చంద్రగిరి ఏసురత్నం
చంద్రగిరి ఏసురత్నం | |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 30 మార్చి 2023 - 29 మార్చి 2029 | |||
నియోజకవర్గం | ఎమ్మెల్యే కోటా | ||
---|---|---|---|
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 1959 సెప్టెంబర్ 1 గురజాల, గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం | ||
రాజకీయ పార్టీ | యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ (వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ) | ||
తల్లిదండ్రులు | ప్రేమయ్య, బాయమ్మ | ||
జీవిత భాగస్వామి | చంద్రగిరి కరుణకుమారి | ||
సంతానం | సృజన | ||
వృత్తి | రాజకీయ నాయకుడు , మాజీ పోలీస్ అధికారి |
చంద్రగిరి ఏసురత్నం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఆంధ్రప్రదేశ్ శాసనమండలికి 2023 మార్చిలో జరిగిన ఎన్నికలకు ఎమ్మెల్యే కోటా నుండి వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా 2023 ఫిబ్రవరి 20న పార్టీ ప్రకటించింది.[1]
జననం, విద్యాభాస్యం
[మార్చు]చంద్రగిరి ఏసురత్నం 1959లో జన్మించి గురజాలలో పాఠశాల విద్య అభ్యసించిన తర్వాత ఆంధ్రా క్రిస్టియన్ కాలేజీ గుంటూరులో బీఏ, ఉస్మా నియా యూనివర్సిటీ నుంచి పోస్టుగాడ్యుయేషన్ పూర్తి చేశాడు.
వృత్తి జీవితం
[మార్చు]చంద్రగిరి ఏసురత్నం 1982లో ఎస్ఐగా కర్నూలు జిల్లాలో చేరి అనంతరం అప్పటి ముఖ్యమంత్రులకు సెక్యూరిటీ అధికారిగా, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ డీఎస్పీగా, అదనపు ఎస్పీ, ఎస్పీగా బాధ్యతలు నిర్వహించి 2018లో డీఐజీగా స్వచ్ఛంద ఉద్యోగ విరమణ చేశాడు.
రాజకీయ జీవితం
[మార్చు]చంద్రగిరి ఏసురత్నం పోలీసుశాఖలో డీఐజీ ఉన్న ఆయన తన పదవికి వీఆర్‌ఎస్ తీసుకొని 2019 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరి గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయాడు. ఆయన అనంతరం నియోజకవర్గ ఇన్‌చార్జిగా పనిచేస్తున్న ఆయనకు 2020లో గుంటూరు మార్కెట్‌యార్డు ఛైర్మన్‌గా నియమితుడయ్యాడు.[2] ఆయన ఆంధ్రప్రదేశ్ శాసనమండలికి 2023 మార్చిలో జరిగిన ఎన్నికలకు ఎమ్మెల్యే కోటా నుండి వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా 2023 ఫిబ్రవరి 20న పార్టీ ప్రకటించగా[3][4] ఆయన ఎమ్మెల్సీగా గెలిచాడు.[5][6]
మూలాలు
[మార్చు]- ↑ Andhra Jyothy (20 February 2023). "వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటన! లిస్ట్ ఇదే." Archived from the original on 21 February 2023. Retrieved 21 February 2023.
- ↑ HMTV (27 January 2020). "గుంటూరు మిర్చి యార్డు చైర్మన్ గా ఏసురత్నం". Archived from the original on 25 February 2023. Retrieved 25 February 2023.
- ↑ Prajasakti (20 February 2023). "ఎమ్మెల్సీలుగా చంద్రగిరి, మర్రి" (in ఇంగ్లీష్). Archived from the original on 25 February 2023. Retrieved 25 February 2023.
- ↑ Andhra Jyothy (21 February 2023). "మండలికి ముగ్గురు". Archived from the original on 10 March 2023. Retrieved 10 March 2023.
- ↑ Prajasakti (24 March 2023). "ఎమ్మెల్సీలుగా ఏసురత్నం, రాజశేఖర్" (in ఇంగ్లీష్). Archived from the original on 7 June 2023. Retrieved 7 June 2023.
- ↑ Sakshi (24 March 2023). "ముగ్గురూ గెలిచారు". Archived from the original on 7 June 2023. Retrieved 7 June 2023.