Jump to content

సీ. పీ. రాధాకృష్ణన్

వికీపీడియా నుండి
(సీ.పీ. రాధాకృష్ణన్ నుండి దారిమార్పు చెందింది)
సి.పి. రాధాకృష్ణన్
సీ. పీ. రాధాకృష్ణన్

2024లో రాధాకృష్ణన్


పదవీ కాలం
2025 సెప్టెంబర్ 12 – ప్రస్తుతం
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ
ముందు జగదీప్ ధన్కర్

ప్రస్తుత పదవిలో
అధికార కాలం
31 జులై 2024[1]
ముందు రమేష్ బైస్

పదవీ కాలం
18 ఫిబ్రవరి 2023[2] – 2024 జులై 30[3][4]
ముందు రమేష్ బైస్
తరువాత సంతోష్ గంగ్వార్

పదవీ కాలం
20 మార్చి 2024[5] – 2024 జులై 30[6]
ముందు తమిళిసై సౌందరరాజన్
తరువాత జిష్ణు దేవ్‌ వర్మ

పదవీ కాలం
22 మార్చి 2024[7] – 1 ఆగస్టు 2024[8]
ముందు తమిళిసై సౌందరరాజన్
తరువాత కునియిల్ కైలాష్నాథన్

పదవీ కాలం
1998 – 2004
ముందు ఎం. రామనాథన్
తరువాత కె. సుబ్బరాయన్
నియోజకవర్గం కోయంబత్తూరు

వ్యక్తిగత వివరాలు

జననం (1957-05-04) 1957 మే 4 (వయసు: 68)
తిరుప్పూర్, మద్రాస్, భారతదేశం
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
జీవిత భాగస్వామి ఆర్. సుమతి
నివాసం * రాజ్ భవన్, మహారాష్ట్ర (అధికారిక నివాసం)
పూర్వ విద్యార్థి వీఓ చిదంబరం కళాశాల
వృత్తి వ్యవసాయదారుడు, రాజకీయ నాయకుడు

చంద్రపురం పొన్ను స్వామి రాధాకృష్ణన్‌ (జననం: 1957 మే 4), భారతదేశ 17వ ఉపరాష్ట్రపతి. 2025 సెప్టెంబరు 9న జరిగిన ఎన్నికలలో ఎన్డీయే కూటమి అభ్యర్థిగా అతను ఉపరాష్ట్రపతిగా గెలుపొందాడు. తమిళనాడు రాష్ట్రం నుంచి ఉపరాష్ట్రపతి పదవిలో మూడో వ్యక్తిగా గుర్తింపు పొందాడు. గతంలో రాధాకృష్ణన్‌ రెండుసార్లు కోయంబత్తూరు లోక్‌సభ నియోజకవర్గం నుండి ఎంపీగా, తమిళనాడు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా పని చేశాడు.[9]

రాజకీయ జీవితం

[మార్చు]

సీపీ రాధాకృష్ణన్ భారతీయ జనతా పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 1998లో కోయంబత్తూరు నుంచి తొలిసారి లోక్‌సభ సభ్యునిగా ఎన్నికయ్యాడు. ఆ తరువాత 1999లో రెండోసారి ఎంపికై 2004, 2014, 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఓటమి పాలయ్యాడు.

అతను తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిగా, 2016 నుంచి 2019 వరకు ఆల్ ఇండియా కాయిర్ బోర్డు చైర్మన్‌గా పని చేశాడు.[10]

గవర్నర్ పదవులు

[మార్చు]

సీపీ రాధాకృష్ణన్‌ 2023 ఫిబ్రవరి 12న జార్ఖండ్ గవర్నర్‌గా నియమితుడయ్యాడు.[11][12] తెలంగాణ గవర్నర్‌గా ఉన్న తమిళిసై సౌందరరాజన్ 2024 మార్చి 18న రాజీనామా చేయడంతో తెలంగాణ గవర్నర్‌గా & పుదుచ్చేరి లెఫ్టినెంట్‌ గవర్నర్‌‌గా సీపీ రాధాకృష్ణన్‌కు అదనపు బాధ్యతలును అప్పగిస్తూ 2024 మార్చి 19న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉత్తర్వులు జారీ చేసింది.[13] తెలంగాణ గవర్నర్‌గా 2024 జులై 31 వరకు (అదనపు బాధ్యత), పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌గా 2024 ఆగస్టు 06 వరకు పని చేశాడు.

సీపీ రాధాకృష్ణన్‌ను 2024 జూలై 27న భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మహారాష్ట్ర గవర్నర్‌గా నియమించగా, జూలై 27న గవర్నర్‌గా ప్రమాణస్వీకారం చేశాడు.[14]

ఉప రాష్ట్రపతి

[మార్చు]

2025లో భారత ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్‌డీఏ అభ్యర్థిగా సీ.పీ.రాధాకృష్ణన్ అభ్యర్థిత్వాన్ని ఆగష్టు 17న బీజేపీ అధిష్టానం ప్రకటించింది.[15][16] అతను 2025 సెప్టెంబరు 09న జరిగిన ఎన్నికల్లో 152 ఓట్ల మెజారిటీతో గెలిచాడు. రాధాకృష్ణన్‌ 452 ఓట్లు సాధించగా, తన సమీప ప్రత్యర్థి బి. సుదర్శన్ రెడ్డికి 300 ఓట్లు వచ్చాయి.[17][18][19] భారత 15వ ఉపరాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్‌తో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సెప్టెంబర్ 12న ప్రమాణస్వీకారం చేయించింది.[20]

