అక్షాంశ రేఖాంశాలు: 17°02′41″N 76°54′22″E / 17.0447°N 76.9062°E / 17.0447; 76.9062

కాగ్నా నది

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కాగ్నా నది
నది
కాగ్నా నది (తాండూర్)
దేశం భారతదేశం
Mouth భీమా నది
 - location వికారాబాద్ జిల్లా, తెలంగాణ
 - ఎత్తు 0 m (0 ft)

కాగ్నా నది అనేది కృష్ణా నదికి ప్రధాన ఉపనది అయిన భీమా నదికి ఉపనది. ఇది తెలంగాణ రాష్ట్రంలోని వికారాబాద్ సమీపంలోని అనంతగిరి కొండలలో జన్మించింది. తూర్పు లేదా ఆగ్నేయ దిశలో ప్రవహించే దక్కన్‌లోని ఇతర నదుల మాదిరిగా కాకుండా, కాగ్నా కలబురగి జిల్లాలోని వాడి సమీపంలో భీమాలో కలుస్తుంది. తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల గుండా పశ్చిమ దిశలో ప్రవహిస్తుంది.[1]

ఆనకట్టల నిర్మాణం

[మార్చు]

వికారాబాద్‌ జిల్లాకు వరప్రదాయనిగా పేరుగాంచిన కాగ్నా నది 60 కి.మీ. పొడవునా ప్రవహిస్తోంది. 2016కు ముందు వేసవికాలంలో ఎడారిగా కనిపించే కాగ్నానదిపై ఆనకట్టలు లేక ప్రతి ఏటా 3 టీఎంసీల మేర వృథా అయ్యేది. దాంతో రాష్ట్ర ప్రభుత్వం కాగ్నానదిపై తొలిసారిగా 2015 జనవరి 12న ఆనకట్ట నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. మొదటి ఆనకట్టను 0.09 టీఎంసీల మేర నీటిని కి.మీ. పొడవునా నిల్వ ఉండేలా డిజైన్ చేసింది. దీని వల్ల ఈ ప్రాంతంలో భూగర్భ జలాలు పెరిగడంతో 2024 నాటికి మొత్తం నాలుగు దశల్లో రూ.82.21 కోట్లతో ఇప్పటివరకు 12 వరకు ఆనకట్టలను నిర్మించింది. ఒక్కో ఆనకట్ట దాని కింద 250 నుంచి 300 ఎకరాలు అదనంగా సాగులోకి వచ్చింది.[2]

ఇతర వివరాలు

[మార్చు]

2023లో తెలంగాణలో కురిసిన భారీ వర్షాలకు కాగ్నా నదిలోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది.[3]

మూలాలు

[మార్చు]
  1. Venkateswarlu, V. Ecological studies on the rivers of Andhra Pradesh with special reference to water quality and pollution. Proc. Indian Acad. Sci. 96, 495–508 (1986). https://doi.org/10.1007/BF03053544
  2. "కాగ్నానది పరవళ్లు దశ మారి.. సాగు పెరిగి". EENADU. 2024-09-20. Archived from the original on 2024-10-07. Retrieved 2024-10-07.
  3. "Kagna River: తాండూర్ వద్ద పరవళ్లు తొక్కుతున్న కాగ్నా నది". EENADU. 2023-07-25. Archived from the original on 2023-07-25. Retrieved 2024-10-07.

17°02′41″N 76°54′22″E / 17.0447°N 76.9062°E / 17.0447; 76.9062