బిశ్వభూషణ్ హరిచందన్
బిశ్వభూషన్ హరిచందన్ | |||
![]() బిశ్వభూషన్ హరిచందన్ | |||
23వ ఆంధ్రప్రదేశ్ గవర్నరు
| |||
పదవీ కాలం 17 జూలై 2019 – 2023 ఫిబ్రవరి 12 | |||
ముందు | ఈ.ఎస్.ఎల్.నరసింహన్ | ||
---|---|---|---|
తరువాత | ఎస్. అబ్దుల్ నజీర్ | ||
ఒడిశా శాసనసభ్యుడు
| |||
పదవీ కాలం 1997 – 2009 | |||
నియోజకవర్గం | భువనేశ్వర్ సెంట్రల్ | ||
ఒడీశా శాసనసభ్యుడు
| |||
పదవీ కాలం 1990 – 1995 | |||
నియోజకవర్గం | చిలికా | ||
ఒడిశా శాసనసభ్యుడు
| |||
పదవీ కాలం 1977 – 1982 | |||
నియోజకవర్గం | చిలికా | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | |||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
తల్లిదండ్రులు | పరశురాం హరిచందన్ | ||
జీవిత భాగస్వామి | సుప్రవ హరిచందన్ | ||
వృత్తి |
| ||
శాఖ | న్యాయశాఖామంత్రి, రెవెన్యూ, మత్స్యశాఖ, ఒడీశా ప్రభుత్వం (2004–2009) |
బిశ్వభూషణ్ హరిచందన్ ఒడిషా రాష్ట్రానికి చెందిన ఒక రాజకియ నాయకుడు, న్యాయవాది, కవి, రచయిత, అవినీతిపై పోరాడే యోధుడు. 2019 జూలై 17 న ఇతడు ఆంధ్ర ప్రదేశ్ రాష్టానికి గవర్నరు గా నియమించబడ్డాడు.[1]
జీవిత విశేషాలు[మార్చు]
అతను ఒడీశాలోని ఖుర్దాకు చెందినవాడు. అతను 1934 ఆగస్టు 3న జన్మించాడు. అతనికి జనసంఘ్ తో దశాబ్దాల అనుబంధం ఉంది. ఒడిశాలో ‘సంఘ్’ కార్యకలాపాలు విస్తరించేందుకు అతను 1964లో అక్కడ భారతీయ జనసంఘ్ శాఖను ఏర్పరిచాడు. స్వయం సేవకుడుగా ఉన్న అతను జనసంఘ్ లో చేరి చురుకుగా పనిచేశాడు. జనసంఘ్‌లో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్థాయికి ఎదిగాడు. 1975లో ఎమర్జెన్సీ వ్యతిరేక ఆందోళనలో పాల్గొని జైలుకు కూడా వెళ్లాడు. 1977లో జన్‌సంఘ్ తరఫున గెలిచిన నలుగురు ఎమ్మెల్యేల్లో హరిచందన్ ఒకరు. ఇప్పటిదాకా రెండుసార్లు జనతా పార్టీ టికెట్‌పై, మూడుసార్లు భారతీయ జనతా పార్టీ తరఫున మొత్తం ఐదుసార్లు శాసనసభ్యునిగా గెలిచాడు. రెవెన్యూ, న్యాయ శాఖ, పరిశ్రమల శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించాడు. 1980 నుంచి ఎనిమిదేళ్లపాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పని చేశాడు. ఆ తర్వాత జనతా పార్టీలో చేరి ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడుగా బాధ్యతలు నిర్వర్తించాడు. 1996లో ఆయన తిరిగి బీజేపీలోకి వచ్చేశాడు.