వ్యక్తిగత జీవితం

[మార్చు]

1985 నవంబర్ 25న, రాధాకృష్ణన్ ఆర్. సుమతితో వివాహం చేసుకున్నాడు. వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అతను లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ సభ్యుడు. [21]

ఎన్నికల్లో పోటీ

[మార్చు]
సంవత్సరం ఎన్నికల పార్టీ నియోజకవర్గం పేరు ఫలితం ఓట్లు వచ్చాయి ఓటు వాటా%
1998 12వ లోక్‌సభ భారతీయ జనతా పార్టీ కోయంబత్తూరు విజేత 4,49,269 55.85
1999 13వ లోక్‌సభ భారతీయ జనతా పార్టీ కోయంబత్తూరు విజేత 4,30,068 49.21
2004 14వ లోక్‌సభ భారతీయ జనతా పార్టీ కోయంబత్తూరు రన్నర్ 3,40,476 38.74
2014 16వ లోక్‌సభ భారతీయ జనతా పార్టీ కోయంబత్తూరు రన్నర్ 3,89,701 37.24
2019 17వ లోక్‌సభ భారతీయ జనతా పార్టీ కోయంబత్తూరు రన్నర్ 3,92,007 31.47

మూలాలు

[మార్చు]
  1. "CP Radhakrishnan takes oath as Maharashtra governor". The Times of India. 31 July 2024.
  2. "C.P. Radhakrishnan takes oath as Jharkhand Governor". The Hindu. 18 February 2023.
  3. "Santosh Kumar Gangwar sworn in as Jharkhand Governor". Deccan Herald. 31 July 2024.
  4. The Avenue Mail (12 February 2023). "C.P. Radhakrishnan appointed Jharkhand Governor". Archived from the original on 12 February 2023. Retrieved 12 February 2023.
  5. "Jharkhand Governor C.P. Radhakrishnan takes charge as Telangana governor". News on AIR. 20 March 2024.
  6. "Jishnu Dev Varma takes oath as Governor of Telangana". Deccan Chronicle. 31 July 2024. Archived from the original on 31 July 2024.
  7. "C.P. Radhakrishnan assumes charge of Lt. Governor of Puducherry". News on AIR. 22 March 2024.
  8. "K Kailashnathan to take oath as Puducherry Lieutenant Governor on Aug 2". New Indian Express. 30 July 2024.
  9. "ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో సీపీ రాధాకృష్ణన్‌ ఘన విజయం". Sakshi. Retrieved 2025-09-09.
  10. The Hindu (12 February 2023). "Being appointed Governor is growth in politics: Radhakrishnan". Archived from the original on 19 March 2024. Retrieved 19 March 2024.
  11. Namasthe Telangana (12 February 2023). "మహారాష్ట్ర గవర్నర్‌ రాజీనామాకు రాష్ట్రపతి ఆమోదం.. ఏపీ సహా 12 రాష్ట్రాలకు నూతన గవర్నర్లు". Archived from the original on 12 February 2023. Retrieved 12 February 2023.
  12. https://www.telangana.gov.in/te/government/governor/
  13. Zee News Telugu (19 March 2024). "తెలంగాణ కొత్త గ‌వ‌ర్న‌ర్‌గా సీపీ రాధాకృష్ణ‌న్‌.. జార్ఖండ్ గ‌వ‌ర్న‌ర్ కు అదనపు బాధ్యతలు." Archived from the original on 19 March 2024. Retrieved 19 March 2024.
  14. The Times of India (1 August 2024). "Radhakrishnan takes charge as Maha governor". Archived from the original on 1 August 2024. Retrieved 1 August 2024.
  15. "ఎన్‌డీఏ ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా రాధాకృష్ణన్‌.. తమిళనాడుకు ప్రయోజనం లేదన్న డీఎంకే". Eenadu. 19 August 2025. Archived from the original on 19 August 2025. Retrieved 19 August 2025.
  16. "ఎన్‌డీఏ ఉప రాష్ట్రపతి అభ్యర్థి రాధాకృష్ణన్‌". Andhrajyothy. 18 August 2025. Archived from the original on 19 August 2025. Retrieved 19 August 2025.
  17. "ఉపరాష్ట్రపతి ఎన్నిక: ఎన్డీఏ అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్‌ విజయం". Sakshi. 9 September 2025. Archived from the original on 9 September 2025. Retrieved 9 September 2025.
  18. "ఉప రాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్‌ ఘన విజయం". Eenadu. 9 September 2025. Archived from the original on 9 September 2025. Retrieved 9 September 2025.
  19. "ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే గెలుపు, భారత ఉపరాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్‌ ఎన్నిక." Andhrajyothy. 9 September 2025. Archived from the original on 9 September 2025. Retrieved 9 September 2025.
  20. "ఉప రాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్‌ ప్రమాణం". Eenadu. 12 September 2025. Archived from the original on 12 September 2025. Retrieved 12 September 2025.
  21. "Who is CP Radhakrishnan? NDA's candidate for Vice President elections". Wion (in ఇంగ్లీష్). Retrieved 2025-09-12.

వెలుపలి లింకులు

[మార్చు]