వినయ్ కుమార్ సక్సేనా
వినయ్ కుమార్ సక్సేనా | |||
| |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 26 మే 2022 | |||
రాష్ట్రపతి | ద్రౌపది ముర్ము | ||
---|---|---|---|
ముందు | అనిల్ బైజాల్ | ||
ఖాదీ, గ్రామీణ పరిశ్రమల కమిషన్ చైర్మన్
| |||
పదవీ కాలం 25 అక్టోబర్ 2015 – 23 మే 2022 | |||
తరువాత | మనోజ్ కుమార్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 1958 మార్చి 23 భారతదేశం | ||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ |
వినయ్ కుమార్ సక్సేనా 2022 మే 22న ఢిల్లీ 22వ లెఫ్టినెంట్ గవర్నర్‌గా నియమితుడయ్యాడు. ఆయన అంతకుముందు ఖాదీ, గ్రామీణ పరిశ్రమల కమిషన్ చైర్మన్‌గా పని చేశాడు.[1]
వృత్తి జీవితం
[మార్చు]వినయ్ కుమార్ సక్సేనా రాజస్థాన్‌లోని జేకే గ్రూప్‌లో అసిస్టెంట్ ఆఫీసర్‌గా తన వృత్తి జీవితాన్ని ప్రారంభించాడు. ఆయన ఆ తరువాత వైట్ సిమెంట్ ప్లాంట్‌లో వివిధ హోదాల్లో 11 సంవత్సరాలు పని చేసి 1995లో గుజరాత్‌లోని పోర్ట్ ప్రాజెక్ట్‌కు జనరల్ మేనేజర్‌గా, సంస్థ సీఈవోగా, ఆ తర్వాత ధోలేర్ పోర్ట్ ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా పని చేశాడు. వినయ్ కుమార్ 2015 అక్టోబర్‌లో ఖాదీ, గ్రామీణ పరిశ్రమల కమిషన్ చైర్మన్‌గా నియమితుడై హనీ మిషన్, కుమ్హర్ సశక్తికరణ్ యోజన, తోలు కళాకారుల సాధికారత, ఖాదీ ప్రకృతి పెయింట్ లాంటి వినూత్న పథకాలు, ఉత్పత్తులను ప్రవేశపెట్టాడు.
ఢిల్లీ 22వ లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఉన్న అనిల్ బైజాల్ వ్యక్తిగత కారణాల రీత్యా మే 18న గవర్నర్ పదవికి రాజీనామా చేయడంతో వినయ్ కుమార్ సక్సేనాను లెఫ్టినెంట్ గవర్నర్‌గా నియమిస్తూ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఉత్తర్వులు జారీ చేశాడు.[2]
ఇతర పదవులు
[మార్చు]- 1991లో అహ్మదాబాద్‌లో నేషనల్ కౌన్సిల్ ఫర్ సివిల్ లిబర్టీస్ (NCCL) ఎన్జీవోను స్థాపించాడు.
- 2021 మార్చి 5న 75వ భారత స్వాతంత్య్ర దినోత్సవ వార్షికోత్సవ వేడుకల జాతీయ కమిటీ సభ్యుల్లో ఒకడిగా నియమితుడయ్యాడు.
- ఆయన 2020 నవంబర్‌లో 2021 పద్మ పురస్కారాల ఎంపిక ప్యానెల్ సభ్యుడిగానూ నామినేట్ అయ్యాడు.[3]
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ Namasthe Telangana (24 May 2022). "ఢిల్లీ ఎల్జీగా వినయ్‌కుమార్ సక్సేనా". Archived from the original on 2 September 2022. Retrieved 2 September 2022.
- ↑ Sakshi (24 May 2022). "ఢిల్లీ నూతన లెఫ్టినెంట్ గవర్నర్ గా వినయ్‌కుమార్ సక్సేనా". Archived from the original on 2 September 2022. Retrieved 2 September 2022.
- ↑ The Chhattisgarh (23 May 2022). "Who's Vinai Kumar Saxena? Profession profile of Delhi's new Liutenant Governor". Archived from the original on 2 September 2022. Retrieved 2 September 2022.