నల్గొండ లోక్‌సభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

తెలంగాణ లోని 17 లోక్‌సభ నియోజకవర్గాలలో ఇది ఒకటి. ఈ లోక్‌సభ నియోజక వర్గంలో 7 శాసనసభ నియోజకవర్గములు ఉన్నాయి.[1]

నల్గొండ క్లాక్ టవర్ ఫోటో


దీని పరిధిలోని శాసనసభ నియోజకవర్గములు[మార్చు]

నల్లగొండ లోకసభ నియోజకవర్గ పరిధిలో ప్రస్తుతము ఏడు శాసనసభ నియోజకవర్గములు కలవు. అవి:

నియోజకవర్గ సంఖ్య పేరు రిజర్వేషన్
86 దేవరకొండ ఎస్.టి
87 నాగార్జునసాగర్ లేదు
88 మిర్యాలగూడ లేదు
89 హుజూర్‌నగర్ లేదు
90 కోదాడ లేదు
91 సూర్యాపేట లేదు
92 నల్గొండ లేదు

2008-వ సంవత్సరౌలో జరిగిన నియోజకవర్గముల పునార్విభజనకు మునుపు ఈ లోకసభ నియోజకవర్గ పరిధిలో ఈ క్రింది శాసనసభ నియోజకవర్గములు ఉండెను. అవి:

నియోజకవర్గ సంఖ్య పేరు
205 ఇబ్రహీంపట్నం
212 మలకపేట
291 ఆలేరు
292 భువనగిరి
293 మునుగోడు
294 దేవరకొండ
289 నల్గొండ

నియోజకవర్గం నుంచి గెలుపొందిన అభ్యర్థులు[మార్చు]

లోక్‌సభ కాలము గెలిచిన అభ్యర్థి పార్టీ
రెండవ 1957-62 దేవులపల్లి వేంకటేశ్వరరావు భారతీయ కమ్యూనిస్ట్ పార్టీ
మూడవ 1962-67 రావి నారాయణరెడ్డి భారతీయ కమ్యూనిస్ట్ పార్టీ
నాల్గవ 1967-71 మహమ్మద్ యూనస్ సలీం కాంగ్రెస్ పార్టీ
ఐదవ 1971-77 కంచర్ల రామకృష్ణారెడ్డి తెలంగాణ ప్రజా సమితి
ఆరవ 1977-80 అబ్దుల్ లతీఫ్ కాంగ్రెస్ పార్టీ
ఏడవ 1980-84 టి. దామోదర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ
ఎనిమిదవ 1984-89 ఎం. రఘుమారెడ్డి తెలుగుదేశం పార్టీ
తొమ్మిదవ 1989-91 చకిలం శ్రీనివాసరావు కాంగ్రెస్ పార్టీ
పదవ 1991-96 బొమ్మగాని ధర్మభిక్షం గౌడ్ భారతీయ కమ్యూనిస్ట్ పార్టీ
పదకొండవ 1996-98 బొమ్మగాని ధర్మభిక్షం గౌడ్ భారతీయ కమ్యూనిస్ట్ పార్టీ
పన్నెండవ 1998-99 సురవరం సుధాకర్ రెడ్డి భారతీయ కమ్యూనిస్ట్ పార్టీ
పదమూడవ 1999-04 గుత్తా సుఖేందర్ రెడ్డి తెలుగుదేశం పార్టీ
పదునాల్గవ 2004- 2009 సురవరం సుధాకర్ రెడ్డి భారతీయ కమ్యూనిస్ట్ పార్టీ
పదిహేనవ 2009-2014 గుత్తా సుఖేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ
16వ 2009-2014 గుత్తా సుఖేందర్ రెడ్డి భారత జాతీయ కాంగ్రెస్
17వ 2019 - ప్రస్తుతం నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ

2004 ఎన్నికలు[మార్చు]

2004 ఎన్నికల ఫలితాలను తెలిపే చిత్రం

  వట్టిపల్లి శ్రీనివాస గౌడ్ (8.25%)
  ఎ.నాగేశ్వరరావు (1.50%)
  పుడారి నరసింహ (1.39%)
  ఇతరులు (2.7%)
భారత సాధారణ ఎన్నికలు,2004:నల్గొండ
పార్టీ అభ్యర్థి ఓట్లు % ±%
సి.పి.ఐ సురవరం సుధాకర్ రెడ్డి 479,511 45.76 +27.97
భాజపా నల్లు ఇంద్రసేనారెడ్డి 423,360 40.40
తెరాస వట్టిపల్లి శ్రీనివాస గౌడ్ 86,426 8.25
పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా ఎ.నాగేశ్వరరావు 15,736 1.50
బసపా పుడారి నరసింహ 14,552 1.39
స్వతంత్ర అభ్యర్ది ప్రతాప్ గ్యారా 9528 0.91
స్వతంత్ర అభ్యర్ది గుమ్మి బక్క రెడ్డి 9,441 0.90 +0.79
స్వతంత్ర అభ్యర్ది పాదురి నరసింహా రెడ్ది 9,312 0.89
మెజారిటీ 56,151 5.36 +32.54
మొత్తం పోలైన ఓట్లు 1,047,8 65.30 +3.90
సి.పి.ఐ గెలుపు మార్పు +27.97

2009 ఎన్నికలు[మార్చు]

2009 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తరఫున ఇటీవల తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరిన గుత్తా సుఖేందర్ రెడ్డికి లభించింది. [2] భారతీయ జనతా పార్టీ తరఫున వి.శ్రీరాం పోటీ చేస్తున్నాడు. [3] ప్రజారాజ్యం పార్టీ టికెట్ పాదూరి కరుణకు లభించింది. [4]

మూలాలు[మార్చు]

  1. Sakshi (17 March 2019). "నల్లగొండకు దేశవ్యాప్త గుర్తింపు". Archived from the original on 17 December 2021. Retrieved 17 December 2021.
  2. ఈనాడు దినపత్రిక, తేది 22-03-2009
  3. సూర్య దినపత్రిక, తేది 18-03-2009
  4. ఈనాడు దినపత్రిక, తేది 29-03-2009