Jump to content

బన్వారిలాల్ పురోహిత్

వికీపీడియా నుండి
Banwarilal Purohit
బన్వారిలాల్ పురోహిత్
బన్వారిలాల్ పురోహిత్


అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2021 ఆగస్టు 31 - 3 ఫిబ్రవరి 2024[1]
రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌
ముందు వి పి సింగ్ బదనోరే
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2021 ఆగస్టు 31
అధ్యక్షుడు రామ్‌నాథ్‌ కోవింద్‌

తమిళనాడు 14వ గవర్నరు
పదవీ కాలం
2017 అక్టోబరు 6 – 2021 సెప్టెంబరు 17
అధ్యక్షుడు రామ్‌నాథ్‌ కోవింద్‌
తరువాత ఆర్.ఎన్ రవి

అస్సాం రాష్ట్ర 25వ గవర్నరు
పదవీ కాలం
2016 ఆగస్టు 22 – 2017 సెప్టెంబరు 29
అధ్యక్షుడు రామ్‌నాథ్‌ కోవింద్‌
ముందు పద్మనాభ ఆచార్య
తరువాత జగదీశ్ ముఖి

మేఘాలయ రాష్ట్ర 16వ గవర్నరు [2]
పదవీ కాలం
2017 జనవరి 27 – 2017 అక్టోబరు 5
అధ్యక్షుడు రామ్‌నాథ్‌ కోవింద్‌
ముందు వి.షణ్ముగనాథన్
తరువాత గంగా ప్రసాద్

వ్యక్తిగత వివరాలు

జననం (1940-04-16) 1940 ఏప్రిల్ 16 (వయసు 84)
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
నివాసం రాజ్ భవన్, చెన్నై

బన్వరీలాల్ పురోహిత్ (జననం 1940 ఏప్రిల్ 16) [3] ఒక భారతీయ రాజకీయ నాయకుడు. అతను భారతదేశం లోని పంజాబ్, తమిళనాడు, అసోం రాష్ట్రాల గవర్నరుగా పనిచేసాడు. చండీగఢ్ రాష్ట్ర అడ్మినిస్ట్రేటరుగా 2021 సెప్టెంబరు నుండి 2024 జులై వరకు పనిచేసాడు. అతను భారతీయ జనతా పార్టీ సభ్యుడు. నాగ్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గం నుండి మూడు సార్లు పార్లమెంటు సభ్యుడుగా ప్రాతినిద్యం వహించాడు, రెండుసార్లు భారత జాతీయ కాంగ్రెస్ సభ్యునిగా, ఒకసారి బిజెపి సభ్యునిగా ఉన్నారు.[4] [5]

రాజకీయ జీవితం

[మార్చు]

ఇందిరాగాంధీ కాంగ్రెస్ పార్టీని విభజించి, కాంగ్రెస్ (ఇందిర) ను స్థాపించిన తరువాత, పురోహిత్ 1978 లో నాగపూర్ తూర్పు నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచాడు.

లాల్ 1984 లో కాంగ్రెస్ పార్టీ సభ్యుడిగా 8 వ లోక్‌సభకు ఎన్నికయ్యాడు. [6] ఆ తరువాత 1989లో మళ్ళి ఇంకోసారి ఎన్నికయ్యాడు.

అయోధ్య రామమందిరం ఉద్యమం జరిగే సమయంలో లాల్ భారతీయ జనతా పార్టీ లో చేరాడు, 1991 లో బీజేపీ తరఫున ఎమ్యెల్యేగా పోటీ చేసి,తన సమీప ప్రత్యర్థి భారత జాతీయ కాంగ్రెస్‌కు చెందిన దత్తా మేఘే చేతిలో ఓడిపోయాడు. 1996 లో, అతను బిజెపి అభ్యర్థిగా 11 వ లోక్‌సభకు ఎన్నికయ్యాడు.

1999 లో, ప్రమోద్ మహాజన్‌తో తీవ్రమైన విభేదాలు తలెత్తడంతో భారతీయ జనతా పార్టీని వదిలి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్‌లో చేరాడు. 1999 లో రామ్‌టెక్ నుంచి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసినప్పటికీ విజయం సాధించలేకపోయాడు.

ప్రారంభ జీవితం

[మార్చు]

లాల్ తండ్రి పేరు భగవాన్దాస్ పురోహిత్. లాల్ పుష్పా దేవి పురోహిత్‌ను వివాహం చేసుకున్నాడు, వీరికి ముగ్గురు సంతానం. ఇద్దరు కుమారులు రాజేంద్ర పురోహిత్, రాకేష్ పురోహిత్, కుమార్తె మీనా పురోహిత్ జోషి. ఆయన పెద్ద మనవరాలు, అర్చన పురోహిత్ అగర్వాల్ ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఈయంత్ర ఇండస్ట్రీస్ సీఈఓగా ఉంది. లాల్ భవన్స్ భగవాన్దాస్ పురోహిత్ విద్యా మందిర్ నాగపూర్ ఛైర్మన్గా ఉన్నాడు, 1938 లో దివంగత కనైయాలాల్ మణెక్లాల్ మున్షి స్థాపించిన భారతీయ విద్యా భవన్ పాఠశాలలకు కూడా లాల్ ఛైర్మెన్ గా ఉన్నాడు.

మూలాలు

[మార్చు]
  1. Eenadu (3 February 2024). "పంజాబ్‌ గవర్నర్‌ బన్వరీలాల్‌ పురోహిత్‌ రాజీనామా". Archived from the original on 5 February 2024. Retrieved 5 February 2024.
  2. http://www.newindianexpress.com/nation/2017/jan/27/president-mukherjee-accepts-v-shanmuganathans-resignation-1564081.html
  3. "His Excellency Governor of Tamil Nadu". www.assembly.tn.gov.in. Archived from the original on 2021-04-19. Retrieved 2021-03-15.
  4. Former Cong leader who claimed he arranged meeting between Rajiv & RSS
  5. BJP leader Purohit is new governor of Assam
  6. "Election Analysis 1977-1984, Partywise Comparison". Election Commission of India. Retrieved 2010-01-14.