Jump to content

ఇండియన్ సివిల్ సర్వీస్

వికీపీడియా నుండి
(సివిల్ సర్వీస్ నుండి దారిమార్పు చెందింది)
ఐఎఎస్‌లకు శిక్షణ ఇచ్చే లాల్ బహదూర్ శాస్త్రి కళాశాల, ముసోరి

ఇండియన్ సివిల్ సర్వీస్, (భారతీయ పౌరసేవలు) అనగా కేంద్ర లేక రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు. కేంద్ర ఉద్యోగాలలో ముఖ్యమైనవి.అవి ఇండియన్‌ అడ్మినిస్ట్రేటివ్‌ సర్వీస్‌ (ఐఎఎస్‌), ఇండియన్‌ పోలీస్‌ సర్వీస్‌ (ఐపిఎస్‌) ఇండియన్‌ ఫారిన్‌ సర్వీస్‌ (ఐ.ఎఫ్‌.ఎస్‌). సివిల్‌ సర్వీస్‌ పోస్టుల భర్తీని యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌[1] నిర్వహిస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్[2] నిర్వహిస్తుంది.

సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షకు డిగ్రీ ప్రధాన అర్హత. వయస్సు 21-30 సంవత్సరాలలోపు ఉండాలి. ప్రిలిమినరీ పరీక్ష పూర్తిగా ఆబ్జెక్టివ్‌. ఇందులో రెండు పేపర్లుంటాయి. మొదటి పేపర్‌ జనరల్‌ స్టడీస్‌. దీనికి 150 మార్కులు ఉంటాయి. రెండోది ఆప్షనల్‌ పేపర్‌. దీనికి 300 మార్కులు ఉంటాయి. ప్రిలిమ్స్‌లో అర్హత సాధించిన అభ్యర్థులు మెయిన్స్‌ రాయాల్సి ఉంటుంది. ఇందులో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు పర్సనాలిటీ టెస్ట్ (ఇంటర్వ్యూ) ఉంటుంది. ఇంటర్వ్యూలో పాసైతే పోస్టింగ్స్ ఇస్తారు. మెయిన్స్‌ పరీక్ష డిస్క్రిప్టివ్‌ విధానంలో ఉంటుంది. ఈ రాత పరీక్షను మాతృభాషలో కూడా రాయవచ్చు.

పోస్టుల విభాగాలు

[మార్చు]
  1. ఇండియన్‌ అడ్మినిస్ట్రేటివ్‌ సర్వీస్‌ - ఐఎఎస్‌
  2. ఇండియన్‌ ఫారిన్‌ సర్వీస్‌ - ఐ.ఎఫ్‌.ఎస్‌
  3. ఇండియన్‌ పోలీస్‌ సర్వీస్‌ - ఐ.పి.ఎస్‌
  4. ఇండియన్‌ పి.అండ్‌.టి. అకౌంట్స్ ఫైనాన్స్ సర్వీస్‌
  5. ఇండియన్‌ ఆడిట్‌ అండ్‌ అకౌంట్స్ సర్వీస్‌
  6. ఇండియన్‌ రెవెన్యూ సర్వీస్‌ - కస్టమ్స్ సెంట్రల్‌ ఎక్సయిజ్‌
  7. ఇండియన్‌ డిఫెన్స్ అకౌంట్స్ సర్వీస్‌
  8. ఇండియన్‌ రెవెన్యూ సర్వీస్‌
  9. ఇండియన్‌ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ సర్వీస్‌
  10. ఇండియన్‌ పోస్టల్‌ సర్వీస్‌
  11. ఇండియన్‌ సివిల్‌ అకౌంట్స్ సర్వీస్‌
  12. ఇండియన్‌ రైల్వే ట్రాఫిక్‌ సర్వీస్‌
  13. ఇండియన్‌ రైల్వే అకౌంట్స్ సర్వీస్‌
  14. ఇండియన్‌ రైల్వే పర్సనల్‌ సర్వీస్‌
  15. రైల్వే ప్రొటెక్షన్‌ ఫోర్స్- అసిస్టెంట్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌
  16. ఇండియన్‌ డిఫెన్స్ ఎస్టేట్‌ సర్వీస్‌
  17. ఇండియన్‌ ఇన్ఫర్మేషన్‌ సర్వీస్‌

ఇవిగాక మరో ఏడు సర్వీసుల్లో ఢిల్లీ - కేంద్రపాలిత ప్రాంతాల్లో పోస్టింగ్స్ ఇస్తారు.

విద్యార్హతలు

[మార్చు]
  • గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి డిగ్రీ పాసై ఉండాలి.
  • వయస్సు: 21 నుండి 32 సంవత్సరాల లోపు ఉండాలి.
  • సడలింపులు: ఎస్.సి ఎస్.టి.లకు ఐదేళ్లు, ఒబిసిలకు మూడేళ్లు, వికలాంగులకు పదేళ్లు సడలింపు ఉంటుంది.

పరీక్ష రాయటానికి పరిమితి

[మార్చు]
  1. జనరల్‌ అభ్యర్థులు -4 సార్లు
  2. ఒబిసి అభ్యర్థులు -7సార్లు
  3. వికలాంగులు (జనరల్‌) - 7 సార్లు
  4. ఎస్.సి. ఎస్.టి. అభ్యర్థులు, ఇతర కేటగిరీకి చెందిన వికలాంగులు ఎన్నిసార్లయినా రాయవచ్చు.

అర్హతలు సివిల్స్ మెయిన్స్‌లో అర్హత సాధించిన ఐఎఎస్‌లు,

పరీక్షా విధానం

[మార్చు]

పరీక్షా విధానం: ప్రాథమిక పరీక్ష ప్రిలిమ్స్. ఇది అబ్జెక్టివ్‌ విధానంలో ఉంటుంది.

  1. పేపర్‌-1 జనరల్‌ స్టడీస్‌-150 మార్కులు
  2. పేపర్‌-2 ఆప్షనల్‌ సబ్జెక్ట్-300 మార్కులు

కింది సబ్జెక్టుల్లో ఒక దానిని ఆప్షనల్‌గా ఎంచుకోవాలి.

1. కామర్స్ 2. ఎకనామిక్స్ 3. పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌ 4. ఇండియన్‌ హిస్టరీ 5. సోషియాలజీ 6. జాగ్రఫీ 7. అగ్రికల్చర్‌ 8. యానిమల్‌ హజ్బెండరీ 9. బోటనీ 10. కెమిస్ట్రీ 11. సివిల్‌ ఇంజనీరింగ్‌ 12. ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌ 13. జియాలజీ 14. జువాలజీ 15. లా 16. మేథమేటిక్స్ 17. మెకానికల్‌ ఇంజనీరింగ్‌ 18. మెడికల్‌ సైన్సెస్‌ 19.ఫిలాసఫీ 20. ఫిజిక్స్ 21. పొలిటికల్‌ సైన్స్ 22. సైకాలజీ 23.స్టాటిస్టిక్స్ 24. జూఆలజీ

ఈ ఆబ్జెక్టివ్‌ పరీక్షలో నెగెటివ్‌ మార్కింగ్‌ ఉంది.

మూలాలు

[మార్చు]
  1. యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌
  2. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