ఆంధ్రప్రదేశ్ శాసనమండలి
ఆంధ్రప్రదేశ్ శాసనమండలి | |
---|---|
రకం | |
రకం | ఆంధ్రప్రదేశ్ శాసనవ్యవస్థ ఎగువ సభ |
నాయకత్వం | |
అధ్యక్షుడు | |
ఉపాధ్యక్షడు | రెడ్డి సుబ్రమణ్యం, TDP |
అధికారపక్ష నాయకుడు | |
ప్రతిపక్ష నాయకుడు | |
నిర్మాణం | |
సీట్లు | 58 |
![]() | |
రాజకీయ వర్గాలు | (as on 11/06/2019) TDP(తెదెపా): 29 seats YSRCP(వైకాపా): 6 seats BJP(భాజాపా): 2 seats PDF(పిడిఎఫ్): 3 seats INDP(స్వతంత్ర): 5 seats Nom: 8 seats Vacant(ఖాళీ): 5 seats
|
ఎన్నికలు | |
ఓటింగ్ విధానం | Single transferable vote |
సమావేశ స్థలం | |
![]() | |
Interim Legislative Building Amaravati |
ఆంధ్రప్రదేశ్ శాసనమండలి (ఆంధ్ర ప్రదేశ్ విధాన పరిషత్) భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ శాసన వ్యవస్థలోని సభలలో ఎగువ సభ. ఇది ప్రస్తుత రాజధాని అమరావతిలో 58 మంది సభ్యులతో ఉంది.[1] విధాన పరిషత్తు 1958 నుండి 1985, 2007 నుండి ప్రస్తుతం వరకు రెండు పర్యాయాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది.
చరిత్ర[మార్చు]
భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒకే సభ ఉన్న పార్లమెంటరీ వ్యవస్థలో పనిచేసింది. 1956 డిసెంబరు 5 న ఆంధ్రప్రదేశ్ విధాన సభ శాసనమండలి ఏర్పాటు చేయుటకు తీర్మానం చేసింది. ఈ వ్యవస్థ మూలంగా రెండు సభలు ఉంటాయి.[2] అధికారికంగా విధాన పరిషత్తు 1958 జూలై 1 న ప్రారంభించబడింది. ఈ ఏర్పాటు భారత రాజ్యాంగంలోని 168 అధికరణం మూలంగా జరిగింది. 1968 జూలై 8 న అప్పటి భారత రాష్ట్రపతి డా. రాజేంద్రప్రసాద్ ప్రారంభోత్సవం చేసాడు.[2]
నిర్మూలన[మార్చు]
1980 వ దశకంలో, ఎగువ సభలను రద్దు చేయాలని కోరే రాష్ట్రాలలో మొదటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ అవతరించింది. ఇది అనవసరమైనది, జనాభాలో ప్రాతినిధ్యం లేనిది, రాష్ట్ర బడ్జెట్ పై ఒక భారం, చట్టం ఆమోదించడంలో జాప్యాలు కలిగించడం వంటి కారణాల వల్ల విమర్శించబడింది.[2][3][4][5] ఏదేమైనా అప్పటి పాలక పార్టీ తెలుగుదేశం రాజకీయ ప్రతిపక్షమైన భారత జాతీయ కాంగ్రెస్కు శాసన మండలిలో ఎక్కువ సీట్లు ఉండటంవల్ల చట్టాన్ని ఆలస్యం చేసినందువలన తాత్సారం అయినది.[5]
ఆంధ్రప్రదేశ్ విధానసభ ఆమోదించిన తీర్మానం ప్రకారం, భారత పార్లమెంటు 1985 లో ఆంధ్రప్రదేశ్ శాసన మండలి (నిర్మూలన) చట్టం ద్వారా విధాన పరిషత్‌ను రద్దు చేసింది. ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన రాష్ట్ర ఎన్నికలలో కాంగ్రెస్ (ఐ) పార్టీ ఓటమి పాలయ్యింది.[2][5]
పునరుజ్జీవనము[మార్చు]
1989 లో రాష్ట్ర ఎన్నికలలో గెలిచిన కాంగ్రెస్ (ఐ) కు చెందిన ముఖ్యమంత్రి డాక్టర్ మర్రి చెన్నారెడ్డిలో శాసన మండలిని పునరుద్ధరించడానికి తదుపరి ప్రయత్నాలు ప్రారంభించాడు.[2][5] శాసన మండలిని పునరుద్ధరించడానికి ఒక తీర్మానం 1990 జనవరి 22 న విధానసభలో ఆమోదించబడింది.[2]
1990 మే 28 న రాష్ట్ర విధానసభ తీర్మానం ప్రకారం, భారత పార్లమెంటు ఎగువ సభ (రాజ్యసభ)లో శాసన మండలి యొక్క పునరుద్ధరణకు అధికారమిచ్చిన శాసనం ఆమోదం పొందింది కానీ ప్రధానంగా దాని యొక్క ఐదు సంవత్సరాల కాలానికి ముందు 1991 లో రద్దు చేయబడిన కారణంగా లోక్‌సభలో నిలిచిపోయింది.[2] తరువాత వచ్చిన లోక్‌సభలు (1991–1996, 1996–1998, 1998–2004) ఈ విషయంపై ఎలాంటి చర్య తీసుకోలేదు.
