మహబూబాబాద్ లోక్‌సభ నియోజకవర్గం
స్వరూపం
తెలంగాణ లోని 17 లోక్‌సభ నియోజకవర్గాలలో ఇది ఒకటి. ఈ లోక్‌సభ నియోజక వర్గంలో 7 శాసనసభ నియోజకవర్గములు ఉన్నాయి. నూతనంగా చేసిన పునర్విభజన ప్రకారం ఇది ఎస్టీలకు రిజర్వ్ చేయబడింది.
దీని పరిధిలోని శాసనసభ నియోజకవర్గాలు
[మార్చు]- డోర్నకల్ శాసనసభ నియోజకవర్గం (ఎస్టీ లకు రిజర్వ్ చేయబడినది)
- మహబూబాబాద్ శాసనసభ నియోజకవర్గం (ఎస్టీ లకు రిజర్వ్ చేయబడినది)
- నర్సంపేట శాసనసభ నియోజకవర్గం
- ములుగు శాసనసభ నియోజకవర్గం (ఎస్టీ లకు రిజర్వ్ చేయబడినది)
- పినపాక శాసనసభ నియోజకవర్గం (ఎస్టీ లకు రిజర్వ్ చేయబడినది)
- ఇల్లందు శాసనసభ నియోజకవర్గం (ఎస్టీ లకు రిజర్వ్ చేయబడినది)
- భద్రాచలం శాసనసభ నియోజకవర్గం (ఎస్టీ లకు రిజర్వ్ చేయబడినది)
ఎన్నికైన సభ్యులు
[మార్చు]లోక్‌సభ | సంవత్సరం | పదవీకాలం | పేరు | పార్టీ | |
---|---|---|---|---|---|
2వ లోక్‌సభ | 1957[1] | 1957-62 | ఇటిక్యాల మధుసూదన్ రావు | భారత జాతీయ కాంగ్రెస్ | |
3వ లోక్‌సభ | 1962[2] | 1962-67 | |||
2వ లోక్‌సభ | 1962[2] | 1962-67 | ఆర్. సురేంద్రరెడ్డి | ||
15వ లోక్‌సభ | 2009[3] | 2009-14 | బలరాం నాయక్ | ||
16వ లోక్‌సభ | 2014[4] | 2014-19 | సీతారాం నాయక్ | తెలంగాణ రాష్ట్ర సమితి | |
17వ లోక్‌సభ | 2019 [5] | 2019- ప్రస్తుతం | మాలోత్ కవిత[6] |
2009 ఎన్నికలు
[మార్చు]2009లో మహబూబాబాద్ ఎస్టీ రిజర్వుడ్‌గా ఆవిర్భవించింది. ఈ ఎన్నికలలో కాంగ్రెస్ నుంచి పోరిక బలరాంనాయక్, మహాకూటమి సీపీఐ నుంచి కుంజా శ్రీనివాసరావు, చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ నుంచి రిటైర్డ్ ఐపీఎస్ అధికారి డీటీ నాయక్ పోటీపడ్డారు. 2009లో ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి గెలిచిన పోరిక బలరాంనాయక్‌కు 3,94,447 ఓట్లు రాగా, ఆయన సమీప ప్రత్యర్థి సీపీఐ కుంజా శ్రీనివాసరావుకు 3,25,490 ఓట్లు లభించాయి. పీఆర్పీ అభ్యర్థి డీటీ నాయక్‌కు 1,45,299 ఓట్లు లభించాయి. బలరాంకు 68,957 ఓట్ల మెజార్టీ లభించింది.[7]
2024 ఎన్నికలు
[మార్చు]2024 పార్లమెంట్ ఎన్నికల్లో ఈ స్థానం నుండి మొత్తం 23 మంది పోటీలో ఉన్నారు.[8]
మూలాలు
[మార్చు]- ↑ "Statistical Report on General Election, 1957 : To the Second Lok Sabha Volume-I" (PDF). Election Commission of India. p. 5. Archived (PDF) from the original on 20 March 2012. Retrieved 11 July 2015.
- ↑ 2.0 2.1 "Statistical Report On General Elections, 1962 To The Third Lok Sabha" (PDF). Election Commission of India. Archived from the original (PDF) on 18 July 2014. Retrieved 30 April 2014.
- ↑ "Constituency Wise Detailed Results" (PDF). Election Commission of India. p. 196. Archived from the original (PDF) on 11 August 2014. Retrieved 30 April 2014.
- ↑ "Constituencywise-All Candidates". Election Commission of India. Archived from the original on 17 May 2014.
- ↑ The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.
- ↑ Eenadu (16 April 2024). "గెలిపించేది ఆమె". Archived from the original on 16 April 2024. Retrieved 16 April 2024.
- ↑ Andhrajyothy (15 March 2024). "తీన్‌మార్". Archived from the original on 17 March 2024. Retrieved 17 March 2024.
- ↑ EENADU (30 April 2024). "ఖమ్మం బరిలో 35.. మహబూబాబాద్‌లో 23 మంది". Archived from the original on 30 April 2024. Retrieved 30 April 2024.