వి.భాస్కర సాయికృష్ణ యాచేంద్ర

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వి.భాస్కర సాయికృష్ణ యాచేంద్ర

శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ ఛైర్మన్‌
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2020 - 2022

ఎమ్మెల్యే
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
1994 -1999
ముందు నేదురుమల్లి జనార్ధనరెడ్డి
తరువాత నేదురుమల్లి రాజ్యలక్ష్మి
నియోజకవర్గం వెంకటగిరి

ఎమ్మెల్యే
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
1983 - 1984
ముందు నల్లారెడ్డి చంద్రశేఖర రెడ్డి
తరువాత నేదురుమల్లి జనార్ధనరెడ్డి
నియోజకవర్గం వెంకటగిరి

వ్యక్తిగత వివరాలు

జననం 1950
నెల్లూరు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
జాతీయత  భారతదేశం
రాజకీయ పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ

వెలుగోటి భాస్కర సాయికృష్ణ యాచేంద్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన రెండుసార్లు వెంకటగిరి శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికై ఆ తరువాత తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ (ఎస్‌విబిసి) ఛైర్మన్‌గా పని చేశాడు.[1]

రాజకీయ జీవితం

[మార్చు]

భాస్కర సాయికృష్ణ యాచేంద్ర నందమూరి తారకరామారావు పిలుపుమేరకు రాజకీయాల్లోకి వచ్చిన సాయికృష్ణ యాచేంద్ర 1985లో వెంకటగిరి శాసనసభ నియోజకవర్గం నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప కాంగ్రెస్ అభ్యర్ధి బాలకృష్ణా రెడ్డిపై 28822 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన ఆ తరువాత 1994లో జరిగిన ఎన్నికలలో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి మాజీ ముఖ్యమంత్రి ఎన్. జనార్దన్ రెడ్డిని 16996 ఓట్ల మెజారిటీతో ఓడించాడు. భాస్కర సాయికృష్ణ యాచేంద్ర ఆ తరువాత క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉంటూ ఆ తరువాత 2019 ఎన్నికల ముందు టీడీపీ పార్టీతో విభేదించి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరి 2020లో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నడిచే శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్‌ (SVBC) ఛైర్మన్‌గా నియమితుడయ్యాడు.[2][3][4]

మూలాలు

[మార్చు]
  1. Eenadu (29 October 2020). "ఎస్వీబీసీ ఛైర్మన్‌గా సాయికృష్ణ యాచేంద్ర". Archived from the original on 8 July 2024. Retrieved 8 July 2024.
  2. "ఎస్వీబీసీ ఛైర్మన్‌గా సాయికృష్ణ". 28 October 2020. Archived from the original on 8 July 2024. Retrieved 8 July 2024.
  3. The New Indian Express (29 October 2020). "VB Sai Krishna Yachendra appointed SVBC chairman" (in ఇంగ్లీష్). Archived from the original on 8 July 2024. Retrieved 8 July 2024.
  4. "A powerhouse of talent" (in ఇంగ్లీష్). 2 April 2018. Archived from the original on 8 July 2024. Retrieved 8 July 2024.