2004 రాష్ట్ర ఎన్నికలలో విజయం సాధించిన తరువాత, కాంగ్రెస్ నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ శాసన సభ జూలై 8, 2004 న శాసన మండలి పునరుద్ధరణకు మరొక తీర్మానాన్ని ఆమోదించింది.[2] ఇది 2004 డిసెంబరు 16 న ఆంధ్రప్రదేశ్ కౌన్సిల్ బిల్‌గా లోక్‌సభలో ప్రవేశపెట్టబడింది. 2006 డిసెంబరు 15 న లోక్‌సభ శాసనసభ ఆమోదించింది, డిసెంబరు 20 న రాజ్యసభ త్వరగా ఆమోదించబడింది, 2007 జనవరి 10 న రాష్ట్రపతి ఆమోదం పొందింది.[2] నూతనంగా పునరుద్ధరించబడిన శాసన మండలి 2007 మార్చి 30 న ఏర్పాటు చేయబడింది, ఏప్రిల్ 2 న అప్పటి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ రామేశ్వర్ ఠాకూర్ చేత ప్రారంభించబడింది.[2]
హోదా , ప్రస్తుత సభ్యులు[మార్చు]
కౌన్సిల్ చేత ఎన్నుకోబడిన చైర్‌పర్సన్, కౌన్సిల్ యొక్క సెషన్లకు అధ్యక్షత వహిస్తారు. చైర్‌పర్సన్ అందుబాటులోకి లేని సమయంలో సభను నిర్వహించడానికి డిప్యూటీ చైర్‌పర్సన్ ను కూడా ఎన్నుకుంటారు. ప్రస్తుత అధికార పదవులు ఇలా ఉంటాయి.
సభ్యత్వం , పదవీకాలం[మార్చు]
శాసన మండలి శాశ్వత సభ. ఇది రద్దు చేయబడదు.[2] ఇందులో ఆరు సంవత్సరాల కాలానికి 58 మంది సభ్యులు ఉంటారు. అందులో 1/3 వంతు మంది ప్రతీ రెండు సంవత్సరాలకు రొటేషన్ పద్ధతిలో ఎన్నికవుతారు.[2] శాసనమండలి సభ్యుడు కాదలచిన వ్యక్తి భారత పౌరుడై ఉండాలి. కనీసం 30 ఏళ్ళ వయసు ఉండాలి. మానసికంగా ఆరోగ్యవంతుడై ఉండాలి. అతడు ఆంధ్రప్రదేశ్ లో ఓటు హక్కు కలిగి ఉండాలి. అతడు/ఆమె అదే కాలంలో పార్లమెంటు సభ్యునిగా ఉండరాదు. ఆంధ్రప్రదేశ్ గవర్నరు ద్వారా 8 మంది సభ్యులు నామినేట్ చేయబడతారు. 40 మంది సభ్యులు అసెంబ్లీ, స్థానిక సంస్థల ఎలక్టోరల్ కొలేజ్ ద్వారా ఎన్నుకొబడతారు. మిగిలిన 10 మంది సభ్యులు కళాశాల గ్రాడ్యుయేట్లు, ఉపాధ్యాయుల నుండి ఎన్నుకోబడతారు.[6]
శాసన మండలి సభ్యులు[మార్చు]
నియోజకవర్గం | సీటు సంఖ్య | జిల్లా | విజేత | ఎన్నికైన పార్టీ | కాలం |
---|---|---|---|---|---|
పట్టభద్రులు | 01 | పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి | కె.రవికిరణ్ వర్మ | స్వతంత్ర | 2013 - 2019 |
02 | కృష్ణా జిల్లా, గుంటూరు | బొద్దు నాగేశ్వరరావు | పి.డి.ఎఫ్ | 2013 - 2019 | |
03 | శ్రీకాకుళం జిల్లా, విజయనగరం, విశాఖపట్నం | పి.వి.ఎన్.మాధవ్ | బి.జె.పి | 2017 - 2023 | |
04 | ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు | యండపల్లి శ్రీనివాసులరెడ్డి | పి.డి.ఎఫ్ | 2017 - 2023 | |
05 | అనంతపురం, కర్నూలు, కడప | వెన్నపూస గోపాలరెడ్డి | వై.ఎస్.ఆర్.కా.పా | 2017 - 2023 | |
ఉపాధ్యాయులు | 06 | శ్రీకాకుళం జిల్లా, విజయనగరం, విశాఖపట్నం | పాకలపాటి రఘువర్మ | ఎ పి టి ఫ్ 257 | 2019 - 2025 |
