తుమ్మల నాగేశ్వరరావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
తుమ్మల నాగేశ్వరరావు
తుమ్మల నాగేశ్వరరావు


వ్యక్తిగత వివరాలు

జననం 15 నవంబర్ 1953 [1]
గండుగులపల్లి గ్రామం, దమ్మపేట మండలం, ఖమ్మం జిల్లా
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ భారత్ రాష్ట్ర సమితి
సంతానం తుమ్మల యుగంధర్, మోహిని పోపూరి, చంద్రిక వల్లభనేని
నివాసం హైదరాబాద్, తెలంగాణ, భారతదేశం
మతం హిందూ

తుమ్మల నాగేశ్వరరావు తెలుగుదేశం పార్టీ మాజీ రాజకీయనాయకుడు, మాజీ మంత్రి.ఖమ్మం జిల్లా లోని ఖమ్మం శాసనసభ నియొజక వర్గానికి ప్రాతినిధ్యం వహించాడు .పూర్వం ఖమ్మం జిల్లా లోని సత్తుపల్లి నియొజక వర్గానికి ప్రాతినిధ్యం వహింఛారు .ఖమ్మం జిల్లా తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులుగా ఉన్నాడు. 2014 ఆగస్టు 30న ఇతడు తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి టిఆర్ఎస్ పార్టీలో చేరాడు.[2]

రాజకీయ నేపధ్యము[మార్చు]

ఖమ్మం జిల్లా రాజకీయాల్లో తుమ్మలది విశిష్ట స్థానము. రాష్ట్రంలోని ప్రధాన పార్టీని ఒంటిచేత్తో మూడు దశాబ్దాల పాటు ఆయన నడిపించారు. తెలుగుదేశం పార్టీ స్థాపించిన నాటి నుంచి నేటి వరకు ఆయన క్రియాశీలకంగా పనిచేశారు. తన అనుచరులను ఎందరినో నాయకులుగా తీర్చిదిద్దారు. 1982 సెప్టెంబరులో చర్ల మండలం ఏటుపాక గ్రామంలో జరిగిన ఓ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ సమక్షంలో ఆయన పార్టీ సభ్యత్వం తీసుకున్నారు.

ఆయనకు రాజకీయ జన్మనిచ్చింది సత్తుపల్లి నియోజకవర్గం. పూర్వ సత్తుపల్లి నియోజకవర్గంలోని దమ్మపేట మండలం గండుగులపల్లి గ్రామానికి చెందిన ఆయన తన రాజకీయాలను అక్కడి నుంచే ప్రారంభించారు. తెలుగుదేశం స్థాపించిన తర్వాత జరిగిన తొలి ఎన్నికల్లోనే ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఆయన ఓటమి చవిచూశారు. మళ్లీ ఏడాదిన్నరకే 1985లో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో విజయం సాధించారు. అప్పుడే ఆయనకు ఎన్టీఆర్ కేబినెట్ ర్యాంకు ఇచ్చారు. ఆయన 1985,1994,1999,2009 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుండి, 2016లలో తెరాస పార్టీ నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యాడు, 2015లో మండలికి ఎన్నికయ్యాడు.

2004 ఎన్నికల్లో సత్తుపల్లి నియోజకవర్గం నుంచి పోటీచేసి ఓటమి పాలయ్యారు. 2009 ఎన్నికల్లో ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీచేసి గెలుపొందారు. 2014లో జరిగిన ఎన్నికల్లో కూడా టిడిపి నుండి పోటీ చేసి ఓడిపోయాడు. 2014లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరాడు.[3] అనంతరం ఆయనుకు తెరాస పార్టీ ఎమ్మెల్సీగా అవకాశం కల్పించింది. కేసీఆర్ మంత్రివర్గంలో ఆయన ఆర్‌అండ్‌బీ, స్త్రీ, శిశు సంక్షేమశాఖల మంత్రిగా భాద్యతలు నిర్వహించాడు.[4] 2016లో పాలేరు ఉపఎన్నికలో పోటీ చేసి కాంగ్రెస్‌ అభ్యర్థి రాంరెడ్డి సుచరితపై 45,684 ఓట్ల మెజారిటీతో గెలిచాడు.[5] 2018లో జరిగిన ముందస్తు ఎన్నికల్లో పాలేరు నియోజకవర్గం నుండి టిఆర్ఎస్ పార్టీ నుండి పోటీ చేసి ఓటమి పాలయ్యాడు.

మంత్రిగా[మార్చు]

తుమ్మల నాగేశ్వరరావు 1985 నుంచి 1988 వరకు ఎన్టీఆర్ మంత్రివర్గంలో చిన్ననీటి పారుదల శాఖ మంత్రిగా, 1994 నుంచి 1999 వరకు ఎన్టీఆర్, చంద్రబాబుల మంత్రివర్గంలో చిన్ననీటి పారుదల , ఎక్సైజ్ శాఖ మంత్రిగా, 1999 నుంచి 2004 వరకు చంద్రబాబు మంత్రివర్గంలో భారీ నీటి పారుదల, రోడ్లు, భవనాల శాఖల మంత్రిగా, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కెసిఆర్ మంత్రివర్గంలో 2015 నుంచి 2018 వరకు స్త్రీ, శిశు సంక్షేమ శాఖ, రోడ్డు, భవనాలు శాఖల మంత్రిగా పనిచేసాడు.

బయటి లంకెలు[మార్చు]

  1. Sakshi (17 December 2014). "కొత్త మంత్రుల జీవిత విశేషాలు..." Sakshi. Archived from the original on 18 జూన్ 2021. Retrieved 18 June 2021.
  2. http://indiatoday.intoday.in/story/tummala-nageswar-rao-tdp-trs-chandrababu-naidu-kcr-telangana/1/380046.html
  3. Sakshi (5 September 2014). "'వారి ఉసురు తప్పకుండా తగులుతుంది'". Sakshi. Archived from the original on 18 జూన్ 2021. Retrieved 18 June 2021.
  4. Sakshi (17 December 2014). "తుమ్మలకు పట్టం". Sakshi. Archived from the original on 18 జూన్ 2021. Retrieved 18 June 2021.
  5. Sakshi (20 May 2016). "పాలేరులోనూ టీఆర్‌ఎస్ జైత్రయాత్ర". Sakshi. Archived from the original on 18 జూన్ 2021. Retrieved 18 June 2021.