Jump to content

దామోదర్ గౌతమ్ సవాంగ్

వికీపీడియా నుండి
డీజీపీ

దామోదర్ గౌతమ్ సవాంగ్

ఐ.పి.ఎస్
జననం (1963-07-10) 1963 జూలై 10 (వయసు 61)[1]
పురస్కారాలు2002, పోలీస్ మెడల్ ఫర్ మెరిటోరియస్ సర్వీస్ [2]
2003, పోలీస్ మెడల్ ఫర్ గ్యాల్లంట్రీ [3]
2005, సి ఆర్ పి ఎఫ్ డైరెక్టర్ జనరల్స్ కమెన్డేషన్ డిస్క్ [4]
2015,రాష్ట్రపతి పోలీస్ మెడల్ ఫర్ డిస్టింగులిషేడ్ సర్వీస్ [5]
Police career
విభాగముఆంధ్రప్రదేశ్ పోలీస్
దేశం1967[6] - 1973 (5th Short Service Commission of Indian Army)[6]
Years of service1986 - ప్రస్తుతం
Rankడైరెక్టర్‌ జనరల్‌ అఫ్ పోలీస్(డిజిపి)

దామోదర్ గౌతమ్‌ సవాంగ్‌ 1986 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్‌ అధికారి. ఆయన 2019 మే నుండి 2022 ఫిబ్రవరి 15 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డైరెక్టర్‌ జనరల్‌ అఫ్ పోలీస్ (డీజీపీ)గా విధులు నిర్వహించాడు. గౌతమ్‌ సవాంగ్‌ ది బెటర్ ఇండియా సంస్థ నిర్వహించిన సర్వేలో 2021 సంవత్సరానికి దేశంలోనే అత్యుత్తమ డీజీపీగా నిలిచాడు.[7][8]

జననం, విద్యాభాస్యం

[మార్చు]

గౌతమ్ సవాంగ్‌ 10 జులై 1963న జన్మించాడు. ఆయన తండ్రి ఉద్యోగ రీత్యా దేశంలో వివిధ ప్రాంతాల్లో పని చేత్యడం వల్ల గౌతమ్ సవాంగ్‌ అరుణాచల్ ప్రదేశ్, కేరళ, మేఘాలయ, లక్షద్వీప్, త్రిపుర, ఢిల్లీలో ఆయన ప్రాథమిక విద్యను పూర్తి చేసి చెన్నై లయోలా కాలేజీలో డిగ్రీ, ఢిల్లీ యూనివర్సిటీలో పీజీ పట్టా అందుకున్నాడు.

వృత్తి జీవితం

[మార్చు]

గౌతమ్ సవాంగ్‌ 1986 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్‌ అధికారి. ఆయన చిత్తూరు జిల్లా మదనపల్లె ఏఎస్పీగా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించి చిత్తూరు, వరంగల్‌ జిల్లాల్లో ఎస్పీగా పని చేశాడు. గౌతమ్ సవాంగ్‌ 2001 నుండి 2003 వరకు వరంగల్‌ రేంజి డీఐజీగా, 2003 నుండి 2004 వరకు ఎస్‌ఐబీ డీఐజీగా, 2004 నుండి 2005 వరకు ఏపీఎస్పీ పటాలం డీఐజీగా బాధ్యతలు నిర్వహించి అనంతరం కేంద్ర సర్వీసులకు డిప్యూటేషన్‌పై వెళ్లి 2005 - 2008 వరకు సీఆర్‌పీఎఫ్‌ డీఐజీగా పని చేశాడు.

గౌతమ్ సవాంగ్‌ 2008 నుండి 2009 వరకు శాంతిభద్రతల విభాగం ఐజీగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆదిలాబాద్, వరంగల్, మహబూబ్‌నగర్, కర్నూలు, చిత్తూరు జిల్లాల్లో ఏఎస్పీ, ఎస్పీగా పని చేశాడు. ఆయన 2016లో డీజీగా పదోన్నతి అందుకుని 2018 వరకు విజయవాడ పోలీస్ కమిషనర్‌గా, 2018 జులై నుంచి విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం డైరెక్టర్‌ జనరల్‌గా పని చేసి 13 ఆగష్టు 2019న ఆంధ్రప్రదేశ్ ఇన్‌ఛార్జ్ డీజీపీగా నియమితుడయ్యాడు.[9][10] ఆయనను ఫిబ్రవరి 15న జీఏడీలో రిపోర్టు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.[11]

గౌతమ్ సవాంగ్‌ 2022 ఫిబ్రవరి 17న ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) చైర్మన్‌గా నియమిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.[12] ఆయన తన పదవికి 2024 జూన్ 3న రాజీనామా చేశాడు.[13]

అవార్డ్స్

[మార్చు]

గౌతమ్ సవాంగ్‌ 2002 లో మెరిటోరియస్ సర్వీస్ కు గుర్తింపుకుగాను పోలీస్ మెడల్, 2015 లో ప్రత్యేకమైన సర్వీస్ చేసినందుకు ప్రెసిడెంట్స్ పోలీస్ మెడల్ అందుకున్నాడు.

మూలాలు

[మార్చు]
  1. Ministry of Home Affairs, Government of India. LIST OF IPS-OFFICERS WHOSE EXECUTIVE SUMMARY RECORDS ARE NOT AVAILABLE Archived 2017-03-29 at the Wayback Machine. Retrieved 2015-12-27
  2. 2002 Medals
  3. 2003 Medals
  4. CRPF will have 210 battalions by 2010, 7 March 2007
  5. "President's Police Medal for Distinguished Service" (PDF). Archived from the original (PDF) on 18 May 2015. Retrieved 26 December 2015. {{cite web}}: More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)
  6. 6.0 6.1 Sen and Sen Consultants, Our Team.[1] Archived 2019-07-05 at the Wayback Machine
  7. Sakshi (2 January 2022). "దేశంలోనే ఉత్తమ డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌". Archived from the original on 5 జనవరి 2022. Retrieved 5 January 2022.
  8. The Hindu (21 March 2021). "Sawang receives best DGP award" (in Indian English). Archived from the original on 5 జనవరి 2022. Retrieved 5 January 2022.
  9. Vaartha (13 August 2019). "డీజీపీగా గౌతమ్‌ సవాంగ్‌కు పూర్తి బాధ్యతలు". Archived from the original on 5 జనవరి 2022. Retrieved 5 January 2022.
  10. HMTV (1 June 2019). "ఏపీ డీజీపీగా గౌతమ్ సవాంగ్ బాధ్యతల స్వీకరణ". Archived from the original on 5 జనవరి 2022. Retrieved 5 January 2022.
  11. Eenadu (15 February 2022). "సవాంగ్‌ బదిలీ.. ఏపీ కొత్త డీజీపీగా కసిరెడ్డి రాజేంద్రనాథ్‌రెడ్డి." Archived from the original on 15 February 2022. Retrieved 15 February 2022.
  12. TV9 Telugu (17 February 2022). "ఏపీపీఎస్సీ కొత్త ఛైర్మన్‌గా గౌతమ్‌ సవాంగ్‌..!". Archived from the original on 17 February 2022. Retrieved 17 February 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  13. Eenadu (3 July 2024). "ఏపీపీఎస్సీ ఛైర్మన్‌ గౌతమ్‌ సవాంగ్‌ రాజీనామా". Archived from the original on 3 July 2024. Retrieved 3 July 2024.