07 | పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి | రాము సూర్యారావు | పి.డి.ఎఫ్ | 2015 - 2021 | |
08 | కృష్ణా జిల్లా, గుంటూరు | డా.ఎ.ఎస్.రామకృష్ణ | స్వతంత్ర | 2015 - 2021 | |
06 | ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు | విటపు బాలసుబ్రహ్మణ్యం | పి.డి.ఎఫ్ | 2017 - 2023 | |
10 | అనంతపురం, కర్నూలు, కడప | కత్తి నరసింహారెడ్డి | స్వతంత్ర | 2017 - 2021 | |
స్థానిక సంస్థలు | 11 | అనంతపురం | పయ్యావుల కేశవ్ | తె.దే.పా | 2015 - 2021 |
12 | చిత్తూరు | 07.02.2018 నుండి ఖాళీ
గాలి ముద్దుకృష్ణమ నాయుడు మరణం తరువాత |
- | 2015 - 2021 | |
13 | తూర్పు గోదావరి | రెడ్డి సుబ్రహ్మణ్యం | తె.దే.పా | 2015 - 2021 | |
14 | గుంటూరు | అన్నం సతీష్ ప్రభాకర్ | తె.దే.పా | 2015 - 2021 | |
15 | కృష్ణా | యై.వి.బాపు రాజేంద్రప్రసాద్ | తె.దే.పా | 2015 - 2021 | |
16 | కృష్ణా | బుద్దా వెంకటేశ్వరరావు | తె.దే.పా | 2015 - 2021 | |
17 | ప్రకాశం | మాగుంట శ్రీనివాసులరెడ్డి | తె.దే.పా | 2015 - 2021 | |
18 | విశాఖపట్నం | డా.ఎం.వి.వి.ఎస్. మూర్తి | తె.దే.పా | 2015 - 2021 | |
19 | విజయనగరం | ద్వారపురెడ్డి జగదీశ్వరరావు | తె.దే.పా | 2015 - 2021 | |
20 | విజయనగరం | పప్పల చలపతిరావు | తె.దే.పా | 2015 - 2021 | |
21 | పశ్చిమ గోదావరి | అంగర రామమోహన్ | తె.దే.పా | 2015 - 2021 | |
22 | అనంతపురం | గూనపాటి దీపక్‌రెడ్డి | తె.దే.పా (సస్పెండ్) | 2017 - 2023 | |
23 | చిత్తూరు | బి.ఎన్.రాజసింహులు | తె.దే.పా | 2017 - 2023 | |
24 | తూర్పు గోదావరి | చిక్కాల రామచంద్రరావు | తె.దే.పా | 2017 - 2023 | |
25 | గుంటూరు | డా.ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు | వై.ఎస్.ఆర్.కా.పా | 2017 - 2023 | |
26 | కడప | మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి | తె.దే.పా | 2017 - 2023 | |
27 | కర్నూలు | కె.ఇ.ప్రభాకర్ [7] | - | 01.01.2018 - 01.05.2023 | |
28 | నెల్లూరు | వాకాటి నారాయణరెడ్డి | తె.దే.పా (సస్పెండ్) | 2017 - 2023 | |
29 | శ్రీకాకుళం | శత్రుచర్ల విజయరామరాజు | తె.దే.పా | 2017 - 2023 | |
30 | పశ్చిమ గోదావరి | మంతెన వెంకట సత్యనారాయణ రాజు | తె.దే.పా | 2017 - 2023 | |
శాసనసభ్యులు | 31 | --- | యనమల రామకృష్ణుడు | తె.దే.పా | 2019 - 2025 |
32 | --- | పి.శమంతకమణి | తె.దే.పా | 2013 - 2019 | |
33 | --- | డా. పి.నారాయణ | తె.దే.పా | 2013 - 2019 | |
34 | --- | అంగూరి లక్ష్మీ శివకుమారి | తె.దే.పా* | 2013 - 2019 | |
35 | --- | ఆదిరెడ్డి అప్పారావు | తె.దే.పా* | 2013 - 2019 | |
36 | --- | దేవసాని చిన్నగోవిందరెడ్డి | వై.ఎస్.ఆర్.కా.పా | 2015 - 2021 | |
