9వ లోక్‌సభ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

9వ లోక్ సభ, ( 1989 డిసెంబరు 2 - 1991 మార్చి 13) 1989 లో జరిగిన సాధారణ ఎన్నికల ద్వారా ఏర్పాటుచేయబడింది. రాజ్యసభ నుండి 12 సిట్టింగ్ సభ్యులు 9వ లోక్‌సభకు ఎన్నికైనాడు. [1]

1989 డిసెంబరు 2 నుండి 1990 నవంబరు 10 వరకు భారతీయ జనతా పార్టీ, వామపక్షాల మద్దతుతో విశ్వనాథ ప్రతాప్ సింగ్ ప్రధాని అయ్యాడు. భారత జాతీయ కాంగ్రెస్ 207 సీట్లను కోల్పోయింది.

1990 నవంబరు 10 నుండి 1991 జూన్ 21 వరకు రాజీవ్ గాంధీ సారధ్యంలోని భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ బయటి నుండి మద్దతు యివ్వడం వలన చంద్రశేఖర్ ప్రధానమంత్రి అయ్యాడు.

తరువాత 10వ లోక సభ 1991 జూన్ 20 న ప్రారంభమైంది.

ముఖ్యమైన సభ్యులు[మార్చు]

ఎన్నికైన వివిధ పార్టీల సభ్యులు[మార్చు]

క్రమ సంఖ్య పార్టీ పేరు సభ్యుల సంఖ్య
1 భారత జాతీయ కాంగ్రెస్ 195
2 జనతా దళ్ (JD) 142
3 భారతీయ జనతా పార్టీ (BJP) 89
4 కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (ఎం) (CPI(M)) 34
5 కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (CPI) 12
6 ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం (AIADMK) 11
7 స్వతంత్రులు 8
8 శిరోమణి అకాలీదళ్ (SAD) 7
9 బహుజన్ సమాజ్ పార్టీ (BSP) 4
10 రివల్యూషనరీ సోషలిస్టు పార్టీ (RSP) 4
11 ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ (AIFB) 3
12 జమ్మూ & కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ (J&KNC) 3
13 జార్ఖండ్ ముక్తి మోర్చా(JMM) 3
14 శివసేన(SS) 3
15 నామినేటెడ్ సభ్యులు 3
16 ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (IUML) 2
17 తెలుగు దేశం పార్టీ (TDP) 2
18 ఎ.ఐ.ఎం.ఐ.ఎం 1
19 అఖిల్ భారతీయ హిందూ మహాసభ (ABHM) 1
20 కాంగ్రెస్ (ఎస్) 1
21 గోర్ఖా నేషనల్ లిబరేషన్ ఫ్రంట్ (GNLF) 1
22 ఇండియన్ పీపుల్స్ ఫ్రంట్ (IPF) 1
23 రళ కాంగ్రెస్ (ఎం) (KC(M)) 1
24 మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీ (MGP) 1
25 మార్కిస్టు కోఆర్డినేషన్ (MC) 1
26 సిక్కిం సంగ్రాం పరిషత్ (SSP) 1

9వ లోకసభ సభ్యులు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "RAJYA SABHA STATISTICAL INFORMATION (1952-2013)" (PDF). Rajya Sabha Secretariat, New Delhi. 2014. p. 12. Retrieved 29 August 2017.

బయటి లింకులు[మార్చు]