జలగం వెంగళరావు
![]() | ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. వివరాలకు జాబితా లేదా ఈ వ్యాసపు చర్చా పేజీ చూడండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తొలగించండి. |
జలగం వెంగళరావు | |||
![]() జలగం వెంగళరావు | |||
పదవీ కాలము 10 డిసెంబర్, 1973 నుండి 6 మార్చి 1978 | |||
ముందు | పి.వి.నరసింహారావు | ||
---|---|---|---|
తరువాత | డా.మర్రి చెన్నారెడ్డి | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | మే 1921 | ||
మరణం | జూన్ 12 ,1999 | ||
రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెస్ | ||
నివాసము | హైదరాబాదు | ||
మతం | హిందూ మతము |
జలగం వెంగళరావు ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ కు 6 వ ముఖ్యమంత్రి, నక్సలైట్లను ఉక్కుపాదంతో అణచి వేసిన ముఖ్యమంత్రిగా ఆయన దేశవ్యాప్తంగా ప్రసిద్ధిచెందాడు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో మంత్రిపదవులు నిర్వహించాడు.
జీవిత విషయాలు[మార్చు]
తన 20 వ ఏట నిజాముకు వ్యతిరేకంగా సాయుధ పోరాటంలో పాల్గొన్నాడు. ఆ రోజుల్లో కాంగ్రెసు పార్టీ నిర్వహించిన సరిహద్దు క్యాంపుల్లో పాల్గొన్నాడు. రెండు సార్లు జైలుకు వెళ్ళాడు. 1952 లో శాసనసభకు స్వతంత్రుడిగా పోటీ చేసి ఓడిపోయాడు. 1952 నుండి 1962 వరకు ఆయన కాంగ్రెసు పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడిగా ఉన్నాడు. 1962లో కాంగ్రెసు పార్టీ తరపున ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం నుండి గెలిచి శాసనసభలో ప్రవేశించాడు. ఆ తరువాత 1978 వరకు మరో మూడు సార్లు సత్తుపల్లి నియోజకవర్గానికి శాసనసభలో ప్రాతినిధ్యం వహించాడు. 1967లో పంచాయితీరాజ్ ఛాంబరు చైర్మనుగా ఎన్నికయ్యాడు.
కాసు బ్రహ్మానంద రెడ్డి మంత్రివర్గంలో 1969 నుండి 1971 వరకు హోంమంత్రిగాను, పి.వి.నరసింహారావు మంత్రివర్గంలో 1972-73 లో పరిశ్రమల మంత్రిగాను పనిచేసాడు. జై ఆంధ్ర ఉద్యమ ఫలితంగా రాష్ట్రంలో విధించిన రాష్ట్రపతి పాలన ఎత్తివేసిన తరువాత వెంగళరావు ముఖ్యమంత్రి పదవికి ఎంపికయ్యాడు[1].ఆయన పాలనా కాలంలోనే ఇందిరా గాంధీ దేశంలో ఎమర్జెన్సీ (ఆత్యయిక పరిస్థితి) ని విధించింది. ముఖ్యమంత్రిగా వెంగళరావు మంచి పరిపాలకుడిగా పేరుతెచ్చుకున్నాడు. ఆయన సాధించిన కార్యాలలో ముఖ్యమైనవి:
- నక్సలైటు ఉద్యమాన్ని కఠినంగా అణచివేసాడు. ఎన్‌కౌంటర్ల వ్యాప్తికి కారకుడిగా విమర్శలు తెచ్చుకున్నాడు.
- తెలుగు సినిమా పరిశ్రమ హైదరాబాదులో నిలదొక్కుకొనేందుకు తగు చేయూతనిచ్చాడు.
