3వ లోక్‌సభ
3వ లోక్‌సభ, (1962 ఏప్రిల్ 2 - 1967 మార్చి 3) 1962 లో జరిగిన సాధారణ ఎన్నికల ద్వారా ఏర్పడింది. భారత పార్లమెంటులో దిగువ సభ అయిన ఈ లోక్ సభలో 494 సీట్లకు ఎన్నికలు జరిగాయి. అందులో భారత జాతీయ కాంగ్రెస్ 361 సీట్లు గెలుచుకుంది.[1] 1962 భారత సార్వత్రిక ఎన్నికల తరువాత రాజ్యసభ నుండి 14 మంది సిట్టింగ్ సభ్యులు 2 వ లోక్‌సబకు ఎన్నికయ్యారు.[2]
జవహర్‌లాల్ నెహ్రూ తాను 1964 మే 27 న మరణించే వరకు 1 వ లోక్‌సభ, 2 వ లోక్‌సభలో ప్రధానమంత్రిగా ఉన్నాడు. లాల్ బహదూర్ శాస్త్రి 1964 జూన్ 9 న ప్రధాని కావడానికి ముందు గుల్జారిలాల్ నందా 13 రోజుల పాటు ప్రధానమంత్రి అయ్యాడు. 1966 జనవరి 11 న లాల్ బహదూర్ శాస్త్రి మరణించిన తరువాత నందా 13 రోజుల పాటు మళ్లీ ప్రధానమంత్రి అయ్యాడు. తరువాత ఉత్తర ప్రదేశ్ నుండి రాజ్యసభ సభ్యురాలైన ఇందిరా గాంధీ 1966 జనవరి 24 న ప్రధాని అయింది.
తరువాతి 4 వ లోక్‌సభ 1967 భారత సార్వత్రిక ఎన్నికల తరువాత 1967 మార్చి 4 న ఏర్పడింది.
ముఖ్యమైన సభ్యులు
[మార్చు]- స్పీకర్:
- సర్దార్ హుకం సింగ్ - 1962 ఏప్రిల్ 17 నుండి 1967 మార్చి 16
- డిప్యుటీ స్పీకర్:
- ఎస్. వి. కృష్ణమూర్తిరావు - 1962 ఏప్రిల్ 23 నుండి 1967 మార్చి 3
- సెక్రటరీ జనరల్:
- ఎం. ఎన్. కౌల్ - 1947 జూలై 27 నుండి 1964 సెప్టెంబరు 1
- ఎస్. ఎల్. షిక్ధర్ - 1964 సెప్టెంబరు 2 నుండి 1977 జూన్ 18 [3]
ఎన్నికైన వివిధ పార్టీల సభ్యులు
[మార్చు]3వ లోక్‌సభ
పార్టీ పేరు |
సభ్యుల సంఖ్య
(మొత్తం 494) | |
---|---|---|
భారత జాతీయ కాంగ్రెస్ | INC | 361 |
కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా | CPI | 29 |
స్వతంత్ర పార్టీ | SP | 18 |
భారతీయ జనసంఘ్ | BJS | 14 |
ప్రజా సోషలిస్టు పార్టీ | PSP | 12 |
ద్రవిడ మున్నేట్ర కఝగం | DMK | 7 |
సోషలిస్టు పార్టీ | SSP | 6 |
గణతంత్ర పరిషత్ | GP | 4 |
అకాలీ దళ్ | AD | 3 |
ఛోటా నాగపూర్ సంతల్ పరగణాస్ జనతా పార్టీ | CNSPJP | 3 |
రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా | RPI | 3 |
ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ | IUML | 2 |
అఖిల భారతీయ రామ్ రాజ్య పరిషద్ | RRP | 2 |
ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ | AIFB | 2 |
లోక్ సేవక్ సంఘ | LSS | 2 |
రివల్యూషనరీ సోషలిస్టు పార్టీ | RSP | 2 |
ఆల్ పార్టీ హిల్ లీడర్స్ కాన్ఫరెన్స్ | APHLC | 1 |
అఖిల్ భారతీయ హిందూ మహాసభ | ABHM | 1 |
హర్యానా లోక్ సమితి | HLS | 1 |
నూతన్ మహా గుజరాత్ జనతా పరిషత్ | NMGJP | 1 |
స్వతంత్రులు | - | 20 |
నామినేట్ అయిన ఆంగ్లో ఇండియన్స్ | - | 2 |
ఆంధ్రప్రదేశ్ 3వ లోక్‌సభ సభ్యులు
[మార్చు]ఆంధ్రప్రదేశ్ నుండి ఎన్నికైన 3వ లోక్‌సభ సభ్యులు ఈ జాబితాలో చూడవచ్చు
మూలాలు
[మార్చు]- ↑ "Third Lok Sabha". Lok Sabha Secretariat, New Delhi. Archived from the original on 3 జూలై 2011. Retrieved 12 జనవరి 2010.
- ↑ "RAJYA SABHA STATISTICAL INFORMATION (1952-2013)" (PDF). Rajya Sabha Secretariat, New Delhi. 2014. p. 12.
- ↑ "Third Lok Sabha". Lok Sabha Secretariat, New Delhi. Archived from the original on 2011-07-03. Retrieved 2014-02-07.