1999 భారత సార్వత్రిక ఎన్నికలు
| |||||||||||||||||||||||||||||||||||||||||||||
545 లో 543 స్థానాలకు 272 seats needed for a majority | |||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
Registered | 61,95,36,847 | ||||||||||||||||||||||||||||||||||||||||||||
Turnout | 59.99% (1.98pp) | ||||||||||||||||||||||||||||||||||||||||||||
| |||||||||||||||||||||||||||||||||||||||||||||
Results by constituency | |||||||||||||||||||||||||||||||||||||||||||||
|
కార్గిల్ యుద్ధం జరిగిన కొన్ని నెలల తర్వాత 1999 సెప్టెంబరు 5 - అక్టోబరు 3 మధ్య భారతదేశంలో సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. ఫలితాలు 1999 అక్టోబరు 6 న ప్రకటించారు.[1] [2]
ఈ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ లోక్‌సభలో మెజారిటీ సాధించింది. 1984 తర్వాత మొదటిసారిగా ఒక పార్టీ లేదా కూటమి పూర్తి మెజారిటీని గెలుచుకుంది. 1977 ఎన్నికల తర్వాత కాంగ్రెసేతర కూటమి విజయం సాధించింది. ఈ ఎన్నికల తరువాత, అటల్ బిహారీ వాజ్‌పేయి పూర్తి ఐదేళ్ల పదవీకాలం పనిచేసిన మొదటి కాంగ్రెసేతర ప్రధానిగా రికార్డు సృష్టించాడు. ఈ నిర్ణయాత్మక ఫలితంతో 1996 నుండి దేశం చూసిన రాజకీయ అస్థిరత కూడా ముగిసింది. భారత జాతీయ కాంగ్రెస్ తన ఓట్‌షేర్‌ను పెంచుకోగలిగినప్పటికీ, దాని 114 సీట్ల సంఖ్య అప్పటి వరకు జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అత్యంత చెత్త పనితీరుగా పరిగణించబడింది.
నేపథ్యం
[మార్చు]1999 లోక్‌సభ విశ్వాస తీర్మానం
[మార్చు]1999 ఏప్రిల్ 17 న, ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ (బిజెపి) సంకీర్ణ ప్రభుత్వం లోక్‌సభ (భారతదేశం దిగువ సభ)లో ప్రభుత్వ సంకీర్ణంలో భాగస్వామి అయిన అఖిల భారత అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం మద్దతును ఉపసంహరించుకోవడం వల్ల ఒక్క ఓటుతో విశ్వాసం ఓటింగ్‌లో విజయం సాధించలేకపోయింది. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి జె. జయలలిత, కొన్ని డిమాండ్లను నెరవేర్చకుంటే ప్రత్యేకించి తమిళనాడు ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయకపోతే పాలక కూటమికి మద్దతు ఉపసంహరించుకుంటామని బెదిరించింది. వరుస అవినీతి ఆరోపణలపై విచారణలో నిలబడకుండా ఉండేందుకు జయలలిత ఈ డిమాండ్లు చేశారని, భాజపా ఆరోపించింది.[3]
ప్రతిపక్ష నేతగా, అతిపెద్ద ప్రతిపక్ష పార్టీ (ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ) సోనియా గాంధీ లోక్‌సభలో వర్కింగ్ మెజారిటీని సాధించేంత పెద్ద పార్టీల కూటమిని ఏర్పాటు చేయలేకపోయింది. ఆ విధంగా అవిశ్వాస తీర్మానం ముగిసిన కొద్దిసేపటికే, రాష్ట్రపతి కెఆర్ నారాయణన్ పార్లమెంటును రద్దు చేసి తాజా ఎన్నికలకు పిలుపునిచ్చారు. ఆ ఏడాది చివర్లో ఎన్నికలు జరిగే వరకు అటల్ బిహారీ వాజ్‌పేయి తాత్కాలిక ప్రధానిగా కొనసాగారు.[4]
ఫలితాలు
[మార్చు]సీట్ల పరంగా ఫలితాలు నిర్ణయాత్మకంగా భాజపాకు, ఎన్‌డిఎకూ అనుకూలంగా వచ్చాయి. అధికార ఎన్‌డిఎ 269 స్థానాలను కైవసం చేసుకుంది. భాజపా నేతృత్వంలోని ప్రభుత్వానికి మద్దతు ఇచ్చిన తెలుగుదేశం పార్టీ 29 స్థానాలను కైవసం చేసుకుంది. అయితే అది కూటమిలో భాగం కాదు. కాంగ్రెస్ పార్టీ 23 స్థానాలను కోల్పోయింది. దాని రెండు కీలక ప్రాంతీయ మిత్రపక్షాలకు ఊహించిన దానికంటే దారుణమైన ఫలితాలొచ్చాయి. అయితే, ఉత్తరప్రదేశ్ వంటి కొన్ని రాష్ట్రాల్లో (1998లో అది తుడిచిపెట్టుకుపోయింది, రాష్ట్రంలో ఒక్క సీటు కూడా గెలవలేదు) తిరిగి పుంజుకుంది. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా కేవలం నాలుగు సీట్లకు పడిపోయి, "జాతీయ పార్టీ"గా అధికారిక హోదాను కోల్పోవడంతో వామపక్ష పార్టీల ప్రభ క్షీణించడం కొనసాగింది. [5]
