జలగం ప్రసాదరావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
జలగం ప్రసాదరావు
పంచాయత్ రాజ్ శాఖామంత్రి
In office
5 ఆగస్టు 1991 – 1994
చిన్న తరహా పరిశ్రమలు శాఖామంత్రి
In office
1990 – 4 ఆగస్టు 1991
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ
Assembly Member
for సత్తుపల్లి శాసనసభ నియోజకవర్గం
In office
1983 - 1985; 1989 - 1994
వ్యక్తిగత వివరాలు
జననంఖమ్మం, తెలంగాణ
బంధువులుజలగం వెంకటరావు
తల్లిదండ్రులుజలగం వెంగళరావు

జలగం ప్రసాదరావు, తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రి. భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ తరపున సత్తుపల్లి శాసనసభ నియోజకవర్గం నుండి 1983, 1989లలో జరిగిన ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభకు ఎన్నికయ్యాడు,[1] పంచాయత్ రాజ్ మంత్రిగా పనిచేశాడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జలగం వెంగళరావు పెద్ద కుమారుడు.[1][2]

జననం

[మార్చు]

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 5వ ముఖ్యమంత్రి జలగం వెంగళరావు దంపతులకు ఖమ్మంలో ప్రసాదరావు జన్మించాడు.[3]

రాజకీయ జీవితం

[మార్చు]

కాంగ్రెస్ పార్టీతో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన ప్రసాదరావు తన తండ్రి ప్రాతినిధ్యం వహించిన సత్తుపల్లి నియోజకవర్గం నుండి రెండుసార్లు ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ఎన్నికయ్యాడు. 1983లో జరిగిన ఎన్నికల్లో 6216 ఓట్లు, 1989లో జరిగిన ఎన్నికల్లో 6429 ఓట్ల మేజారిటీతో తుమ్మల నాగేశ్వరరావుపై గెలుపొందాడు. నేదురుమల్లి జనార్ధనరెడ్డి మంత్రివర్గంలో చిన్న తరహా పరిశ్రమలు, పంచాయత్ రాజ్ మంత్రిగా పనిచేశాడు. 1994లో జరిగిన ఎన్నికల్లో తుమ్మల నాగేశ్వరరావు చేతిలో 7594 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.

1999 సాధారణ ఎన్నికల్లో ఖమ్మం ఎంపీగా పోటీ చేసేందుకు దరఖాస్తు చేసుకున్న ప్రసాదరావుకు కాంగ్రెస్‌ అధిష్టానం టికెట్ ఇవ్వకుండా ఖమ్మం కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ అభ్యర్థిగా గారపాటి రేణుకాచౌదరి, సత్తుపల్లి అసెంబ్లీ అభ్యర్థిగా పొంగులేటి సుధాకర్‌రెడ్డిలను ప్రకటించింది. సుధాకర్‌రెడ్డికి వ్యతిరేకంగా పనిచేశాడనే కారణంతో పార్టీ వ్యవహారాల నుంచి ఆరేళ్ళపాటు బహిష్కరణకు గురయ్యాడు.[4] 2018, నవంబరులో ఆ సస్పెన్షన్‌ను ఎత్తివేస్తున్నట్లు కాంగ్రెస్‌ ప్రకటించింది. కానీ, 2018 నవంబరు 3న టిఆర్‌ఎస్‌ పార్టీలో చేరాడు.[5]

ఎన్నికల గణాంకాలు
సంవత్సరం నియోజకవర్గం ఓట్లు ఫలితం
1983 సత్తుపల్లి 52.19% గెలుపు
1989 48.69% గెలుపు
1994 46.25% ఓటమి

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 STATISTICAL REPORT ON GENERAL ELECTION, 1983 TO THE LEGISLATIVE ASSEMBLY OF ANDHRA PRADESH (PDF). Election Commission of India. 1983. pp. 12, 296, 361.
  2. STATISTICAL REPORT ON GENERAL ELECTION, 1989 TO THE LEGISLATIVE ASSEMBLY OF ANDHRA PRADESH (PDF). Election Commission of India. 1989. pp. 12, 296, 363.
  3. సాక్షి, తెలంగాణ (15 March 2019). "ప్రసాదరావును ప్రసన్నం చేసుకున్నవారే." Sakshi. Archived from the original on 24 September 2021. Retrieved 24 September 2021.
  4. సమయం తెలుగు, తెలంగాణ (2 November 2018). "19 ఏళ్ల తర్వాత మళ్లీ రాజకీయాల్లోకి.. టీఆర్‌ఎస్‌లోకి జలగం!". Samayam Telugu. Archived from the original on 24 September 2021. Retrieved 24 September 2021.
  5. వార్త, తెలంగాణ (2 November 2018). "టిఆర్‌ఎస్‌లోకి జలగం ప్రసాదరావు". Vaartha. Archived from the original on 24 సెప్టెంబరు 2021. Retrieved 24 September 2021.

బయటి లింకులు

[మార్చు]
  1. ఆంధ్రప్రదేశ్ కేబినెట్ మంత్రుల సమాచారం Archived 2016-09-10 at the Wayback Machine