పీ.ఏ.థాను పిల్లై

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

పట్టొం ఏ థాను పిల్లై (జ. తిరువనంతపురము లో జూలై 15, 1885 - మ. జూలై 27, 1970) భారత స్వాతంత్ర్య సమరయోధుడు. తదనంతరం 1960, ఫిబ్రవరి 22 నుండి 1962, సెప్టెంబరు 25 వరకు కేరళ ముఖ్యమంత్రిగా పనిచేశాడు.

ఈయన తండ్రి, వరదా అయ్యర్, తల్లి ఈశ్వరీ అమ్మ. థాను పిల్లై కొన్నాళ్ళు ఉపాధ్యాయునిగా పనిచేశాడు. ఆ తరువాత న్యాయశాస్త్రంలో పట్టా పుచ్చుకొని న్యాయవాదిగా పనిచేశాడు. స్వాతంత్రోద్యమంలో చురుకుగా పాల్గొని భారత జాతీయ కాంగ్రేసు సభ్యుడయ్యాడు. కాంగ్రేస్ శ్రేణుల్లో ఎదిగి ట్రావెన్‌కూర్ సంస్థానంలో కాంగ్రేసు అధ్యక్షుడైనాడు. ఈయన అసలు పేరు ఏ. థాను పిల్లై. అయితే, తిరువనంతపురం వద్ద ఉన్న పట్టొంకు చెందినవాడు కనుక పట్టొం థాను పిల్లై అని పేరుబడింది. ఈయన్ను సాధారణంగా అందరూ పట్టొం అని వ్యవహరించేవారు.