3వ లోక్‌సభ

వికీపీడియా నుండి
(3వ లోకసభ నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
ప్రధాని ఇందిరాగాంధీ

3వ లోక్‌సభ, (1962 ఏప్రిల్ 2 - 1967 మార్చి 3) 1962 లో జరిగిన సాధారణ ఎన్నికల ద్వారా ఏర్పడింది. భారత పార్లమెంటులో దిగువ సభ అయిన ఈ లోక్ సభలో 494 సీట్లకు ఎన్నికలు జరిగాయి. అందులో భారత జాతీయ కాంగ్రెస్ 361 సీట్లు గెలుచుకుంది.[1] 1962 భారత సార్వత్రిక ఎన్నికల తరువాత రాజ్యసభ నుండి 14 మంది సిట్టింగ్ సభ్యులు 2 వ లోక్‌సబకు ఎన్నికయ్యారు.[2]

జవహర్‌లాల్ నెహ్రూ తాను 1964 మే 27 న మరణించే వరకు 1 వ లోక్‌సభ, 2 వ లోక్‌సభలో ప్రధానమంత్రిగా ఉన్నాడు. లాల్ బహదూర్ శాస్త్రి 1964 జూన్ 9 న ప్రధాని కావడానికి ముందు గుల్జారిలాల్ నందా 13 రోజుల పాటు ప్రధానమంత్రి అయ్యాడు. 1966 జనవరి 11 న లాల్ బహదూర్ శాస్త్రి మరణించిన తరువాత నందా 13 రోజుల పాటు మళ్లీ ప్రధానమంత్రి అయ్యాడు. తరువాత ఉత్తర ప్రదేశ్ నుండి రాజ్యసభ సభ్యురాలైన ఇందిరా గాంధీ 1966 జనవరి 24 న ప్రధాని అయింది.

తరువాతి 4 వ లోక్‌సభ 1967 భారత సార్వత్రిక ఎన్నికల తరువాత 1967 మార్చి 4 న ఏర్పడింది.

ముఖ్యమైన సభ్యులు[మార్చు]

ఎన్నికైన వివిధ పార్టీల సభ్యులు[మార్చు]

3వ లోక్‌సభ

పార్టీ పేరు

సభ్యుల సంఖ్య

(మొత్తం 494)

భారత జాతీయ కాంగ్రెస్ INC 361
కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా CPI 29
స్వతంత్ర పార్టీ SP 18
భారతీయ జనసంఘ్ BJS 14
ప్రజా సోషలిస్టు పార్టీ PSP 12
ద్రవిడ మున్నేట్ర కఝగం DMK 7
సోషలిస్టు పార్టీ SSP 6
గణతంత్ర పరిషత్ GP 4
అకాలీ దళ్ AD 3
ఛోటా నాగపూర్ సంతల్ పరగణాస్ జనతా పార్టీ CNSPJP 3
రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా RPI 3
ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ IUML 2
అఖిల భారతీయ రామ్‌ రాజ్య పరిషద్ RRP 2
ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ AIFB 2
లోక్ సేవక్ సంఘ LSS 2
రివల్యూషనరీ సోషలిస్టు పార్టీ RSP 2
ఆల్ పార్టీ హిల్ లీడర్స్ కాన్ఫరెన్స్ APHLC 1
అఖిల్ భారతీయ హిందూ మహాసభ ABHM 1
హర్యానా లోక్ సమితి HLS 1
నూతన్ మహా గుజరాత్ జనతా పరిషత్ NMGJP 1
స్వతంత్రులు - 20
నామినేట్ అయిన ఆంగ్లో ఇండియన్స్ - 2

ఆంధ్రప్రదేశ్ 3వ లోక్‌సభ సభ్యులు[మార్చు]

ఆంధ్రప్రదేశ్ నుండి ఎన్నికైన 3వ లోక్‌సభ సభ్యులు ఈ జాబితాలో చూడవచ్చు

మూలాలు[మార్చు]

  1. "Third Lok Sabha". Lok Sabha Secretariat, New Delhi. Archived from the original on 3 జూలై 2011. Retrieved 12 జనవరి 2010.
  2. "RAJYA SABHA STATISTICAL INFORMATION (1952-2013)" (PDF). Rajya Sabha Secretariat, New Delhi. 2014. p. 12.
  3. "Third Lok Sabha". Lok Sabha Secretariat, New Delhi. Archived from the original on 2011-07-03. Retrieved 2014-02-07.

బాహ్య లంకెలు[మార్చు]