దాదాపు అర్ధ శతాబ్ద కాలంలో భారత జాతీయ కాంగ్రెస్‌కు అత్యంత దారుణమైన ఫలితాలను సాధించింది. స్వయంగా పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, ఫలితాలను నిజాయితీగా విశ్లేషించాలని పిలుపునిచింది - "ఫలితాల ఆత్మపరిశీలన, నిష్కపటమైన అంచనా, దృఢమైన చర్యకు పిలుపునిస్తున్నాయి. రాబోయే రోజుల్లో దీన్ని మేం చేపడతాం. ప్రజల తీర్పును మేము నిర్మొహమాటంగా అంగీకరిస్తున్నాం." బిజెపి విషయంలో, ఓ కాంగ్రెసేతర పార్టీగా సుస్థిర ప్రభుత్వ సంకీర్ణాన్ని సాధించిన మొదటి సందర్భం ఇది. గతంలో 1977, 1989, 1996లో కాంగ్రెసేతర పాలక సంకీర్ణాలు ఏర్పడినప్పటికీ, ఆ ప్రభుత్వాలేవీ రెండు సంవత్సరాలకు పైగా స్థిరంగా కొనసాగలేకపోయాయి. "ఇది ఖచ్చితంగా సుస్థిరతతో కూడిన ప్రభుత్వం అవుతుంది...వాజ్‌పేయి తన అనుభవంతో మా సంకీర్ణ భాగస్వాములను హ్యాండిల్ చేయగలరని నేను ఆశిస్తున్నాను" అని బిజెపి సీనియర్ వ్యక్తి ఒకరు ఆ తర్వాత వ్యాఖ్యానించారు. [6]
Party | |
---|---|
Total |
రాష్ట్రం, కూటమి వారీగా
[మార్చు]కొత్త ప్రభుత్వానికి మద్దతు
[మార్చు]రాజకీయ పార్టీ | సీట్లు | కూటమి | |
---|---|---|---|
భారతీయ జనతా పార్టీ | 182 | జాతీయ ప్రజాస్వామ్య కూటమి | |
జనతాదళ్ (యునైటెడ్) | 21 | ||
శివసేన | 15 | ||
ద్రవిడ మున్నేట్ర కజగం | 12 | ||
బిజు జనతా దళ్ | 10 | ||
ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ | 8 | ||
పట్టాలి మక్కల్ కట్చి | 5 | ||
ఇండియన్ నేషనల్ లోక్ దళ్ | 5 | ||
మరుమలార్చి ద్రవిడ మున్నేట్ర కజగం | 4 | ||
జమ్మూ & కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ | 4 | ||
శిరోమణి అకాలీదళ్ | 2 | ||
రాష్ట్రీయ లోక్ దళ్ | 2 | ||
తెలుగుదేశం పార్టీ | 29 | బయటి మద్దతు | |
మొత్తం | 299 |
ఇవి కూడా చూడండి
[మార్చు]- 13వ లోక్‌సభ సభ్యుల జాబితా
మూలాలు
[మార్చు]- ↑ "tribuneindia... Nation". www.tribuneindia.com. Archived from the original on 16 August 2021. Retrieved 2021-08-16.
- ↑ "The 1999 Indian Parliamentary Elections and the New BJP-led Coalition Government". 2008-10-11. Archived from the original on 11 October 2008. Retrieved 2021-08-16.
- ↑ BBC World Service (19 April 1999). "Jayalalitha: Actress-turned-politician". BBC News. Archived from the original on 6 January 2019. Retrieved 11 December 2008.
- ↑ Oldenburg, Philip (September 1999). "The Thirteenth Election of India's Lok Sabha". The Asia Society. Archived from the original on 4 June 2008. Retrieved 11 December 2008.
- ↑ Hardgrave, Bob (1999). "The 1999 Indian Parliamentary Elections and the New BJP-led Coalition Government". Archived from the original on 11 October 2008. Retrieved 11 December 2008.
- ↑ BBC (8 October 1999). "Indian election: What they said". BBC News. Archived from the original on 26 December 2018. Retrieved 12 December 2008.