భారతదేశ ఎన్నికలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

భారత గణతంత్ర రాజ్యం ఒక సమాఖ్య ప్రజాస్వామ్య వ్యవస్థ. కేంద్ర, రాష్ట్ర, పంచాయతీ ప్రజాప్రతినిధులను, తద్వారా ప్రభుత్వాలను, ప్రజలు ఎన్నుకుంటారు. ఎన్నికలు నిర్వహించే భాధ్యతను భారత రాజ్యాంగం ఎన్నికల కమీషన్ అనే సంస్థకు అప్పగించింది.రాష్ట్రపతిఉపరాష్ట్రపతులు పరోక్ష పద్ధతిలో ఎలక్టోరల్ కాలేజి ద్వారా ఐదు సంవత్సరాలకు ఒకసారి ఎన్నుకోబడతారు. కేంద్ర స్థాయిలో లోక్ సభ, రాష్ట్ర స్థాయిలో విధాన సభలకు ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి ప్రజాప్రతినిధులను ప్రజలు నేరుగా ఎన్నుకుంటారు. లోక్‌సభలో అత్యధిక సంఖ్యాక రాజకీయ పార్టీ లేదా సంకీర్ణం సభ్యులు ప్రధానమంత్రిని ఎన్నుకుంటారు. ప్రధానమంత్రి సలహా మేరకు, రాష్ట్రపతిచే నియమించబడ్డ మంత్రివర్గం ప్రధానమంత్రికి తన విధి నిర్వహణలో సహాయకంగా ఉంటుంది. 18 ఏళ్ళు ద్రాటిన ప్రతి భారతీయుడు ఈ ఎన్నికల్లో పాల్గొనడానికి, ఓటు వేయటానికి అర్హుడు.

2014 సార్వత్రిక ఎన్నికల్లో సుమారు 863,500,000 ఓటర్లు ఓటు వ్రేయుటకు అర్హులు. ప్రపంచ చరిత్రలోనే ఇది అతి పెద ఎన్నికగా పేరు సంపాదించింది. స్వతంత్ర భారత చరిత్రలో అత్యధిక భాగం, కేంద్ర ప్రభుత్వంలో భారత జాతీయ కాంగ్రెసు పార్టీ అధికారంలో ఉంటూ వచ్చింది. స్వాతంత్ర్యానికి పూర్వం అతిపెద్ద రాజకీయ పక్షం కావడం చేత, స్వాతంత్ర్యం తరువాత దాదాపు 40 ఏళ్ళపాటు దేశరాజకీయాల్లో కాంగ్రెసు గుత్తాధిపత్యం వహించింది. 1977లో జనతా పార్టీగా ఏర్పడ్డ ఐక్య ప్రతిపక్షం కాంగ్రెసును ఓడించి, మొట్టమొదటి కాంగ్రెసేతర ప్రభుత్వాన్ని ఏర్పరచింది. ఇటీవలి కాలంలో, భారత ఓటర్లపై గల పట్టును కాంగ్రెసు పార్టీ కోల్పోతూ వచ్చింది. 2004 సార్వత్రిక ఎన్నికలలో అత్యధిక స్థానాలు గెలిచిన కాంగ్రెసు పార్టీ, వివిధ చిన్న పార్టీలతో కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. హిందూ వాద పార్టీ అయిన భాజపా ప్రధాన ప్రతిపక్షమైంది. ప్రాంతీయ పార్టీల ప్రాబల్యం కారణంగా 1996 తరువాత ఏర్పడిన ప్రభుత్వాలన్నీ సంకీర్ణాలేకాగా 2014 లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం పాలయింది .ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పదిశాతం లోక్‌సభ స్థానాలను గెలుచుకోవడం కూడా కష్టంకాగా, భారతీయ జనతా పార్టీ మాత్రం మొదటిసారిగా అత్యధిక స్థానాలను గెలుచుకోవడం విశేషం.

తెలుగు రాష్ట్రాల ఎన్నికలు 2014, 2019 లో సార్వత్రిక ఎన్నికలతో పాటు నిర్వహించారు.

లోక్‌సభ ఎన్నికలు[మార్చు]

  • 1952లో మొదటి సార్వత్రిక ఎన్నికలు.
  • 1957లో 2వ సార్వత్రిక ఎన్నికలు.
  • 1962లో 3వ సార్వత్రిక ఎన్నికలు.
  • 1967లో 4వ సార్వత్రిక ఎన్నికలు.
  • 1971లో 5వ సార్వత్రిక ఎన్నికలు.
  • 1977లో 6వ సార్వత్రిక ఎన్నికలు.
  • 1980లో 7వ సార్వత్రిక ఎన్నికలు.
  • 1984లో 8వ సార్వత్రిక ఎన్నికలు.
  • 1989లో 9వ సార్వత్రిక ఎన్నికలు.
  • 1991లో 10వ సార్వత్రిక ఎన్నికలు.
  • 1996లో 11వ సార్వత్రిక ఎన్నికలు.
  • 1998లో 12వ సార్వత్రిక ఎన్నికలు.
  • 1999లో 13వ సార్వత్రిక ఎన్నికలు.
  • 2004లో 14వ సార్వత్రిక ఎన్నికలు.
  • 2009లో 15వ సార్వత్రిక ఎన్నికలు.
  • 2014లో 16వ సార్వత్రిక ఎన్నికలు
  • 2019లో 17వ సార్వత్రిక ఎన్నికలు

మూలాలు[మార్చు]

వెలుపలి లంకెలు[మార్చు]