కృష్ణకాంత్
కృష్ణకాంత్ | |||
| |||
పదవీ కాలం 21 ఆగష్టు 1997 – 27 జూలై 2002 | |||
రాష్ట్రపతి | కె. ఆర్. నారాయణన్ | ||
---|---|---|---|
ముందు | కె. ఆర్. నారాయణన్ | ||
తరువాత | భైరాన్ సింగ్ శేఖావత్ | ||
పదవీ కాలం 22 డిసెంబర్ 1996 – 25 జనవరి 1997 | |||
ముందు | మర్రి చెన్నారెడ్డి | ||
తరువాత | ఫాతిమా బీవి | ||
పదవీ కాలం 7 ఫిబ్రవరి 1990 – 21 ఆగష్టు 1997 | |||
ముందు | కుముద్బెన్ జోషి | ||
తరువాత | జి. రామానుజం | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | |||
మరణం | 2002 జూలై 27 | (వయసు 75)||
రాజకీయ పార్టీ | జనతా దళ్ (1988–2002) | ||
ఇతర రాజకీయ పార్టీలు | భారత జాతీయ కాంగ్రెసు (Before 1977) జనతా పార్టీ (1977–1988) | ||
జీవిత భాగస్వామి | శ్రీమతి సుమన్ | ||
పూర్వ విద్యార్థి | బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం | ||
వృత్తి | శాస్త్రవేత్త | ||
సంతకం |
కృష్ణకాంత్ (28 ఫిబ్రవరి 1927 – 27 జూలై 2002) భారత ఉపరాష్ట్రపతి గాను, ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గాను వివిధ ఉన్నత పదవులు నిర్వహించిన రాజకీయ నాయకుడు.
కృష్ణకాంత్ రాజకీయ జీవితం లాహోర్‌లోవిద్యార్థిదశలో క్విట్ ఇండియా ఉద్యమంతో మొదలయింది. యువకునిగా భారత స్వాతంత్ర్య సమరంలో పాల్గొని తర్వాత రాజకీయాలలో ప్రవేశించాడు. ఇందిరా గాంధీ హయాంలో భారత జాతీయ కాంగ్రెస్‌లో ప్రవేశించి యంగ్ టర్క్ బ్రిగేడ్ లో పాల్గొన్నాడు. భారత పార్లమెంట్ లోను కాంగ్రెస్‌లో వివిధ పదవులు నిర్వహించి తర్వాత కాలంలో జనతా పార్టీ, జనతా దళ్లో చేరారు.[1] అతను ఇన్‌స్టిట్యూట్ ఫర్ డిఫెన్స్ స్టడీస్ అండ్ అనాలిసెస్‌లో చాలా సంవత్సరాలు ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యుడు.
కృష్ణకాంత్ పౌరహక్కుల సంఘానికి వ్యవస్థాపక జనరల్ సెక్రటరీగా జయప్రకాష్ నారాయణ్ ప్రెసిడెంట్ గా 1976లో పనిచేశారు. అత్యవసర పరిస్థితిని ఎదిరించినందుకు 1975లో భారత జాతీయ కాంగ్రెసు నుండి బహిష్కరించబడ్డాడు. అతను తరువాత జనతా పార్టీలో చేరాడు 1977లో చండీగఢ్ లోక్‌సభ నియోజకవర్గానికి పోటీ చేశాడు.[2] 1980 సంవత్సరం వరకు లోక్‌సభ సభ్యునిగా పనిచేశారు.[1] ఇతడు రైల్వే రిజర్వేషన్స్, బుకింగ్స్ కమిటీకి ఛైర్మన్ గా 1972 -1976 ల మధ్య పనిచేశాడు.
మధులిమాయెతో కలిసి 1979లో మొరార్జీ దేశాయి ప్రభుత్వాన్ని పడగొట్టడంలో కీలక పాత్ర పోషించాడు.[3] ఇతడు భారత అణువిధానాలను తీవ్రంగా సమర్ధించాడు.[1]
కృష్ణకాంత్ ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గవర్నర్‌గా వి.పి.సింగ్ ప్రభుత్వం 1989లో నియమించింది. ఇతడు ఆ పదవిలో అత్యంత ఎక్కువకాలం అనగా ఏడు సంవత్సరాలు ఉపరాష్ట్రపతిగా ఎన్నుకోబడే వరకు కొనసాగాడు.
ఇతడు కాంగ్రెస్, యునైటెడ్ ఫ్రంట్ ఉమ్మడి అభ్యర్థిగా భారత పార్లమెంటుకు ఉపరాష్ట్రపతిగా ఎన్నికయ్యాడు. ఇతడు కొత్తఢిల్లీలో పదవిలో ఉండగానే పరమపదించాడు.
ఇతర వివరాలు
[మార్చు]2007లో స్థాపించబడిన యునైటెడ్ ఉమెన్ ఫ్రంట్ పార్టీకి ఇతని భార్య సుమన్ కృష్ణకాంత్ పార్టీ జాతీయ అధ్యక్షురాలుగా పనిచేసింది.
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 1.2 http://rajyasabha.nic.in/rsnew/chairman/kant.asp
- ↑ Purnima S. Tripathi (3 August 2002). "Obituary: A democrat and a radical". Frontline. Archived from the original on 8 December 2022.
- ↑ "In Pursuit of Lakshmi: The Political Economy of the Indian State", By Lloyd I. Rudolph and Susanne H. Rudolph, University of Chicago Press, 1987. pp 457-459.
బయటి లింకులు
[మార్చు]- Profile on Embassy of India in Washington website