భారత రాజ్యాంగ సవరణల జాబితా

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

భారత రాజ్యాంగపు సవరణల జాబితా

మొదటి సవరణ: 1951 ఈ సవరణ వాక్‌స్వాతంత్ర్యం పైన, వృత్తి, వ్యాపార నిర్వహణ హక్కు పైన (ఆర్టికల్ 19) కొన్ని నియంత్రణలను ప్రవేశపెట్టింది. ఈ సవరణ నియంత్రణకు సహేతుక అనే పదం చేర్చుట ద్వారా నియంత్రణలను న్యాయబద్ధం గావించింది. ఈ సవరణ చేసిన కొత్త నియంత్రణలు పౌర భద్రత, విదేశాలతో సంబంధ భాందవ్యాలకు సంబంధించినది. ఈ సవరణ ప్రకరణ 19 (6)కు వివరణ ఇస్తూ, ప్రభుత్వ పర వాణిజ్యం, జాతీయికరణంపై ప్రభుత్వానికి గల హక్కును ధృవీకరించింది. ప్రకరణలు 31A, 31B రూపేణ రెండు కొత్త అంశాలను 9వ షెడ్యూలుకు చేర్చింది. భూసంస్కరణలకు స్థిరమైన రూపునిచ్చి, వాటిని వ్యక్తిగత హక్కుల పరిధి నుంచి తొలగించింది. ప్రకరణ 15కు కొత్త క్లాజు (4)ను చేర్చి, సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడ్డ తరగతుల అభివృద్ధి కోరకు కొన్ని కొత్త అధికారాలను ప్రభుత్వం పొందింది.