2004 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఆంధ్రప్రదేశ్ శాసనసభ
ఎన్నికలు 2004
India
1999 ←
→ 2009
మొత్తం 294 ఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజకవర్గాలన్నీ

2004 సంవత్సరంలో జరిగిన ఆంధ్ర ప్రదేశ్ శాసన సభ ఎన్నికలలో రాష్ట్రంలో అంతకు ముందున్న 9 సంవత్సరాలు అధికారంలో ఉన్న తెలుగు దేశం పార్టీ పరాజయాన్ని చవిచూడింది. ఎన్నికల అనంతరం డా. వై.ఎస్. రాజశేఖరరెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది.

ఈ ఎన్నికల పోలింగ్‌ రెండు దశల్లో ఏప్రిల్‌ 20, 26 తేదీల్లో జరిగింది. భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ రాష్ట్ర సమితి, కమ్యూనిస్టులు, మజ్లిస్ పార్టీలు ఎన్నికలలో పొత్తులు పెట్టుకొని ఒక కూటమిగా ఏర్పడ్డారు. తెలుగు దేశం, బి.జె.పి. పార్టీలు ఒక కూటమిగా పోటీ చేశారు.

పార్టీల వారీగా ఫలితాలు[మార్చు]

ఆంధ్రప్రదేశ్
పార్టీ పోటీ చేసిన ఆభ్యర్ధులు గెలిచిన వారు వోట్లు %
భారతీయ జనతా పార్టీ 27 2 942008 2,63%
బహుజన సమాజ్ పార్టీ 160 1 440719 1,23%
భారతీయ కమ్యూనిస్టు పార్టీ 12 6 545867 1.53%
భారతీయ కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) 14 9 656721 1,84%
భారత జాతీయ కాంగ్రెస్ 234 185 13793461 38,56%
తెలుగు దేశం పార్టీ 267 47 13444168 37,59%
భారతీయ కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు-లెనినిస్టు) విమోచన 11 0 66997 0,19%
జనతా దళ్ (సెక్యులర్) 5 0 3864 0,01%
ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ 2 0 5371 0,02%
రాష్ట్రీయ జనతాదళ్ 8 0 2725 0,01%
సమాజవాది పార్టీ 19 1 95416 0,27%
అఖిల భారతీయ జనసంఘ్ 4 0 3792 0,01%
ఆల్ ఇండియా మజ్లిస్ ఎ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ 7 4 375165 1,05%
అంబేద్కర్ నేషనల్ కాంగ్రెస్ 5 0 6573 0,02%
వెనుకబడిన కులాల ఐక్యవేదిక 7 0 3652 0,01%
బహుజన్ రిపబ్లికన్ పార్టీ 9 0 10576 0,03%
భారతీయ రాష్ట్రవాది పక్షం 1 0 542 0,00%
బహుజన్ సమాజ పార్టీ (అంబేద్కర్) 1 0 2339 0,01%
భారతీయ జస్టిస్ పార్టీ 2 0 1361 0,00%
జనతా పార్టీ 37 2 306347 0,86%
లోకజనశక్తి పార్టీ 4 0 21550 0,06%
మజ్లిస్ బచావో తెహరీక్ 7 0 70285 0,20%
మార్క్సిస్టు కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా 16 0 23373 0,06%
ముదిరాజ్ రాష్ట్రీయ సమితి 5 0 10606 0,03%
ఎన్.టి.ఆర్. తెలుగుదేశం పార్టీ (లక్ష్మీపార్వతి) 18 0 7857 0,02%
ప్రజా పర్టీ 8 0 4439 0,01%
పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా 65 0 115187 0,32%
పీపుల్స్ రిపబ్లికన్ పార్టీ 1 0 1515 0,00%
రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ (సెక్యులర్) 1 0 1037 0,00%
రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా 3 0 1523 0,00%
రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (అథావలె) 1 0 956 0,00%
రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (ఖొబ్రగడె) 5 0 6031 0,02%
సమాజవాది జనతా పార్టీ (రాష్ట్రీయ) 1 0 1991 0,01%
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ 1 0 52161 0,15%
తెలంగాణ ప్రజా పార్టీ 2 0 1083 0,00%
తెలంగాణ రాష్ట్ర సమితి 54 26 2390940 6,68%
స్వతంత్ర అభ్యర్థులు 872 11 2349436 6,57%
మొత్తం: 1896 294 35767634

గెలిచినవారిలో ఒకరి "సి.పి.ఐ. ఎమ్-ఎల్., న్యూ డెమోక్రసీ"కి చెందిన అభ్యర్ధి.

కొన్ని గణాంకాలు[మార్చు]

ఎన్నికలలో పాల్గొన్న పార్టీలు[మార్చు]

  • జాతీయ పార్టీలు
    • భారతీయ జనతా పార్టీ
    • బహుజన సమాజ పార్టీ
    • భారతీయ కమ్యూనిస్టు పార్టీ (సి.పి.ఐ.)
    • భారతీయ కమ్యూనిస్టు పార్టీ (సి.పి.ఎమ్.)
    • భారత జాతీయ కాంగ్రెస్
  • రాష్ట్ర పార్టీలు
    • తెలుగు దేశం పార్టీ
    • తెలంగాణ కాంగ్రెస్ పార్టీ (రిజిష్టర్ కానిది)
    • తెలంగాణ రాష్ట్ర సమితి (రిజిష్టర్ కానిది)
    • తెలంగాణ ప్రజా పార్టీ (రిజిష్టర్ కానిది)
    • మజ్లిస్
    • మజ్లిస్ బచావో తెహరీక్

ఈ పార్టీల అభ్యర్ధులే కాకుండా అనేక స్వతంత్ర అభ్యర్ధులు ఎన్నికల రంగంలో ఉన్నారు.

నియోజక వర్గ లెక్కలు[మార్చు]

మొత్తం నియోజక వర్గాలు 294
సాధారణ 240
యస్.సీ. 39
యస్.టీ. 15

నియోజక వర్గం Vs అభ్యర్థుల సంఖ్య[మార్చు]

ఏకగ్రీవం 0
ఇద్దరు పోటీపడిన నియోజక వర్గాలు 14
ముగ్గురు పోటీపడిన నియాజక వర్గాలు 19
నలుగురు పోటీపడిన నియోజక వర్గాలు 47
ఐదుగురు పోటీపడిన నియోజక వర్గాలు 53
ఆరు నుండి పది మంది పోటీపడిన నియోజక వర్గాలు 129
పదకొండు నుండి పదయిదు మంది పోటీ పడ్డ నియోజక వర్గాలు 29
పదిహేను లేదా ఆ పైన 3
  • మొత్తం పోటీపడ్డ అభ్యర్థులు - 1896
  • సరాసరి ఒక్కో నియోజక వర్గానికి - 6 చొప్పున
  • ఏదేనీ నియోజక వర్గంలో గరిష్ఠ అభ్యర్థుల సంఖ్య - 16

ఓటర్ల వివరాలు[మార్చు]

మూలాలు[మార్చు]

వెలుపలి లంకెలు[మార్చు]