37 | --- | కోలగట్ల వీరభద్రస్వామి | వై.ఎస్.ఆర్.కా.పా | 2015 - 2021 | |
38 | --- | పిల్లి సుభాష్‌చంద్రబోస్ | వై.ఎస్.ఆర్.కా.పా | 2015 - 2021 | |
39 | --- | గుండులల త్రిప్పెస్వామి | తె.దే.పా | 2015 - 2021 | |
40 | --- | సంధ్యారాణి | తె.దే.పా | 2015 - 2021 | |
41 | --- | వట్టికూటి వీర వెంకన్న చౌదరి | తె.దే.పా | 2015 - 2021 | |
42 | --- | షరీఫ్హ్ అహ్మద్ మహ్మద్ | తె.దే.పా | 2015 - 2021 | |
43 | --- | సోము వీర్రాజు | బి.జె.పి | 2015 - 2021 | |
44 | --- | నారా లోకేశ్ | తె.దే.పా | 2017 - 2023 | |
45 | --- | గంగుల ప్రభాకరరెడ్డి | వై.ఎస్.ఆర్.కా.పా | 2017 - 2023 | |
46 | --- | ఆళ్ల నాని | వై.ఎస్.ఆర్.కా.పా | 2017 - 2023 | |
47 | --- | కరణం బలరామకృష్ణమూర్తి | తె.దే.పా | 2017 - 2023 | |
48 | --- | పోతుల సునీత | తె.దే.పా | 2017 - 2023 | |
49 | --- | బచ్చుల అర్జునుడు | తె.దే.పా | 2017 - 2023 | |
50 | --- | డొక్కా మాణిక్యవరప్రసాద్ | తె.దే.పా | 2017 - 2023 | |
నామినేటెడ్ | 51 | --- | కె.సత్యనారాయణరాజు | బి.జె.పి | 2014 - 2020 |
52 | --- | టి.రత్నాబాయి | కాంగ్రెస్ పార్టీ | 2014 - 2020 | |
53 | --- | సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి | తె.దే.పా | 2015 - 2021 | |
54 | --- | గౌనివారి శ్రీనివాసులు | తె.దే.పా | 2015 - 2021 | |
55 | --- | బీడ రవిచంద్ర | తె.దే.పా | 2015 - 2021 | |
56 | --- | టి.డి.జనార్థన్ | తె.దే.పా | 2015 - 2021 | |
57 | --- | ఎన్.ఎం.డి. ఫరూఖ్ | తె.దే.పా | 2017 - 2023 | |
58 | --- | పొన్నపురెడ్డి రామసుబ్బారెడ్డి | తె.దే.పా | 2017 - 2023 |
ఇవికూడా చూడండి[మార్చు]
మూలాలు[మార్చు]
- ↑ "legislative council, Andhrapradesh". AP Government. Retrieved 11 June 2019.
- ↑ 2.00 2.01 2.02 2.03 2.04 2.05 2.06 2.07 2.08 2.09 2.10 2.11 "Andhra Pradesh Legislative Council History". National Informatics Centre. Retrieved 2010-09-03.
- ↑ Sharma. Introduction to the Constitution of India, Fifth Edition. PHI Learning Pvt. Ltd. pp. 212–13. ISBN 978-81-203-3674-2.
- ↑ Laxmikanth. Indian Polity For UPSC 3E. Tata McGraw-Hill. pp. 27–1. ISBN 978-0-07-015316-5.
- ↑ 5.0 5.1 5.2 5.3 Agarala Easwara Reddy (1994). State politics in India: reflections on Andhra Pradesh. M.D. Publications Pvt. Ltd. pp. 97–110. ISBN 978-81-85880-51-8.
- ↑ TMH General Knowledge Manual. Tata McGraw. 2007. p. 176. ISBN 978-0-07-061999-9.
- ↑ http://indiatoday.intoday.in/story/tdps-prabhakar-elected-unopposed-to-ap-legislative-council/1/1120163.html