1977 ఒడీశా అసెంబ్లీ ఎన్నికలలో చిలికా శాసనసభ నియోజకవర్గం నుండి జనతా పార్టీ తరపున పోటీ చేసి గెలుపొందాడు.[2] 1990 అసెంబ్లీ ఎన్నికలలో చిలికా శాసనసభ నియోజకవర్గం నుండి జనతాదళ్ పార్టీ తరపున పోటీ చెసి రెండవసారి శాసనసభ్యునిగా ఎంపిక కాబడ్డాడు.[3] 2000 అసెంబ్లీ ఎన్నికలలో భువనేశ్వర్ శాసనసభ నియోకవర్గం నుండి భారతీయ జనతా పార్టీ తరపున పోటీ చేసి గెలుపొందాడు.[4] 2004 అసెంబ్లీ ఎన్నికలలో భువనేశ్వర్ శాసనసభ నియోకవర్గం నుండి భారతీయ జనతా పార్టీ తరపున పోటీ చేసి గెలుపొందాడు.[5]
అతను బి.జె.పి-జె.డియు సంకీర్ణ ప్రభుత్వంలో న్యాయ, రెవెన్యూ, ఫిషరీస్ మంత్రిత్వ శాఖలను నిర్వహించాడు. అతను 1971లో భారతీయ జనస్ంఘ్ లో చేరి 1977లో జనతా పార్టీ పారంభమయ్యే వరకు జాతీయ ఎగ్జిక్యూటివ్ సభ్యునిగా, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా భాద్యతలను నిర్వహించాడు.[6] ఇతడు సుదీర్ఘకాలంగా రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ తో అనుబంధం కలిగివున్నాడు. 1988 నుంచి భారతీయ జనతా పార్టీ లో క్రియాశీలంగా ఉంటూ రచయితగా పలు పుస్తకాలు రాశాడు. అవినీతిపై పోరు, మొక్కల పెంపకంపై ఇతడికి ఆసక్తి ఉంది.[7]
పూరీలోని జగన్నాథ మందిరంలో ఆయన అనేక సంస్కరణలను చేపట్టాడు. ఆలయం మార్గంలోను, ఆలయంలోనూ మరణించిన భక్తులకు, పూజారులకు బీమా సౌకర్యం కల్పించడం, ఆలయం చుట్టూ సరిహద్దు గోడ నిర్మించడం వంటి చర్యలు తీసుకున్నాడు.
రచయితగా[మార్చు]
ఏకాంకికలు రచించే అతను ఇప్పటికి నాలుగు పుస్తకాలు రాశాడు. మరు బటాస్, రాణా ప్రతాప్, శేష ఝలక్, అస్తా సిఖండ్ మానసి వంటి పుస్తకాలను ఒరియా భాషలో రాసాడు[8].
మూలాలు[మార్చు]
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2019-07-16. Retrieved 2019-07-16.
- ↑ "Orissa Assembly Election Results in 1977". www.elections.in. Archived from the original on 2019-02-28. Retrieved 2019-07-16.
- ↑ "Orissa Assembly Election Results in 1990". www.elections.in. Archived from the original on 2019-03-23. Retrieved 2019-07-16.
- ↑ "Orissa Assembly Election Results in 2000". www.elections.in. Archived from the original on 2019-02-26. Retrieved 2019-07-17.
- ↑ "Orissa Assembly Election Results in 2004". www.elections.in. Archived from the original on 2019-06-02. Retrieved 2019-07-17.
- ↑ "Veteran BJP leader Biswa Bhusan Harichandan appointed governor andhra pradesh". www.thenewsminute.com. Retrieved 2019-07-16.
- ↑ "Senior BJP leader Biswa Bhusan Harichandan appointed Andhra Pradesh Governor". The New Indian Express. Retrieved 2019-07-16.
- ↑ "Good news for Odisha: Biswa Bhusan Harichandan appointed Andhra Pradesh Governor". Odisha News Online (in అమెరికన్ ఇంగ్లీష్). 2019-07-16. Retrieved 2019-07-17.[permanent dead link]
బయటి లంకెలు[మార్చు]
- YOYO TV Channel (2019-07-17), AP New Governor Biswabhusan Harichandan Real Life Story Political Career | Andhra Pradesh | YOYO TV, retrieved 2019-07-18
- CS1 అమెరికన్ ఇంగ్లీష్-language sources (en-us)
- All articles with dead external links
- Wikipedia articles with VIAF identifiers
- Wikipedia articles with LCCN identifiers
- Wikipedia articles with ISNI identifiers
- ఆంధ్రప్రదేశ్ గవర్నర్లు
- రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్
- భారతీయ జనతా పార్టీ రాజకీయ నాయకులు
- 1934 జననాలు
- జీవిస్తున్న ప్రజలు
- ఒడిశా రచయితలు