Jump to content

సుకుమార్ సేన్

వికీపీడియా నుండి
సుకుమార్ సేన్
భారత ప్రధాన ఎన్నికల కమిషనర్
In office
1950 మార్చి 21 – 1958 డిసెంబరు 19
తరువాత వారుకళ్యాణ సుందరం
వ్యక్తిగత వివరాలు
జననం(1898-01-02)1898 జనవరి 2
మరణం1963 మే 13(1963-05-13) (వయసు 65)[1]
జాతీయతభారతీయుడు
జీవిత భాగస్వామిగౌరీ సేన్
సంతానం4
కళాశాలప్రెసిడెన్సీ కాలేజ్, కలకత్తా
యూనివర్శిటీ ఆఫ్ లండన్
వృత్తిసివిల్ సర్వెంట్
Known forమొదటి భారత ఎన్నికల కమిషనర్,
మొదటి వైస్-ఛాన్సలర్, బుర్ద్వాన్ విశ్వవిద్యాలయం
పురస్కారాలుపద్మ భూషణ్

సుకుమార్ సేన్, (2 జనవరి 1898 - 13 మే 1963) అఖిల భారతీయ సర్వీసుల అధికారి (ఇండియన్ సివిల్ సర్వీసెస్) , భారతదేశపు మొదటి ప్రధాన ఎన్నికల కమీషనర్ గా 21 మార్చి 1950 నుండి 1958 డిసెంబరు 19 వరకు పదవీ బాధ్యతలు నిర్వహించాడు. సేన్ ఆధ్వర్యంలో ఎన్నికల సంఘం 1951-52, 1957 లో స్వతంత్ర భారతదేశం మొదటి రెండు సాధారణ ఎన్నికలను విజయవంతంగా నిర్వహించి పర్యవేక్షించింది. సూడాన్ లో మొదటి ప్రధాన ఎన్నికల కమిషనర్ గా కూడా పనిచేశాడు.[2]

జీవితం

[మార్చు]

సేన్ 2 జనవరి 1899 న బెంగాలీ బైద్య-బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. తండ్రి  ప్రభుత్వోద్యోగి అక్షోయ్ కుమార్ సేన్ పెద్ద కుమారుడు. అతడు  కోల్ కతాలోని ప్రెసిడెన్సీ కాలేజ్, లండన్ విశ్వవిద్యాలయంలో విద్యాభ్యాసం చేశాడు. [3] 1921 సంవత్సరం లో ఇండియన్ సివిల్ సర్వీస్ లో చేరి వివిధ జిల్లాల్లో ఐ.సి.ఎస్ అధికారిగా, న్యాయమూర్తిగా పనిచేయడం జరిగింది . 1947 సంవత్సరంలో, అతను పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ  ప్రధాన కార్యదర్శిగా నియమించబడ్డాడు.

ప్రధాన ఎన్నికల కమిషనర్

[మార్చు]

సేన్ 1922లో ఇండియన్ సివిల్ సర్వీసెస్ లో చేరిన తర్వాత వివిధ ఉద్యోగాలలోపలు ముఖ్యమైన పదవులను నిర్వహించి , 1947-1950 సమయంలో పశ్చిమ బెంగాల్ ప్రధాన కార్యదర్శిగా పనిచేసారు. సుకుమార్ సేన్ ఆధ్వర్యంలో 1952లో జరిగిన మొదటి ఎన్నికలు కీలకమైనవి, ఎందుకంటే అవి తరువాతి అన్ని ఎన్నికలకు ప్రామాణికతను ఏర్పరచాయి. 1950 మార్చి 21 నుంచి 1958 డిసెంబరు 19న పదవీ విరమణ చేసే వరకు భారత తొలి ప్రధాన ఎన్నికల కమిషనర్ గా పనిచేశాడు.[4] భారతదేశంలో 1952 , 1957 సంవత్సరాలలో జరిగిన భారతదేశపు మొదటి రెండు లోక్ సభ ఎన్నికలను సవాలు పరిస్థితులలో సార్వత్రిక వయోజన ఓటుహక్కు ఆధారంగా శాసనసభ ఎన్నికలతో పాటు ఏకకాలంలో నిర్వహించాడు. 1953 నవంబరు-డిసెంబరులో అప్పటి సూడాన్ లో అంతర్జాతీయ ఎన్నికల సంఘం చైర్మన్ గా మొదటి సార్వత్రిక ఎన్నికలను నిర్వహించిన ఘనత సేన్ కు దక్కింంది. [5]

