ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్
స్వరూపం
సంకేతాక్షరం | ఏపీపీఎస్సీ |
---|---|
స్థాపన | 1956 |
రకం | రాజ్యాంగ సంస్థ |
కేంద్రీకరణ | ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ |
ప్రధాన కార్యాలయాలు | విజయవాడ ఆంధ్రప్రదేశ్ |
కార్యస్థానం |
|
సేవా ప్రాంతాలు | ఆంధ్రప్రదేశ్ |
చైర్మన్ | దామోదర్ గౌతమ్ సవాంగ్ |
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 315 ప్రకారం స్థాపించబడిన ఒక రాజ్యాంగ సంస్థ. ఈ రాజ్యాంగ సంస్థ, ప్రభుత్వంలోని వివిధ ఉద్యోగాలకు తగిన అభ్యర్థులను ఎంపికచేయడం ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమర్థవంతంగా పనిచేయడానికి సహకరిస్తోంది. నియామకానికి తగిన నియమాలను రూపొందించడం, పదోన్నతులపై సలహా ఇవ్వడం, బదిలీలు, క్రమశిక్షణా చర్యలు మొదలైనవి ఈ సంస్థ కార్యకలాపాలు.
విధులు
[మార్చు]ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ ఉద్యోగాలకు తగిన అభ్యర్థులను ఎన్నుకోవడం కమిషన్ ప్రాథమిక విధులలో ఒకటి. కమిషన్ ముఖ్యమైన చట్టబద్ధమైన విధులు.
- ప్రత్యక్ష నియామకం
- రాష్ట్ర, సబార్డినేట్ సేవలకు సంబంధించిన చట్టబద్ధమైన నిబంధనల ఆమోదం
- ప్రత్యేక కేసులలో కారుణ్య నియామకాలకు సమ్మతి
- బదిలీ/ప్రమోషన్ ద్వారా నియామకం
- క్రమశిక్షణా కేసులు
- రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు డిపార్ట్‌మెంటల్ పరీక్షలు నిర్వహించడం
- అర్థ వార్షిక పరీక్షలు
- తాత్కాలిక నియామకాలు - కమిషన్ సమ్మతి
చైర్మన్లు
[మార్చు]- జాగర్లమూడి వీరాస్వామి
- పిన్నమనేని ఉదయ్ భాస్కర్ ( 2015 నవంబరు 27 - 2021) [1][2]
- ఏవీ రమణారెడ్డి - ఇన్‌చార్జి చైర్మన్ (2021 డిసెంబరు 21 నుండి ప్రస్తుతం) [3][4]
- దామోదర్ గౌతమ్ సవాంగ్ 2022 ఫిబ్రవరి 17 - 2024 జూన్ 3[5]
- ఏ.ఆర్. అనురాధ
మూలాలు
[మార్చు]- ↑ Sakshi (27 November 2015). "ఏపీపీఎస్సీ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన ఉదయ భాస్కర్". Archived from the original on 18 February 2022. Retrieved 18 February 2022.
- ↑ The Hindu (26 November 2015). "Uday Bhaskar new APPSC Chairman" (in Indian English). Archived from the original on 2018-06-15. Retrieved 18 February 2022.
- ↑ Andhra Jyothy (21 December 2021). "ఏపీపీఎస్సీ ఇన్‌చార్జి చైర్మన్‌గా రమణా రెడ్డి". Archived from the original on 18 February 2022. Retrieved 18 February 2022.
- ↑ Sakshi (21 December 2021). "ఏపీపీఎస్సీ ఇన్‌చార్జి చైర్మన్‌గా రమణారెడ్డి". Archived from the original on 18 February 2022. Retrieved 18 February 2022.
- ↑ Eenadu (17 February 2022). "ఏపీపీఎస్సీ ఛైర్మన్‌గా గౌతమ్ సవాంగ్". Archived from the original on 18 February 2022. Retrieved 18 February 2022.
బయటి లింకులు
[మార్చు]- ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వెబ్సైటు Archived 2022-02-18 at the Wayback Machine