విప్ (రాజకీయాలు)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

సాధారణంగా ఒక పార్టీ తరపున గెలిచిన రాజకీయ నాయకులు ఆ పార్టీ సిద్ధాంతాలకు, నాయకత్వం తీసుకునే నిర్ణయాలకు కట్టుబడి ఉంటారు. ఎందుకంటే ఆ పార్టీ తనను నమ్మి బీఫారం ఇచ్చినందువలన అలాగే ఆ పార్టీని నమ్మినవాళ్లు ఓట్లు వేసి గెలిపించినందువలన. అయితే కొన్ని సందర్భాలలో కొందరు రాజకీయనాయకులు తమ గెలుపుకు కారణమయిన పార్టీకి కాక ప్రత్యర్థి పార్టీకి సహకరించేందుకు పూనుకుంటారు. తాను గెలిచిన పార్టీకి కాక ప్రత్యర్థి పార్టీకి సహకరించటం అన్యాయం, అక్రమం, అనైతికం కావున ఇటువంటి అనైతిక చర్యలకు పాల్పడే వారిని నిరోధించేందుకు రాజకీయపార్టీలకు చట్టం విప్ అనే రాజకీయబ్రహ్మస్త్రానిచ్చింది.

అనర్హత వేటు[మార్చు]

గెలిచిన తమ పార్టీ సభ్యులు ప్రత్యర్థి పార్టీలోకి చేరి అవతలి వర్గానికి సహకరించే అవకాశాలున్నాయని భావించినప్పుడు, అవతల పార్టీలోకి చేరకుండా ఉండేందుకు గెలిచిన తమ పార్టీ సభ్యులకు రాజకీయ పార్టీలు "విప్" ను జారీచేస్తాయి. ఈ విప్ ను ధిక్కరించి ఫిరాయించిన ఫిరాయింపుదారులపై ఆ పార్టీ అనర్హత వేటు వేస్తుంది.

స్థానిక సంస్థల ఎన్నికల్లో[మార్చు]

2001లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో విప్ అమలయ్యేలా ఎన్నికల సంఘం ఆదేశాలిచ్చింది. ఎంపీటీసీ సభ్యులుగా పోటీచేసిన వారికి ఎవరైతే బి-ఫారం ఇస్తారో వారు విప్ జారీ చేసే అవకాశం కలిగి ఉంటారని, వీరు జారీ చేసే విప్ ఆధారంగానే ఎంపిటిసి సభ్యులు ఓటేయాలని, లేని పక్షంలో వీరు సభ్యత్వం కోల్పోతారని ఎన్నికల సంఘం పేర్కొంది.

ఇవి కూడా చూడండి[మార్చు]

ఫిరాయింపు