker Rajendra Arlekar is new Himachal Governor". Lokmat English. IANS. 6 July 2021. ఒరిజినల్ నుండి 9 July 2021 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 6 July 2021.
  5. "Rajendra Arlekar is new Kerala Governor; Arif Mohammed Khan moved to Bihar". Onmanorama. 24 December 2024. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 1 June 2025.
  6. "New Governors in states, UT: TN's Ravi replaces Bose in Bengal ahead of polls, Hasnain for Bihar, Sandhu gets Delhi". The Indian Express. 6 March 2026. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 6 March 2026.
  7. "Rajendra Arlekar to take additional charge as TN Governor on March 12: Reports". Mathrubhumi News. 9 March 2026. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 10 March 2026.