బి.డి. మిశ్రా
బాల్ దత్ మిశ్రా | |
---|---|
2వ లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ | |
Assumed office 2023 ఫిబ్రవరి 16 | |
అధ్యక్షుడు | ద్రౌపది ముర్ము |
ప్రధాన మంత్రి | నరేంద్ర మోదీ |
అంతకు ముందు వారు | రాధా కృష్ణ మాధుర్ |
19వ అరుణాచల్ ప్రదేశ్ గవర్నరు | |
In office 2017 అక్టోబరు 3 – 2023 ఫిబ్రవరి 15 | |
అంతకు ముందు వారు | పద్మనాభ ఆచార్య |
తరువాత వారు | లెఫ్టినెంట్ జనరల్ కైవల్య త్రివిక్రమ్ పర్నాయక్ (రిటైర్డ్.) |
మేఘాలయ గవర్నర్ | |
(అదనపు ఛార్జీ) | |
In office 2022 అక్టోబరు 4 – 2023 ఫిబ్రవరి 12 | |
అంతకు ముందు వారు | సత్యపాల్ మాలిక్ |
తరువాత వారు | ఫగు చౌహాన్ |
మిజోరం గవర్నర్ | |
(అదనపు ఛార్జీ) | |
In office 2021 ఆగస్టు 11 – 2021 నవంబరు 05 | |
అంతకు ముందు వారు | కంభంపాటి హరిబాబు |
తరువాత వారు | కంభంపాటి హరిబాబు |
వ్యక్తిగత వివరాలు | |
జననం | [1] కథౌటా, భదోహి జిల్లా, యునైటెడ్ ప్రావిన్సెస్, బ్రిటిష్ ఇండియా (నేటి ఉత్తర ప్రదేశ్, భారతదేశం) | 1939 జూలై 20
జీవిత భాగస్వామి | నీలం మిశ్రా |
సంతానం | ఒక కుమారుడు, ఒక కుమార్తె |
Military service | |
Allegiance | India |
Branch/service | భారత సైన్యం |
Years of service | 1961 - 1995 |
Battles/wars | సైనో-ఇండియన్ వార్, ఇండో-పాకిస్తానీ యుద్ధం, 1965 & బంగ్లాదేశ్ విముక్తి యుద్ధం |
బ్రిగేడియర్ బాల్ దత్ మిశ్రా భారత సైన్యం రిటైర్డ్ అధికారి. ప్రస్తుతం లడఖ్ లెఫ్టినెంట్ గవర్నరుగా 2023 ఫిబ్రవరి 19 నుండి అధికారం ఉన్నారు.[2] గతంలో అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, మిజోరాం రాష్ట్రాల గవర్నర్‌గా పనిచేశారు. అరుణాచల్ ప్రదేశ్ గవర్నరుగా 2017 అక్టోబరు 03 నుండి 2023 ఫిబ్రవరి 15 వరకు పనిచేసారు.[3]
విద్య
[మార్చు]మిశ్రా అలహాబాద్ విశ్వవిద్యాలయం నుండి మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్, మద్రాసు విశ్వవిద్యాలయం నుండి మాస్టర్ ఆఫ్ సైన్స్ ఆ తరువాత గ్వాలియర్ విశ్వవిద్యాలయం నుండి పి.హెచ్. డి పూర్తి చేసాడు. వెల్లింగ్టన్ డిఫెన్స్ సర్వీసు కళాశాలలో గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ స్థాయి విద్యను బోధించాడు. ఇతను ఢిల్లీ విశ్వవిద్యాలయం నుండి ఎలఎల్బీ కూడా పూర్తి చేసాడు.
కెరీర్
[మార్చు]1939 లో జన్మించిన మిశ్రా, 1961 డిసెంబరులో ఇన్ఫాంట్రీ అధికారిగా భారత ఆర్మీలో చేరాడు. 1995లో ఆర్మీ నుండి పదవీ విరమణ పొందాడు.
చేపట్టిన పదవులు/పనులు
[మార్చు]మిశ్రా భారతదేశంలో వివిధ యుద్ధాలు, కార్యాచరణ పాత్రలలో పనిచేశాడు:
- భారతదేశంపై చైనా దాడికి వ్యతిరేకంగా (1962)
- నాగాలాండ్‌లో నాగ తిరుగుబాటుదారులకు వ్యతిరేకంగా (1963-1964)
- సియాల్‌కోట్ సెక్టార్‌లో పాకిస్థాన్‌కి వ్యతిరేకంగా (1965)
- బంగ్లాదేశ్ విముక్తిలో పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా (1971)
- పూంచ్ సెక్టార్‌లో నియంత్రణ రేఖపై పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా, బెటాలియన్ కమాండర్‌గా (1979-1981)
- శ్రీలంకలోని జాఫ్నా, వవునియా అలాగే ట్రింకోమలీ (1987-1988) లో భారత శాంతి పరిరక్షణ దళానికి ప్రముఖ బ్రిగేడ్ కమాండర్‌గా LTTE కి వ్యతిరేకంగా N & G, పంజాబ్ తీవ్రవాదులకు వ్యతిరేకంగా, NSG ఫోర్స్ కమాండర్ (1990-1995)
- పదవీ విరమణ తర్వాత కార్గిల్ యుద్ధానికి స్వచ్ఛందంగా పాల్గొన్నారు.[4][5]
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "His Excellency Brigadier (Dr.) B. D. Mishra... (Retd) (Governor of Arunachal Pradesh wef. 3rd October 2017)". Arunachal Pradesh Government. Retrieved 1 December 2018.
- ↑ "BD Mishra appointed as new lieutenant governor of Ladakh". Hindustan Times (in ఇంగ్లీష్). 2023-02-12. Retrieved 2023-02-12.
- ↑ "His Excellency Brigadier (Dr.) B. D. Mishra... (Retd) (Governor of Arunachal Pradesh wef. 3rd October 2017)". Arunachal Pradesh Government. Retrieved 1 December 2018.
- ↑ "Who is B D Mishra?". Indian Express. 30 September 2017. Retrieved 30 September 2017.
- ↑ "President appoints new governors". The Times of India. 30 September 2017. Retrieved 30 September 2017.