డాక్టరేట్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

డాక్టరేట్ చాలా దేశాల్లో అతి పెద్ద డిగ్రీగా పరిగణించబడుతుంది. ప్రపంచ వ్యాప్తంగా పరిగణిస్తే ఒక్క హాబిలిటేషన్ తప్ప డాక్టరేట్ కన్నా పెద్ద డిగ్రీలేమీ లేవు. డాక్టరేట్ అనే పదం లాటిన్ భాషలోని డాక్టర్ నుండి ఉద్భవించింది. డాక్టర్ అనగా లాటిన్‌లో ఉపాధ్యాయుడు అని అర్థం. ఈ డిగ్రీ మధ్య యుగంలో ఉద్భవించింది. ఆ సమయంలో విశ్వవిద్యాలయాల్లో బోధించాలంటే డాక్టరేట్ తప్పనిసరిగా కావాల్సి ఉండేది.

భారతదేశం డాక్టరేట్‌లు[మార్చు]

నలుపు, ఎరుపు రంగు వస్త్రంలో ఉన్న డాక్టర్ ఆఫ్ డివినిటీ చిత్రం. రూడాల్ఫ్ ఆకెర్‌మన్ హిస్టరీ ఆఫ్ ఆక్స్‌ఫర్డ్ నుండి తీసుకొనబడింది.
  • పరిశోధనా డాక్టరేట్‌లు
  • డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ
  • ప్రొఫెషనల్ డాక్టరేట్‌లు
  • డాక్టర్ ఆఫ్ మెడిసిన్ : డాక్టర్ ఆఫ్ మెడిసిన్ (ఎండి, లాటిన్ పదమైన మెడిసిన్ డాక్టర్ అర్ధం ఔషధాల ఉపాధ్యాయుడు) అనగా వైద్య చికిత్సలో డాక్టరేట్ పట్టా. వైద్య కళాశాలలు ఈ డాక్టరేట్ పట్టాను అర్హత గల విద్యార్థులకు ప్రధానం చేస్తుంది. ఈ డాక్టరేట్ పట్టాను పొందిన విద్యార్థులు తమ వైద్య వృత్తిని కొనసాగించడానికి అర్హులు.

గౌరవ డాక్టరేట్‌లు[మార్చు]

చాలా భారతీయ విశ్వవిద్యాలయాలు గౌరవ డాక్టరేట్ లు ప్రదానం చేస్తాయి. ఇవి సాధారణంగా కాన్వొకేషన్ లో వివిధ రంగాలలో విశేషమైన కృషిచేసిన వారికి ఇస్తారు.

కళాప్రపూర్ణ[మార్చు]

ఆంధ్ర విశ్వవిద్యాలయం ప్రతిష్ఠాకరమైన డాక్టరేట్ ను కళాప్రపూర్ణ అంటారు.

మూలాలు[మార్చు]

వెలుపలి లంకెలు[మార్చు]