మర్రి చెన్నారెడ్డి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మర్రి చెన్నారెడ్డి
మర్రి చెన్నారెడ్డి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి
పదవీ కాలము
06/03/1978—11/10/1980
ముందు జలగం వెంగళరావు
తరువాత టంగుటూరి అంజయ్య
నియోజకవర్గము వికారాబాద్
పదవీ కాలము
03/12/1989—17/12/1990
ముందు ఎన్.టి.రామారావు
తరువాత నేదురుమిల్లి జనార్ధనరెడ్డి
నియోజకవర్గం తాండూర్

వ్యక్తిగత వివరాలు

జననం జనవరి 13, 1919
మరణం డిసెంబర్ 2, 1996
రాజకీయ పార్టీ కాంగ్రెసు
మతం హిందూ

మర్రి చెన్నారెడ్డి (జనవరి 13, 1919 - డిసెంబర్ 2, 1996) రెండు పర్యాయాలు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి మరియు భారత జాతీయ కాంగ్రేసు పార్టీకి చెందిన రాజకీయ నాయకుడు. ఈయన ఉత్తర ప్రదేశ్, పంజాబ్, రాజస్థాన్ మరియు తమిళనాడు రాష్ట్రాలకు గవర్నరుగా కూడా పనిచేశాడు.

జననం[మార్చు]

చెన్నారెడ్డి జనవరి 13, 1919 న ప్రస్తుత వికారాబాదు జిల్లా, వికారాబాదు తాలూకాలోని సిర్‌పుర గ్రామములో జన్మించాడు. పెద్దమంగళారంలో అని మరికొందరి కథనం. ఈయన తండ్రి మర్రి లక్ష్మారెడ్డి. ఈయన 1941లో ఎం.బి.బి.ఎస్ డిగ్రీ పొందాడు. విద్యార్థిగా ఉన్న రోజుల్లో ఆంధ్ర యువజన సమితి మరియు విద్యార్థికాంగ్రెసును స్థాపించాడు. ఇవే కాక అనేక విద్యార్థి, యువత, విద్యా, అక్షరాస్యత మరియు సాంస్కృతిక సంస్థలలో చురుకుగా పాల్గొనేవాడు. ఈయన ఒక వారపత్రికకు రెండు సంవత్సరాల పాటు సంపాదకత్వము వహించాడు. అంతే కాక అనేక పత్రికలలో వ్యాసాలు కూడా ప్రచురించాడు. చెన్నారెడ్డి అప్పటి హైదరాబాదు రాష్ట్రములోని స్వాతంత్ర్యోద్యమములో పాల్గొన్నాడు. 1942లో ఆంధ్ర మహాసభ ప్రధాన కార్యదర్శిగా పనిచేశాడు.

మరణం[మార్చు]

డిసెంబర్ 2,1996లో చెన్నారెడ్డి మరణించాడు. ప్రస్తుతం చెన్నారెడ్డి సమాధి హైదరాబాదులో ఇందిరా పార్కు ఆవరణలో ఉంది. తెలంగాణా కోసం ఓ పార్టీ పెట్టి అన్ని సీట్లు గెలిచి, ఆపార్టీని కాంగ్రెసులో విలీనం చేశాడు.

బయటి లింకులు[మార్చు]


ఇంతకు ముందు ఉన్నవారు:
జలగం వెంగళరావు
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి
06/03/1978—11/10/1980
తరువాత వచ్చినవారు:
టంగుటూరి అంజయ్య


ఇంతకు ముందు ఉన్నవారు:
నందమూరి తారక రామారావు
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి
03/12/1989—17/12/1990
తరువాత వచ్చినవారు:
నేదురుమిల్లి జనార్ధనరెడ్డి