Jump to content

చిక్కాల రామచంద్రరావు

వికీపీడియా నుండి
చిక్కాల రామచంద్రరావు

ఎమ్మెల్సీ
పదవీ కాలం
2017  2023
నియోజకవర్గం తూర్పు గోదావరి జిల్లా స్థానిక సంస్థల కోటా

ఎమ్మెల్యే
పదవీ కాలం
1983  2004
నియోజకవర్గం తాళ్ళరేవు

వ్యక్తిగత వివరాలు

జననం (1949-03-17) 1949 మార్చి 17 (వయసు: 77)
సిరిపురం, కరప మండలం, తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ
తల్లిదండ్రులు తిరపయ్య & వీర రాఘవమ్మ
జీవిత భాగస్వామి సుబ్బలక్ష్మి

చిక్కాల రామచంద్రరావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన తాళ్ళరేవు నుండి 5సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై, రెండు సార్లు మంత్రిగా పనిచేసి, 2017లో ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ఎన్నికల్లో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యాడు.[1]

రాజకీయ జీవితం

[మార్చు]

చిక్కాల రామచంద్రరావు తాళ్ళరేవు నియోజకవర్గం నుండి వరకు వరుసగా ఐదు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై, రెండు సార్లు మంత్రిగా పనిచేశాడు. ఆయన 2012లో రామచంద్రాపురం నియోజకవర్గంకు జరిగిన ఉప ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసి ఓడిపోయాడు. ఆయన 2017లో ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసి తూర్పు గోదావరి జిల్లా స్థానిక సంస్థల కోటా నుండి ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు.[2]

మూలాలు

[మార్చు]
  1. Sakshi (3 March 2017). "ఎమ్మెల్సీగా చిక్కాల ఏకగ్రీవం". Archived from the original on 31 March 2022. Retrieved 31 March 2022.
  2. Andhra Jyothy (28 January 2022). "అభివృద్ధి బడ్జెట్‌ లెక్కలవరకేనా." (in ఇంగ్లీష్). Retrieved 31 March 2022. {{cite news}}: |archive-date= requires |archive-url= (help)