- మొదటి ప్రపంచ తెలుగు మహాసభలను విజయవంతంగా నిర్వహించాడు. అప్పటికి కొన్ని సంవత్సరాల ముందే ముగిసిన ప్రత్యేక తెలంగాణా ఉద్యమం, జై ఆంధ్ర ఉద్యమాల నేపథ్యంలో ఈ సభలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. 1975 సంవత్సరాన్ని తెలుగు సాంస్కృతిక సంవత్సరంగా ప్రకటించి పలు కార్యకలాపాలు చేపట్టారు.[2]
- నాగార్జున సాగర్ ఎడమ కాలువను ఏన్నొ వ్యయప్రయాసల కొర్చి ఖమ్మం జిల్లా పరిసర ప్రాంతాల అభివ్రుద్దికి పాటుపడ్డారు.
కాంగ్రెసు పార్టీ చీలిపోయి కాంగ్రెసు (ఐ) ఏర్పడినపుడు, వెంగళరావు కొన్నాళ్ళు పార్టీకి దూరమయ్యాడు. మళ్ళీ 1984 లో కాంగ్రెసుకు తిరిగి వచ్చి, 1984, 1991 మధ్య ఖమ్మం నియోజకవర్గం నుండి లోక్‌సభకు రెండుసార్లు ప్రాతినిధ్యం వహించాడు. 1986 నుండి 1989 వరకు కేంద్ర పరిశ్రమల మంత్రిగా పనిచేసాడు.
మరణం[మార్చు]
1999 జూన్ 12 న హైదరాబాదులో జలగం వెంగళరావు మరణించాడు. ఆయనకు ఇద్దరు కుమారులు - ప్రసాదరావు, వెంకటరావు. వీరిద్దరూ రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్నారు జలగం వెంకటరావు 2004లో సత్తుపల్లి శాసనసభ నియోజకవర్గం నుండి శాసనసభకు ఎన్నికయ్యాడు.
వనరులు, మూలాలు[మార్చు]
- ↑ "
ఆత్మకథ విషయపేజీలు".
నా కలం - నా గళం. శ్రీ సుందర శేషమాంబ పబ్లికేషన్స్. వికీసోర్స్. 2012.
- ↑ రామానుజరావు, దేవులపల్లి (17 మార్చి 1975). తెలుగు నవల (ముందుమాట). హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ. p. iii. Retrieved 7 March 2015. Check date values in:
|date=
(help)CS1 maint: discouraged parameter (link)
బయటి లింకులు[మార్చు]
- కోట్లపై విరుచుకుపడ్డ జలగం
- తెలుగు సినిమా పరిశ్రమకు జలగం సేవ- గుడిపూడి శ్రీహరి ఇంటర్వ్యూ
- సత్తుపల్లి నియోజకవర్గంలో జలగం విజయాలు
- ఎన్కౌంటర్లపై వార్తలు
- మరణం, సంతాపం
- జలగం మృతికి పార్లమెంటు సంతాపం
ఇంతకు ముందు ఉన్నవారు: పి.వి.నరసింహారావు |
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి 10/12/1973—06/03/1978 |
తరువాత వచ్చినవారు: డా.మర్రి చెన్నారెడ్డి |
- CS1 maint: discouraged parameter
- విస్తరించవలసిన వ్యాసాలు
- ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు
- Wikipedia articles with VIAF identifiers
- Wikipedia articles with LCCN identifiers
- 1999 మరణాలు
- 8వ లోక్సభ సభ్యులు
- 9వ లోక్సభ సభ్యులు
- ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షులు
- ఖమ్మం జిల్లా రాజకీయ నాయకులు
- ఖమ్మం జిల్లాకు చెందిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు
- ఖమ్మం జిల్లాకు చెందిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రులు
- ఖమ్మం జిల్లా (సంయుక్త ఆంధ్రప్రదేశ్) నుండి ఎన్నికైన లోక్సభ సభ్యులు
- ఖమ్మం జిల్లా (సంయుక్త ఆంధ్రప్రదేశ్) కు చెందిన కేంద్ర మంత్రులు