1952 లో స్వతంత్ర భారతదేశం తన మొదటి ఎన్నికలను నిర్వహించింది. ఎన్నికలకు ముందు, భారతదేశపు మొదటి ఎన్నికల కమీషనర్ సేన్, 173 మిలియన్ల ఓటర్ల కోసం మొదటిసారిగా ఓటరు జాబితాలను తయారు చేయడం , పార్టీ గుర్తులు, బ్యాలెట్ పేపర్లు, బ్యాలెట్ బాక్సులను తొలిసారిగా మళ్లీ రూపొందించాడు. పోలింగ్ కేంద్రాలను నిర్మించి, నిజాయితీపరులైన, సమర్థవంతమైన పోలింగ్ అధికారులను నియమించాల్సి వచ్చింది. ఎన్నికలకు ముందు ఈ పనిని సుకుమార్ సేన్ ది "మానవ చరిత్రలో ప్రజాస్వామ్యంలో అతిపెద్ద ప్రయోగం" అని వ్యాఖ్యానించాడు. [6]

సేన్ 1960 జూన్ 15న ప్రారంభమైన బుర్ద్వాన్ విశ్వవిద్యాలయానికి మొదటి ఉప-కులపతి గా వైస్-ఛాన్సలర్ వ్యవహరించాడు.[7]

గౌరవం

[మార్చు]

సుకుమార్ సేన్ భారత ప్రభుత్వం నుంచి 1954 వ సంవత్సరంలో పద్మభూషణ్ అవార్డు అఖిల భారతీయ సర్వీసులలో మొదటి గ్రహీత.[8] బుర్ద్వాన్ జి.టి. రోడ్డు నుండి గోలబాగ్ కు వెళ్ళే రహదారికి గౌరవ సూచకంగా, అతని జ్ఞాపకార్థం సుకుమార్ సేన్ రోడ్ అని పేరు పెట్టారు. 1953 సంవత్సరంలో సుడాన్ లోని ఒక వీధికి అతని పేరు పెట్టడం జరిగింది.

మూలాలు

[మార్చు]
  1. West Bengal Legislative Council Debates. Government of West Bengal. 1963. p. 1–2.
  2. Willis, Justin. "'A model of its kind': representing the 1953 Sudan election". nomadit.co.uk (in ఇంగ్లీష్). Retrieved 2022-04-29.
  3. Sir Stanley, Reed (1950). The Indian And Pakistan Year Book And Whos Who 1950 Vol-xxxvi (1950). Bennett Coleman and Co. Ltd. p. 761.
  4. "Shri Pranab Mukherjee delivers the 1st Sukumar Sen Memorial Lecture hosted by Election Commission of India to mark its 70th year of inception". eci.gov.in/. 23 January 2020. Retrieved 29 April 2022.
  5. "Shri Sukumar Sen - JournalsOfIndia" (in అమెరికన్ ఇంగ్లీష్). 2020-01-31. Archived from the original on 2022-05-17. Retrieved 2022-04-29.
  6. "Press Information Bureau: Government of India news site, PIB Mumbai website, PIB Mumbai, Press Information Bureau, PIB, India's Official media agency, Government of India press releases, PIB photographs, PIB photos, Press Conferences in Mumbai, Union Minister Press Conference, Marathi press releases, PIB features, Bharat Nirman Public Information Campaign, Public Information Campaign, Bharat Nirman Campaign, Public Information Campaign, Indian Government press releases, PIB Western Region". pibmumbai.gov.in. Retrieved 2022-04-29.
  7. "The University of Burdwan". buruniv.ac.in. Archived from the original on 2022-06-15. Retrieved 2022-04-29.
  8. "Sukumar Sen Biography and Interesting Facts | SamanyaGyan.com". SamanyaGyan.com 2021 (in అమెరికన్ ఇంగ్లీష్). 2021-03-03. Retrieved 2022-04-29.